Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0b9b1c7f-e2ed-4d8a-8f92-b1f153df1a6a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0b9b1c7f-e2ed-4d8a-8f92-b1f153df1a6a-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు భారత సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో వరుస మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా వరల్డ్ కప్ ఆడి ట్రోఫీ గెలుచుకుని ఇండియాకు వచ్చి భారతీయులందరిని సంతోషపరిచిన సీనియర్ ప్లేయర్లు విశ్రాంతిలో ఉండగా యంగ్ ప్లేయర్లతో నిండిన టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇక అక్కడ ఐదు మ్యాచ్ లలో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు యువ ఓపెనర్ గిల్ కెప్టెన్సీ వహిస్తూ ఉండడం గమనార్హం. అయితే జింబాబ్Cricket {#}England;New Zealand;Zimbabwe;West Indies;history;World Cup;Yuva;ICC T20;Pakistan;Indiaబిగ్గెస్ట్ విన్.. చరిత్ర సృష్టించిన టీమిండియా?బిగ్గెస్ట్ విన్.. చరిత్ర సృష్టించిన టీమిండియా?Cricket {#}England;New Zealand;Zimbabwe;West Indies;history;World Cup;Yuva;ICC T20;Pakistan;IndiaSun, 14 Jul 2024 11:15:00 GMTమొన్నటి వరకు భారత సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా వెస్టిండీస్ యుఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో వరుస మ్యాచ్ లతో   బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలా వరల్డ్ కప్ ఆడి ట్రోఫీ గెలుచుకుని ఇండియాకు వచ్చి భారతీయులందరిని సంతోషపరిచిన సీనియర్ ప్లేయర్లు విశ్రాంతిలో ఉండగా యంగ్ ప్లేయర్లతో నిండిన టీమిండియా జింబాబ్వే పర్యటనలో ఉంది. ఇక అక్కడ ఐదు మ్యాచ్ లలో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ కు యువ ఓపెనర్ గిల్ కెప్టెన్సీ వహిస్తూ ఉండడం గమనార్హం.



 అయితే జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమిండియా అదరగొట్టేస్తుంది. మరి ముఖ్యంగా యువ ఆటగాళ్లు తమకు వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నారు. టీమిండియాలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నాలుగో t20 మ్యాచ్ లో జింబాబ్వేపై ఇక అదిరిపోయే విజయాన్ని సాధించింది టీమ్ ఇండియా. ఏకంగా జింబాబ్వే పై మునుపెన్నడు లేనివిధంగా అతిపెద్ద విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఏకంగా పదవి వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన పై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.


 ఇటీవల జరిగిన నాలుగో t20 మ్యాచ్ లో జింబాంబే పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది యంగ్ టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా భారత్ చేదించిన అత్యధిక లక్ష్యం ఇదే కావడం గమనార్హం.  153 పరుగులను ఎంతో అలవోకగా చేదించింది టీమ్ ఇండియా. అంతేకాకుండా 28 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఈ విజయం సాధించడంతో బంతుల  పరంగా కూడా ఇదే అతి పెద్ద విజయం. గతంలో పాకిస్తాన్ 200 వర్సెస్ ఇంగ్లాండ్, న్యూజిలాండ్ 169 వర్సెస్ పాకిస్తాన్, ఇంగ్లాండ్ 169 వర్సెస్ ఇండియా పరుగుల లక్ష్యాలను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించాయి అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>