PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kinjarapu-ram-mohan-naidu-bhogapuram-tdp-kutami-errannaidu231c55b5-d4a6-4ddf-ae0d-205e4998824a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kinjarapu-ram-mohan-naidu-bhogapuram-tdp-kutami-errannaidu231c55b5-d4a6-4ddf-ae0d-205e4998824a-415x250-IndiaHerald.jpgతండ్రి ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన నేతగా ఎదిగారు సిక్కోలు సింగం రామ్మోహన్ నాయుడు.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేతగా మంచి గుర్తింపు సంపాదించారు. పార్లమెంటులో బలమైన గొంతును వినిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయన అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి రామ్మోహన్ నాయుడు తండ్రి మరణం తర్వాత క్రియాశKINJARAPU RAM MOHAN NAIDU;BHOGAPURAM;TDP KUTAMI;ERRANNAIDU{#}Ram Mohan Naidu Kinjarapu;Narendra Modi;MP;Srikakulam;Tirupati;students;Uttarandhra;central government;Parliment;Vishakapatnam;Telugu;Father;Andhra Pradesh;Ministerరామ్మోహన్ నాయుడు:సిక్కోలు సింగం పేద ప్రజలకు ధైర్యం.!రామ్మోహన్ నాయుడు:సిక్కోలు సింగం పేద ప్రజలకు ధైర్యం.!KINJARAPU RAM MOHAN NAIDU;BHOGAPURAM;TDP KUTAMI;ERRANNAIDU{#}Ram Mohan Naidu Kinjarapu;Narendra Modi;MP;Srikakulam;Tirupati;students;Uttarandhra;central government;Parliment;Vishakapatnam;Telugu;Father;Andhra Pradesh;MinisterSat, 13 Jul 2024 07:22:19 GMT- చిన్న వయసులో కేంద్ర మంత్రిగా రికార్డ్..
- ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర..
-  శరవేగంగా భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు..


తండ్రి ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన నేతగా ఎదిగారు సిక్కోలు సింగం రామ్మోహన్ నాయుడు.. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేతగా మంచి గుర్తింపు సంపాదించారు. పార్లమెంటులో బలమైన గొంతును వినిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయన  అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా  ప్రమాణ స్వీకారం చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి రామ్మోహన్ నాయుడు తండ్రి మరణం తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాడు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రామ్మోహన్ నాయుడు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై కొట్లాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. 2013 నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినటువంటి రామ్మోహన్ నాయుడు టిడిపిలో కీలకంగా వ్యవహరించారు.

2014లో శ్రీకాకుళం నుంచి మొదటిసారిగా పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టాడు. అప్పటికీ రామ్మోహన్ వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. దీంతో 16వ లోక్ సభలో రెండవ అతి చిన్న వయస్కుడిగా పేరుపొందారు.ఆ తర్వాత 2019లో మరోసారి గెలుపొంది పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఈ సమయంలోనే  పార్లమెంటులో ఏపీకి సంబంధించి తన గళాన్ని వినిపించాడు. ప్రత్యేక హోదా, రైల్వేస్టేషన్,  విమానాశ్రయాలు ఇలా ఏపీకి సంబంధించిన ఎన్నో సమస్యలపై  కేంద్ర పెద్దలతో కొట్లాడాడు. దీంతో రామ్మోహన్ నాయుడు పేరు రాష్ట్రంలోనే మార్మోగిపోయింది.  చివరికి 2024 ఎంపీ ఎలక్షన్స్ లో అద్భుతమైన మెజారిటీతో గెలుపొందిన రామ్మోహన్ నాయుడును కేంద్ర మంత్రి పదవి వరించింది. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలాంటి రామ్మోహన్ నాయుడు రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేశారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు:
 రామ్మోహన్ నాయుడు చిన్న వయసులోనే రాష్ట్ర సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ  వచ్చారు. దీంతో కేంద్ర పెద్దల కన్ను రామ్మోహన్ నాయుడుపై పడింది.  చిన్న వయసులోనే ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారని నరేంద్ర మోడీ కూడా రామ్మోహన్ నాయుడుని మెచ్చుకున్నారు.  అంతేకాకుండా రామ్మోహన్ నాయుడు చేసిన సేవలకు గాను ఆయనకు సంసాద్ రత్న అనే అవార్డుతో సత్కరించారు.  అవార్డు అందుకున్న మొదటి తెలుగు వ్యక్తి అతి చిన్న వయస్కుడు కూడా రామ్మోహన్ నాయుడు. అలాంటి రామ్మోహన్ నాయుడు ఏపీకి ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు అనే వివరాలు చూద్దాం.  శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి,  2021లో శ్రీకాకుళం నుంచి తిరుపతి వెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి రైలు మంజూరు చేయించారు. అంతేకాకుండా విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్లేందుకు కూడా మరో ప్రత్యేకమైనటువంటి రైలు మంజూరు చేయడంలో ముఖ్యపాత్ర పోషించారు.


దీంతో పాటుగా ఉత్తరాంధ్ర  నేతన్నలకు బాసటగా నిలిచేందుకు కొందరు ఖాదికి జిఐ ట్యాగ్ లభించడంలో రామ్మోహన్ నాయుడు ఎంతో కృషి చేశారు. చివరికి రామ్మోహన్ నాయుడు చేసిన కృషికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సత్కరించారు.  శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ పరీక్షలు రాయాలి అంటే విశాఖపట్నం లేదంటే భువనేశ్వర్ వెళ్లాల్సి వచ్చేది. కానీ రామ్మోహన్ నాయుడు కేంద్ర నాయకులతో మాట్లాడి, ఎలాంటి కేంద్ర పరీక్షలైనా సరే సెంటర్ అక్కడే ఉండే విధంగా పరీక్షా కేంద్రాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్  పనులను శరవేగంగా జరిపించడంలో రామ్మోహన్ నాయుడు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు.  ఇవే కాకుండా ఆయన కేంద్రం నుంచి మరెన్నో అభివృద్ధి పనులు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారని చెప్పవచ్చు .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>