Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-dola-bala-veeranjaneya-swamy0fdc1e56-c331-40d2-b401-8020229b8421-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-dola-bala-veeranjaneya-swamy0fdc1e56-c331-40d2-b401-8020229b8421-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి జరిగిన ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అలాగే కూటమిలో భాగంగా వున్న జనసేన పార్టీ 21ఎమ్మెల్యే, 2పార్లమెంట్ సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని మెజారిటితో గెలుపొందారు. అంతే కాదు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టి పాలనలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ#dola bala veeranjaneya swamy{#}Evening;Pawan Kalyan;CM;Government;Andhra Pradesh;CBN;Janasena;Ministerకూటమి పాలన @ 30 : పాలనలో జోరు చూపిస్తున్న ఆ టీడీపీ మంత్రి..!!కూటమి పాలన @ 30 : పాలనలో జోరు చూపిస్తున్న ఆ టీడీపీ మంత్రి..!!#dola bala veeranjaneya swamy{#}Evening;Pawan Kalyan;CM;Government;Andhra Pradesh;CBN;Janasena;MinisterSat, 13 Jul 2024 08:08:00 GMT
* పింఛను పంపిణీ విషయంలో విప్లవాత్మక నిర్ణయం

* త్వరలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం

* వాలంటీర్ వ్యవస్థలో భారీ మార్పులు వుండే అవకాశం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి జరిగిన ఎన్నికలలో కూటమి తిరుగులేని విజయం సాధించింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అలాగే కూటమిలో భాగంగా వున్న జనసేన పార్టీ 21ఎమ్మెల్యే, 2పార్లమెంట్ సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తిరుగులేని మెజారిటితో గెలుపొందారు. అంతే కాదు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టి పాలనలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి అయింది. ఈ నెల రోజులలో సీఎం చంద్రబాబు పలు కీలక సంస్కరణలు చేసారు. రాష్ట్ర ప్రజలకు పాలనా పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సంబంధిత అధికారులని ఆదేశించారు. అదే విధంగా పలు శాఖలకు మంత్రి వర్గం ఏర్పాటు చేసిన చంద్రబాబు నిత్యం ఆ శాఖల మంత్రుల పని తీరుని గమనిస్తున్నారు.ఏపీ సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల శాఖ మంత్రిగా వున్న డోలా బాల వీరాంజనేయ స్వామి పాలనలో ఎంతగానో జోరు చూపిస్తున్నారు.మంత్రిగా భాద్యతలు తీసుకున్న వెంటనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వృద్దులకు,దివ్యాంగులకు ప్రతి నెల ఒకటో తేదీనే సచివాలయ ఉద్యోగుల చేత ఇంటి దగ్గరే పింఛన్ అందేలా ఆదేశాలు జారీ చేసారు. ఉదయం 5 గంటల నుండే పింఛన్ పంపిణి మొదలు పెట్టి సాయంత్రం లోపు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.3 వేల పెన్షన్‌ను ఏకంగా రూ.4 వేలకు పెంచుతు ఉత్తర్వులు జారీ చేసారు...దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి లబ్ది చేకూరింది.అలాగే రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకుంటామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. త్వరలోనే విప్లవత్మాక నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>