PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/faizabad-ayodhya-ayodhya-rama-mandiram-bjp-rss-bhp-badrinath3af2734a-d832-4f6a-b990-0efe8105b6bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/faizabad-ayodhya-ayodhya-rama-mandiram-bjp-rss-bhp-badrinath3af2734a-d832-4f6a-b990-0efe8105b6bb-415x250-IndiaHerald.jpgఅయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది ప్రతి ఒక్క భారతీయ హిందువుని కల. ఇంకా చెప్పాలంటే హిందుత్వంతో సంబంధంలేని ఇతర మతాలకు చెందిన వారు కూడా అయోధ్య రాముడిని ఆరాధించే విషయంలో ముందు ఉంటారు. అయోధ్య రాముడు అనేది ప్రతి ఒక్క భారతీయుడు క‌లగా ఉండిపోయింది. కొన్ని దశాబ్దాల నుంచి అయోధ్య రామ మందిరం నిర్మాణం కలగానే మిగిలిపోతూ వస్తోంది. అలాంటి దాన్ని బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే ఓన్ చేసుకోవటం ఎవరికి నచ్చటం లేదు. బీజేపీ ప్రధానంగా హిందుత్వ ఏజెండాతో ముందుకు వెళ్ళటం.. ఆ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతకFaizabad; Ayodhya; Ayodhya Rama mandiram; BJP; rss; bhp; Badrinath{#}deva;temple;Elections;Badrinath Temple;Faizabad;ram mandir;Uttarakhand;Assembly;Ayodhya;Badrinath;Congress;Bharatiya Janata Party;Bharateeyudu;Partyమొన్న అయోధ్య పోయింది.. ఇప్పుడు బ‌ద్రీనాథ్‌.. బీజేపీ ప‌త‌నం ఈ స్థాయిలోనా ?మొన్న అయోధ్య పోయింది.. ఇప్పుడు బ‌ద్రీనాథ్‌.. బీజేపీ ప‌త‌నం ఈ స్థాయిలోనా ?Faizabad; Ayodhya; Ayodhya Rama mandiram; BJP; rss; bhp; Badrinath{#}deva;temple;Elections;Badrinath Temple;Faizabad;ram mandir;Uttarakhand;Assembly;Ayodhya;Badrinath;Congress;Bharatiya Janata Party;Bharateeyudu;PartySun, 14 Jul 2024 10:48:00 GMTఅయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది ప్రతి ఒక్క భారతీయ హిందువుని కల. ఇంకా చెప్పాలంటే హిందుత్వంతో సంబంధంలేని ఇతర మతాలకు చెందిన వారు కూడా అయోధ్య రాముడిని ఆరాధించే విషయంలో ముందు ఉంటారు. అయోధ్య రాముడు అనేది ప్రతి ఒక్క భారతీయుడు క‌లగా ఉండిపోయింది. కొన్ని దశాబ్దాల నుంచి అయోధ్య రామ మందిరం నిర్మాణం కలగానే మిగిలిపోతూ వస్తోంది. అలాంటి దాన్ని బీజేపీ ఒక్క పార్టీ మాత్రమే ఓన్ చేసుకోవటం ఎవరికి నచ్చటం లేదు. బీజేపీ ప్రధానంగా హిందుత్వ ఏజెండాతో ముందుకు వెళ్ళటం.. ఆ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకతకు నిదర్శనం అని చెప్పాలి.


బీజేపీ హిందుత్వ ఏజెండాను రాజకీయ ప్రయోజనాల కోసం ఎక్కువగా వాడుకుంటుంది. మొన్న అయోధ్య రామ మందిరం నిర్మించిన కూడా అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్ లోక్‌స‌భ నియోజకవర్గాన్ని.. సమాజ్‌వాద్‌ పార్టీ గెలుచుకుంది. అక్కడ ఆ పార్టీ ఓటమి బీజేపీని ఎంత అవాసుపాలు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాముడు గుడి కట్టిన తర్వాత ఏడాది కాకముందే లోక్‌స‌భ ఎన్నికలు వస్తే ఏకపక్షంగా గెలవాల్సిన పైజాబాద్ సీట్ లో బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు. ఇక అయోధ్య ఓటమి మరువకముందే.. దేవ భూమిగా కీర్తించే బద్రీనాథ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఓడిపోయింది.


దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ రిజల్ట్ కూడా వచ్చింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజేందర్ సింగ్ బండారి పై.. కాంగ్రెస్ నేత లకాపత్ సింగ్ 5 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ సింగ్ బండారియే అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బీజేపీలో చేరగా.. ఆ సీటు ఖాళీ అయింది. దీంతో అక్కడ గొప్ప ఎన్నిక జరిగింది. మళ్లీ రాజేందర్ సింగ్ అక్కడ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ సీటు కాపాడుకున్నట్లు అయింది. ఏది ఏమైనా మన అయోధ్య ఇప్పుడు బద్రీనాథ్‌లో ఓటమితో.. కమలనాధుల హిందుత్వ ఎజెండా అనేది పెద్దగా వర్కౌట్ అవుతున్నట్టు లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>