PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-aanam-rama-narayana-reddy-acha-naidu-kulsum-padasarathi-mnd-farooq-ap-cabinet-ap-cm-chandrababu-naidu6bcd28e3-e4fc-4d56-83dc-dfe48cea9a78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-aanam-rama-narayana-reddy-acha-naidu-kulsum-padasarathi-mnd-farooq-ap-cabinet-ap-cm-chandrababu-naidu6bcd28e3-e4fc-4d56-83dc-dfe48cea9a78-415x250-IndiaHerald.jpg- మంత్రైనా ఇంకా యాక్టివ్ కాని ఆనం.. అనారోగ్యంతో అచ్చెన్న‌ది అదే దారి - ఫ‌రూక్ నెల రోజు ప్ర‌గ‌తి కూడా జీరోయే... - కొలుసు ప‌నితీరు కూడా ఎబో యావ‌రేజ్‌ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల రోజులు అయింది. మ‌రి ఈ నెల రోజుల్లో సీనియ‌ర్ మంత్రుల దూకుడు ఎలా ఉంది? అంటే.. చ‌ప్ప‌చ‌ప్ప‌గానే ఉంద‌న్న స‌మాచారం అందుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. ఈ క్రమంలో సీనియ‌ర్ల‌కు మంత్రి పదవులు ఇచ్చారు. జూనియర్ల పరిస్థితి పక్కన పెడితే సీనియర్ల పరిస్థితి ఎట్లా Minister aanam Rama Narayana Reddy; acha Naidu; kulsum padasarathi; mnd Farooq; AP cabinet; AP cm Chandrababu Naidu{#}pragathi;Nadendla Manohar;Amaravathi;Dookudu;India;CBN;Janasena;Ministerకూట‌మి పాల‌న @ 30 : చ‌ప్ప‌చ‌ప్ప‌గా సీనియ‌ర్ మంత్రుల ప‌నితీరు..!కూట‌మి పాల‌న @ 30 : చ‌ప్ప‌చ‌ప్ప‌గా సీనియ‌ర్ మంత్రుల ప‌నితీరు..!Minister aanam Rama Narayana Reddy; acha Naidu; kulsum padasarathi; mnd Farooq; AP cabinet; AP cm Chandrababu Naidu{#}pragathi;Nadendla Manohar;Amaravathi;Dookudu;India;CBN;Janasena;MinisterSat, 13 Jul 2024 08:10:07 GMT- మంత్రైనా ఇంకా యాక్టివ్ కాని ఆనం.. అనారోగ్యంతో అచ్చెన్న‌ది అదే దారి
- ఫ‌రూక్ నెల రోజు ప్ర‌గ‌తి కూడా జీరోయే...
- కొలుసు ప‌నితీరు కూడా ఎబో యావ‌రేజ్‌
 
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నెల రోజులు అయింది. మ‌రి  ఈ నెల రోజుల్లో సీనియ‌ర్ మంత్రుల దూకుడు ఎలా ఉంది?  అంటే.. చ‌ప్ప‌చ‌ప్ప‌గానే ఉంద‌న్న స‌మాచారం అందుతోంది.  రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులైంది. ఈ క్రమంలో సీనియ‌ర్ల‌కు మంత్రి పదవులు ఇచ్చారు.  జూనియర్ల పరిస్థితి పక్కన పెడితే సీనియర్ల పరిస్థితి ఎట్లా ఉంది? సీనియర్లు ఏ మేరకు దూకుడుగా వ్యవహరించారు? తమ అనుభవాన్ని రంగరించి ఈ నెల రోజుల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఆసక్తిగా మారింది.


ఈ విషయాన్ని గమనిస్తే ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడు. ఆయన గత నెల రోజుల్లో ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ఏ ఏ పనులు చేశారు?  చూస్తే.. కొద్దిగా ఇబ్బంది ఏర్ప‌డుతోంది. ఆయన బయటకు వచ్చిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. కొన్ని రోజులు తనకు ప్రాధాన్యం లేని పదవి ఇచ్చారంటూ అలిగారు. ఆ తర్వాత మళ్లీ సర్దుకున్నారు. ప్రస్తుతం అయితే మంత్రివర్గంలో ఆయన కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ఇంటి నుంచి బయటకు అయితే రావడం లేదు. దీంతో ఈ నెల రోజుల్లో ఆయన సాధించిన పెద్ద ప్రగతి అయితే ఏమి కనిపించలేదు.


ఇక మరో సీనియర్ నాయకుడు కింజరాపు అచ్చం నాయుడు. ఈయన ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా కో-ఆపరేటివ్ మార్కెటింగ్, యానిమల్ హస్బెండ్రీ ఇలాంటి శాఖలను చూస్తున్నారు. అయితే ఈయన కూడా గత నెల రోజులుగా అనారోగ్య కారణాలతో  బయటికి రావడం లేదు. కేవలం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఆ తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఇక మరో సీనియర్ మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీకి చెందిన మంత్రి అయినప్పటికీ పౌరసరఫరాల శాఖలో అవినీతి అక్రమాలకు వెలికి తీసేందుకు ప్రాధాన్యమిస్తూ దూకుడుగా ఉన్నారు.


ఇదేస‌మ‌యంలో ప్రజలకు తక్కువ ధరకు నిత్యావసరాలు అందించేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తంగా నాదెండ్ల మనోహర్ పనితీరు ఈ నెల రోజుల్లో బాగానే ఉందని ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. ఇక మైనారిటీ న్యాయశాఖ మంత్రిగా సీనియర్ నాయకుడు మహమ్మద్ ఫరూక్ వ్యవహరిస్తున్నారు. ఈయన కూడా గత నెల రోజులుగా ప్రజల్లో పెద్దగా కనిపించలేదు. అయితే మునుముందు ఆయన సేవల‌ పనితీరు ఎట్లా ఉంటుందనేది చూడాలి.  మరో సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి. ఈయన హౌసింగ్, సమాచార ప్రసార శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.


కొలుసు  గతంలో కూడా మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఈయన తన అనుభవాన్ని వినియోగించి చేయాలని ఉన్నప్పటికీ ఈ రెండు శాఖల్లోనూ ప‌ని చేసేందుకు పెద్దగా అవకాశం ఆయనకి లేదు. దీంతో ఉన్నంత మేరకు పనిచేస్తున్నారని చెప్పాలి. సో ఇలా  సీనియర్ మంత్రుల వ్యవహారం ప‌రిశీలిస్తే.. కొందరు ఆసక్తిగా పనిచేస్తుంటే మరి కొందరు తమ తమ శాఖల పరిధిలో తమకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి మాత్రమే ముందుకు వెళ్తున్నారని చెప్పక తప్పదు. మొత్తానికి  వారి శాఖలపై కొంత పట్టు సాధించేందుకు వారు ప్రయత్నం అయితే చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>