PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/schools-ap-cbn-fee-govt-school51892d1e-7cba-4a20-965e-1b04bed6e4c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/schools-ap-cbn-fee-govt-school51892d1e-7cba-4a20-965e-1b04bed6e4c5-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ప్రభుత్వ స్కూళ్లన్నీ మూతపడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఇలా డబ్బు ఉన్నా, లేకపోయినా ప్రైవేట్ స్కూళ్లకు పంపాలని ఒక ఆలోచనతో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కి పంపుతున్నారు. డబ్బున్న వాళ్లకైతే ఏం ప్రాబ్లం ఉండదు కానీ మధ్యతరగతి పేద ప్రజలకు అయితే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టడం అధిక భారంగా మారుతుంది. స్కూల్ ఫీజు వ్యాన్, బుక్స్ ఫీజు వగైరా వగైరా ఇలా నర్సరీ విద్యార్థులకే వేలాది రూపాయల ఫీజులు తీసschools;ap;cbn;fee;govt school{#}Ishtam;vidya;Parents;School;Andhra Pradesh;CBN;Governmentఏపీ:విద్యా విధానంలో సరికొత్త మార్పు వస్తుందా.?ఏపీ:విద్యా విధానంలో సరికొత్త మార్పు వస్తుందా.?schools;ap;cbn;fee;govt school{#}Ishtam;vidya;Parents;School;Andhra Pradesh;CBN;GovernmentSat, 13 Jul 2024 11:32:57 GMT ప్రస్తుత కాలంలో ప్రభుత్వ స్కూళ్లన్నీ మూతపడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి ఒకరు ఇలా డబ్బు ఉన్నా, లేకపోయినా ప్రైవేట్ స్కూళ్లకు పంపాలని ఒక ఆలోచనతో చాలామంది తల్లిదండ్రులు  వారి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కి పంపుతున్నారు. డబ్బున్న వాళ్లకైతే ఏం ప్రాబ్లం ఉండదు కానీ మధ్యతరగతి పేద ప్రజలకు అయితే ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కట్టడం అధిక భారంగా మారుతుంది. స్కూల్ ఫీజు వ్యాన్, బుక్స్ ఫీజు  వగైరా వగైరా ఇలా  నర్సరీ విద్యార్థులకే వేలాది రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు. ఈ విధంగా  ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వారిని చదివించడానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మొత్తం పని చేయవలసి వస్తోంది. 

ఈ విధంగా చాలామంది పిల్లల కోసం ఎంతో కష్టపడుతూ  వచ్చిన డబ్బులను ప్రైవేట్ స్కూల్లో పాలు చేస్తున్నారు. మరి అలాంటి ప్రైవేట్ స్కూళ్ల ఏపీ ప్రభుత్వం అయినా మార్పులు తీసుకువస్తుందా.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సాధారణంగా ఇండియాలో తప్ప చాలా దేశాల్లో విద్యా మరియు  వైద్యపరంగా  ఫ్రీ గా ఉంటుంది. కానీ మనదేశంలో అది పూర్తిగా కరువవుతోంది. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు  పిల్లలకు విద్య అందించాలని కష్టపడుతూ  అనేక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. దీంతో హాస్పిటల్స్ పాలై  అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.  సాధారణ మధ్యతరగతి ప్రజలందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది. మరి ఇదంతా మారాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేస్తేనే సరిపోదు, ప్రైవేట్ స్కూళ్లతో కూడా మార్పు తీసుకురావచ్చు.

దేశంలోని స్కూల్స్  అన్నింటినీ జాతీయం చేసి అదే మేనేజ్మెంట్ తో నడిపించే ప్రయత్నం చేయాలి. జాతీయం చేయడం వల్ల దేశంలో ఏ స్కూల్లో అయినా సరే, ఎలాంటి స్కూల్లో అయినా సరే ఫీజు అనేది నియంత్రణలోకి వస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం పెడితే ఆ విధంగానే స్కూల్ ఫీజులు కానీ ఇతర ఫీజులు కానీ తీసుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు దీని గురించి ఆలోచించడం లేదు.  దీనికి ప్రధాన కారణం స్కూల్స్, కాలేజెస్ ఉన్నవి మొత్తం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులే.  కాబట్టి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ ప్రభుత్వ స్కూళ్లను పాడు చేస్తూ ప్రైవేట్ స్కూళ్లను పెంచుతున్నారు. ఈ విషయంపై ఏపీలో  ఏదైనా మార్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు,  విద్యా విధానం విషయంలో చంద్రబాబు నాయుడు నియంత్రణ తీసుకువస్తారా లేదంటే మనకెందుకులే అని సైలెంట్ గా ఉంటారా అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>