PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-kalyan-ap-cm-chandrababu-ap-deputy-cm-pawan-kalyan-pithapuram-mla-pavan-kutami-government-ap-bjp083a2a98-4c00-4243-8241-68413d21e9ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-pawan-kalyan-ap-cm-chandrababu-ap-deputy-cm-pawan-kalyan-pithapuram-mla-pavan-kutami-government-ap-bjp083a2a98-4c00-4243-8241-68413d21e9ea-415x250-IndiaHerald.jpgఏపీలో జరిగిన ఎన్నికలలో.. తెలుగుదేశం, బీజేపి, జనసేన మూడు పార్టీల కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఎవరు ఊహించిన రీతిలో ఏకంగా 161 అసెంబ్లీ, 21 లోక్సభ స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజార్టీతో అధికార పీఠం కైవసం చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలన్న కసితో తనను తాను తగ్గించుకుని చాలా తక్కువ సీట్లు తీసుకుని.. ఎన్నో త్యాగాలు చేసి మరీ.. టీడీపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేశారు. చివరకు తనకు ఇచ్చిన సీట్లలో కూడా బీజేపీ కోసం మూడు అసెంబ్లీ, అనకాపల్లి పార్లమెంటు స్థానChandrababu; Pawan Kalyan; ap cm chandrababu; AP deputy CM pawan kalyan; Pithapuram MLA Pavan; kutami government; ap bjp{#}Anakapalle;MLA;Telugu Desam Party;Janasena;Bharatiya Janata Party;Party;Yevaru;kalyan;TDP;CBN;Ministerప‌వ‌న్‌, బాబు ఇలా అయితే ఐదేళ్ళ కాపురం క‌ష్ట‌మేనా.. !ప‌వ‌న్‌, బాబు ఇలా అయితే ఐదేళ్ళ కాపురం క‌ష్ట‌మేనా.. !Chandrababu; Pawan Kalyan; ap cm chandrababu; AP deputy CM pawan kalyan; Pithapuram MLA Pavan; kutami government; ap bjp{#}Anakapalle;MLA;Telugu Desam Party;Janasena;Bharatiya Janata Party;Party;Yevaru;kalyan;TDP;CBN;MinisterSat, 13 Jul 2024 07:56:36 GMTఏపీలో జరిగిన ఎన్నికలలో.. తెలుగుదేశం, బీజేపి, జనసేన మూడు పార్టీల కూటమి తిరుగులేని విజయం సాధించింది. ఎవరు ఊహించిన రీతిలో ఏకంగా 161 అసెంబ్లీ, 21 లోక్సభ స్థానాలు గెలుచుకుని తిరుగులేని మెజార్టీతో అధికార పీఠం కైవసం చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ సైతం ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలన్న కసితో తనను తాను తగ్గించుకుని చాలా తక్కువ సీట్లు తీసుకుని.. ఎన్నో త్యాగాలు చేసి మరీ.. టీడీపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేశారు. చివరకు తనకు ఇచ్చిన సీట్లలో కూడా బీజేపీ కోసం మూడు అసెంబ్లీ, అనకాపల్లి పార్లమెంటు స్థానం సైతం వదులుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.


పొత్తులో భాగంగా జనసేన కూడా ప్రభుత్వంలో చేరింది. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కు కీలకమైన మంత్రిత్వ శాఖలు కట్టబెట్టడంతో పాటు.. డిప్యూటీ సీఎం, అటు నాదెండ్ల మనోహర్, కందులు దుర్గేష్ కు సైతం మంత్రి పదవులు కట్టబెట్టారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలలో.. జనసేన నాయకులు పదవులు విషయంలో పట్టుబడుతున్నారు. చాలామంది కీలక నేతల సైతం ఎమ్మెల్యే సీట్లు త్యాగాలు చేసిన పరిస్థితి. ఇప్పుడు వారంతా రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ పదవులు, ఏఎంసీ చైర్మన్ పదవుల కోసం పట్టుబడుతున్నారు.


అయితే టీడీపీలోనే ఈ పదవుల కోసం తీవ్రమైన పోటీ ఉండడంతో సొంత పార్టీ నేతలను కాదని.. చంద్రబాబు జనసేన వాళ్లకు పదవులు ఇస్తారా..? అన్న సందేహం ఉంది. అవునన్నా, కాదన్నా ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ నేతలు జనసేన క్యాడర్‌ను కలుపుకుని వెళ్లడం లేదు. ఒకవేళ కలుపుకుని వెళ్లినా.. పదవుల విషయంలో మాత్రం జనసేనకు ఇస్తే చూస్తూ ఊరుకునేందుకు రెడీగా లేరు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఏఎంసీ చైర్మన్ పదవులు, నామినేటెడ్ పదవులు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ క్యాడర్ ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదు.


ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై సైతం గట్టిగా ఒత్తిళ్లు ఉన్నాయి. పదవులు ఇవ్వకపోతే జనసేన క్యాడర్ కూడా తమ సత్తా చూపించేందుకు కాచుకుని ఉంది. ఏది ఏమైనా క్షేత్రస్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య సమన్వయం లేకపోతే జనసేన, టీడీపీ కాపురం ఐదేళ్లు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగుతుందా..? అన్నది సందేహమే అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>