PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-tsc-revanth-reddy-telangana-chief-minister-revanth-reddy-v-hanumantha-rao--congress-af2c3349-f2bf-495c-a4ef-43391ef23a71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-tsc-revanth-reddy-telangana-chief-minister-revanth-reddy-v-hanumantha-rao--congress-af2c3349-f2bf-495c-a4ef-43391ef23a71-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా.. ఈ ఆరు నెలల పదవీకాలంలో.. పాలనాపరమైన సంస్కరణల కంటే సొంత పార్టీ నేతల కుమ్ములాటలను పరిష్కరించటం.. వారి అసంతృప్తులు, అలకలను తీర్చడం పైనే ఎక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితి. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేవలం రేవంత్ రెడ్డి పడిన కష్టంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలకRevanth Reddy; tsc Revanth Reddy;Telangana Chief Minister Revanth Reddy; V Hanumantha Rao ; Congress {#}revanth;Telangana;Revanth Reddy;Rajya Sabha;రాజీనామా;Culture;Service;Khammam;Congress;Telangana Chief Minister;Party;MP;central government;Reddy;Governmentరేవంత్‌రెడ్డిని వ‌ద‌ల‌బొమ్మాళి అంటున్న టీ కాంగ్రెస్ టాప్ లీడ‌ర్‌..!రేవంత్‌రెడ్డిని వ‌ద‌ల‌బొమ్మాళి అంటున్న టీ కాంగ్రెస్ టాప్ లీడ‌ర్‌..!Revanth Reddy; tsc Revanth Reddy;Telangana Chief Minister Revanth Reddy; V Hanumantha Rao ; Congress {#}revanth;Telangana;Revanth Reddy;Rajya Sabha;రాజీనామా;Culture;Service;Khammam;Congress;Telangana Chief Minister;Party;MP;central government;Reddy;GovernmentSat, 13 Jul 2024 08:03:00 GMTరేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కూడా.. ఈ ఆరు నెలల పదవీకాలంలో.. పాలనాపరమైన సంస్కరణల కంటే సొంత పార్టీ నేతల కుమ్ములాటలను పరిష్కరించటం.. వారి అసంతృప్తులు, అలకలను తీర్చడం పైనే ఎక్కువ టైం కేటాయించాల్సిన పరిస్థితి. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేవలం రేవంత్ రెడ్డి పడిన కష్టంతో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోంది. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలను సైతం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే సొంత పార్టీకి చెందిన నేతలు మాత్రం రేవంత్ పై ఎప్పటికప్పుడు రుసరుసలాడుతూ బెదిరిస్తూ వస్తున్నారు.


రేవంత్ ఎంత సహనంతో ఉండాలని చూస్తున్నా కూడా కాంగ్రెస్ గోల గోల సంస్కృతి నేపథ్యంలో ఎవరికి వారు బెదిరింపులు.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్‌లో సీనియర్ నేత అయిన వి. హనుమంతరావు సైతం ఇప్పుడు తనకు ఎంపీ పదవి కావాలని పట్టుబడుతున్నారట. 76 ఏళ్ల వి. హనుమంతరావు గత 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మూడుసార్లు రాజ్యసభ, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన.. మంత్రిగాను, కేంద్ర మంత్రిగాను కూడా పనిచేశారు. గత ఎన్నికల్లోనే ఆయన సికింద్రాబాద్ లేదా ఖమ్మం పార్లమెంటు స్థానాలలో ఏదో ఒక సీటు కావాలని పట్టుబట్టినా అప్పటి సమీకరణాల వల్ల కుదరలేదు.


ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి.. తనను రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన కే.కే స్థానంలో తనను రాజ్యసభకు పంపాలని హనుమంతరావు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయనకు 76 సంవత్సరాలు వచ్చేసాయి. ఈ వయసులో పార్టీకి సేవ చేసుకోవాలి తప్ప.. ఇప్పుడు కూడా పదవి కావాలని పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టటం సరికాదని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. అయినా వి.హనుమంతరావు మాత్రం తనకు కచ్చితంగా పదవి కావాలని.. తాను రాజ్యసభకు వెళతానని ఘీంకారాలు వేస్తుండటం విచిత్రం అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>