PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila--ys-sharmila--ys-jagan-jagan-mohan-reddy-ycp-tdp-chandranabu2103ccb7-f10f-416e-80c3-bb8f38472597-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila--ys-sharmila--ys-jagan-jagan-mohan-reddy-ycp-tdp-chandranabu2103ccb7-f10f-416e-80c3-bb8f38472597-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటివరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ప్రధాన ప్రత్యర్థని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు. వాస్తవమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కూడా వైసిపి బలమైన పోటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీని కూటమి పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో బాగా కట్టడి చేశాయి. 11 స్థానాలకు పరిమితం చేసాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వచ్చే ఐదు సంవత్సరాలు ప్రత్యర్థుల విష‌యం గ‌మ‌నిస్తే.. సహజంగా ఎవరూ లేరు. ఎందుకంటే వైసిపి ఎలానూ బలంSharmila ; ys Sharmila ; ys jagan; jagan mohan reddy; ycp; tdp; chandranabu{#}RTC;bus;Sharmila;dr rajasekhar;CM;Reddy;YCP;Jagan;Revanth Reddy;CBN;Congress;kalyan;Governmentజ‌గ‌న్‌ కాదు.. ష‌ర్మిల‌తోనే ఇప్పుడు బాబుకు స‌వాల్ త‌ప్ప‌దా..?జ‌గ‌న్‌ కాదు.. ష‌ర్మిల‌తోనే ఇప్పుడు బాబుకు స‌వాల్ త‌ప్ప‌దా..?Sharmila ; ys Sharmila ; ys jagan; jagan mohan reddy; ycp; tdp; chandranabu{#}RTC;bus;Sharmila;dr rajasekhar;CM;Reddy;YCP;Jagan;Revanth Reddy;CBN;Congress;kalyan;GovernmentSun, 14 Jul 2024 09:32:00 GMTరాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇప్పటివరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ప్రధాన ప్రత్యర్థని చంద్రబాబు,  పవన్ కళ్యాణ్  భావించి ఉండొచ్చు. వాస్తవమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు కూడా వైసిపి బలమైన   పోటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీని కూటమి పార్టీలు ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లో బాగా కట్టడి చేశాయి. 11 స్థానాలకు పరిమితం చేసాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ వచ్చే ఐదు సంవత్సరాలు ప్రత్యర్థుల విష‌యం గ‌మ‌నిస్తే.. సహజంగా ఎవరూ లేరు.


ఎందుకంటే వైసిపి ఎలానూ బలంగా లేదు. ఆ పార్టీలో నాయకులు కూడా ఉంటారా? ఉండరా? అనేది రాబోయే రెండు మూడు నెలల్లో తేలిపోతుంది. కాబట్టి వైసిపి తరఫున  జగన్ మాత్రమే పోరాటానికి దిగాల్సి ఉంటుంది. కాబట్టి అది పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. ఎలాగూ పవన్ కళ్యాణ్ వాగ్దాటి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ వంటివి కూటమికి బాగానే కలిసి వస్తాయి. కానీ అసలు స‌మ‌స్య‌.. షర్మిల. సీఎం చంద్రబాబు ఇప్పుడు పోరాటం చేయాల్సింది జగన్ తో కాదు షర్మిలతో. ఈ విషయం రాజకీయ పండితులు చెబుతున్న మాట. ఎందుకంటే తాజాగా షర్మిల చాలా తీవ్రస్థాయిలో చంద్రబాబును కార్నర్ చేసిన విషయం గమనించాలి.


ష‌ర్మిల‌ ప్రస్తుతం తొలినెల గడిచిన ప్రభుత్వం మీదే ఒకింత తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హత్యలు, మహిళల మీద దాడులు జరుగుతున్నాయని, లైంగిక దాడులు జరుగుతున్నాయని, అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమ‌ర్శిస్తున్నారు. గతంలో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు షర్మిల. ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికలకు ముందు చంద్రబాబు   ఇచ్చిన  కీలక హామీలను కూడా ఆమె కార్న‌ర్‌ చేశారు. మహిళలకు ఇస్తామన్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ఏమైంది? అని ప్రశ్నించారు.


తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండో రోజు నుంచి ఆర్టిసి బస్సులను ఉచితంగా మహిళలకు తీసుకొచ్చిందని చెప్పారు. కర్ణాటకలో అధికారం చేపట్టిన రోజు నుంచే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సిద్ధరామయ్య ఆర్టిసి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారని చెప్పుకొచ్చారు. మరి ఏపీలో ఏ కారణాలతో నెల రోజులు పాటు ఆపారని ప్రశ్నించారు. అదే సమయంలో 18 ఏళ్లు నిండిన‌ మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయల పథకం ఏమైంది? అని ప్రశ్నించారు. అంటే ప్రస్తుతానికి ఈ రెండు పథకాలు ప్రశ్నించడం ద్వారా ఇప్ప‌టికి తను పరిమితం అవుతున్నానని చెప్పినా.. మున్ముందు మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేయటం గమనార్హం.


ఇక్కడ చంద్ర‌బాబు స‌ర్కారును జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే ఎదురు దాడి చేయడానికి చంద్రబాబుకు అవకాశం ఉంది. గతంలో నువ్వు ఐదేళ్లు ఏం చేసావ్? ఇప్పుడు విమర్శిస్తున్నావ‌ని చెప్పడానికి లేదా గత ప్రభుత్వం చేసిన లోపాలను ఎండగట్టడానికి, గత ప్రభుత్వం చేసిన త‌ప్పులు చూపించేందుకు గొప్ప ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే నాయకులు కూడా విమర్శలు చేసే అవకాశం ఉంది. కానీ, అసలు అధికారంలో లేనటువంటి షర్మిల, పుంజుకునే దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడితే ఆమెకు కౌంటర్ ఇవ్వడం అంత ఈజీ కాదు. వైసీపీని మేనేజ్ చేయొచ్చు కానీ, షర్మిలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కష్టతరమైన విషయం.


షర్మిల తనను ప్రశ్నిస్తే.. తాను సమాధానం చెప్పకపోతే ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి షర్మిల, కాంగ్రెస్ పరివారం తీసుకువెళ్తాయి. షర్మిల చేసే ప్రకటనలు, షర్మిల చేసే విమర్శలకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిన ప‌రిస్థితి ఉంటుంది. కాబట్టి వైసీపీ విషయంలో చంద్రబాబు ఎదురుదాడి చేసి తప్పించుకోవచ్చు. కానీ షర్మిల విషయానికొచ్చేసరికి ఎదురుదాడి చేయడానికి, తప్పించుకోడానికి కూడా అవకాశం లేదు. పైగా మహిళా సెంటిమెంటు.. వైసిపి కన్నా.. వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జనాల్లోకి వస్తున్న షర్మిలను క్షేత్రస్థాయిలో ఆకర్షించే తీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది.


ఎన్నికలకు ముందు మూడు మాసాల్లో ప్రచారం చేసిన షర్మిల బలమైన వైసీపీ ఓటు బ్యాంకు చీల్చడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు నాలుగున్నరేళ్ళకు పైగా ఆమెకు స‌మ‌యం, అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పూర్తిస్థాయిలో ఈ నాలుగున్నర సంవత్సరాలు క్షేత్రస్థాయిలో తిరుగుతాన‌ని కూడా చెప్పారు. అవకాశం ఉంటే పాదయాత్ర కూడా చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు ప్రభుత్వానికి.. వైసీపీ కంటే ఎక్కువ ప్రత్యర్థిగా షర్మిలను మారుస్తున్నాయన్న సంకేతాలు పంపుతున్నాయ‌ని  పరిశీలకులు సూచిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>