PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hello-india-india-bjp-bye-bye-bjp-india-kutami-bipoles4b049e9b-4ff0-4341-bf46-ceda5955ac73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hello-india-india-bjp-bye-bye-bjp-india-kutami-bipoles4b049e9b-4ff0-4341-bf46-ceda5955ac73-415x250-IndiaHerald.jpgమొన్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నినాదం ఒకటి బాగా హైలైట్ అయింది. హలో ఏపీ.. బై బై వైసీపీ.. హలో ఏపీ.. బై బై వైసిపి.. అని పవన్ ఎన్నికల ప్రచారంలో ఊగిపోతూ చెప్పిన ఈ డైలాగ్‌ను ఆంధ్రప్రదేశ్ జనాలు.. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిజం చేసి చూపించారు. వైసీపీకి నిజంగానే బై చెప్పేశారు. ఇప్పుడు భారతదేశ మొత్తం హలో భారత్.. బై బై బీజేపీ అన్న నినాదాన్ని ఎత్తుకోబోతున్నాయా ? అంటే అవుననే చెప్పాలి. గత కొద్దిరోజులుగా బీజేపీ గ్రాఫ్ శ‌ర‌వేగంగా పతనమౌతూ వస్తోంది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలోనే ఇండియా కHello India; India; BJP; bye bye BJP; India Kutami; bipoles{#}Tamilnadu;Nijam;Hello;Elections;kalyan;Congress;Assembly;Bharatiya Janata Party;Andhra Pradesh;Indiaహ‌లో భార‌త్‌... బైబై బేజేపీ.. నిజ‌మ‌వుతోందా..?హ‌లో భార‌త్‌... బైబై బేజేపీ.. నిజ‌మ‌వుతోందా..?Hello India; India; BJP; bye bye BJP; India Kutami; bipoles{#}Tamilnadu;Nijam;Hello;Elections;kalyan;Congress;Assembly;Bharatiya Janata Party;Andhra Pradesh;IndiaSun, 14 Jul 2024 10:56:01 GMTమొన్న ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ నినాదం ఒకటి బాగా హైలైట్ అయింది. హలో ఏపీ.. బై బై వైసీపీ.. హలో ఏపీ.. బై బై వైసిపి.. అని పవన్ ఎన్నికల ప్రచారంలో ఊగిపోతూ చెప్పిన ఈ డైలాగ్‌ను ఆంధ్రప్రదేశ్ జనాలు.. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిజం చేసి చూపించారు. వైసీపీకి నిజంగానే బై చెప్పేశారు. ఇప్పుడు భారతదేశ మొత్తం హలో భారత్.. బై బై బీజేపీ అన్న నినాదాన్ని ఎత్తుకోబోతున్నాయా ? అంటే అవుననే చెప్పాలి. గత కొద్దిరోజులుగా బీజేపీ గ్రాఫ్ శ‌ర‌వేగంగా పతనమౌతూ వస్తోంది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికలలోనే ఇండియా కూట‌మి ఊహించిన విజయం సాధించింది. కాంగ్రెస్ సైతం 100 సీట్లు కొట్టింది. బీజేపీకి మిత్రపక్షలతో కలిస్తే కానీ పూర్తి మెజార్టీ రాలేదు.


తాజాగా ఏడు రాష్ట్రాలలో 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బీజేపి ఘోర పరాజ‌యం పాలయింది. 11చోట్ల కాంగ్రెస్.. దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తే.. ఒకచోట ఇండిపెండెంట్.. మరో స్థలంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలు బీజేపీ పతనాన్ని సూచిస్తున్నాయి. ఈ ఫలితాలు బీజేపీకి దేశంలో రోజురోజుకు పెరుగుతున్న గడ్డు పరిస్థితిని క్లియర్ గా చూపిస్తున్నాయి. బిహార్ లో ఒకచోట ఉపఎన్నిక జరిగితే.. అక్కడ ఏకంగా ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. అది బీజేపీ మిత్రపక్షం జేడీయు సిట్టింగ్ సీటు. అక్కడ బీజేపీ జేడీయు కలిసి పోటీ చేసిన కూడా ఇండిపెండెంట్ గెలిచాడు అంటేనే.. బీహార్లో బీజేపీ జేడీయు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది.


హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఫిరాయింపు రాజకీయ కారణంగా వచ్చిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఫిరాయింపులకు పాల్పడిన చోట కాంగ్రెస్ గెలిచింది. పంజాబ్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక‌ జరిగితే.. అక్కడ ఆప్‌ భారీ మెజార్టీతో గెలిచింది. తమిళనాడులో.. ఇండియా కూటమి మిత్రపక్షం అయిన‌ డీఎంకే విజయం సాధించింది. ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఉపఎన్నిక‌లు జరిగితే రెండు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో తృణమూల అభ్యర్థులు భారీ విజయం సాధించారు. ఒక తమిళనాడు మినహా బీజేపీ మిగిలిన అన్ని స్థానాలలో ప్రధాన పోటీదారుగా ఉంది. ఏది ఏమైనా ఈ ఫలితాలు బీజేపీకి ఘోర పరాజయాన్ని మిగిల్చాయని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>