MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-box-officeb5160d54-80c3-42ae-b563-5550eccaf12b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/indian-box-officeb5160d54-80c3-42ae-b563-5550eccaf12b-415x250-IndiaHerald.jpgవెయ్యి కోట్లు కొల్ల‌గొట్టిన ఇండియ‌న్ సినిమాల్లో ఏ ఇండస్ట్రీ టాప్ అంటే? ఒకప్పుడు ఇండియన్ సినిమాకి వంద కోట్ల కలెక్షన్స్ అనేవి సాధించలేని ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మార్క్ ని ఒక్క రోజులోనే అందుకుంటున్నాయి ఇండియన్ సినిమాలు.ప్రస్తుతం సినిమాల ముందు ఉన్న పెద్ద లక్ష్యం వెయ్యి కోట్ల మార్క్. బాహుబలి మూవీతో రాజమౌళి రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి.. ఇతర ఫిలిం మేకర్స్ కి పెద్ద లక్ష్యాన్ని ఇచ్చారు. అయితే అక్కడి వరకు కాకపోయినా, కేవలం వెయ్యి కోట్ల మార్క్ ని అయినా అందుకుంటే చాలని ప్రIndian Box Office{#}atlee kumar;Bahubali;KGF;Dangal;Kollywood;Tollywood;Rajamouli;Shahrukh Khan;Jawaan;Prabhas;bollywood;Hero;shankar;Tamil;Cinema;Industry;Indianవెయ్యి కోట్లు కొల్ల‌గొట్టిన ఇండియ‌న్ సినిమాల్లో ఏ ఇండస్ట్రీ టాప్ అంటే?వెయ్యి కోట్లు కొల్ల‌గొట్టిన ఇండియ‌న్ సినిమాల్లో ఏ ఇండస్ట్రీ టాప్ అంటే?Indian Box Office{#}atlee kumar;Bahubali;KGF;Dangal;Kollywood;Tollywood;Rajamouli;Shahrukh Khan;Jawaan;Prabhas;bollywood;Hero;shankar;Tamil;Cinema;Industry;IndianSat, 13 Jul 2024 17:47:00 GMT
ఒకప్పుడు ఇండియన్ సినిమాకి వంద కోట్ల కలెక్షన్స్ అనేవి సాధించలేని ఒక పెద్ద లక్ష్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మార్క్ ని ఒక్క రోజులోనే అందుకుంటున్నాయి ఇండియన్ సినిమాలు.ప్రస్తుతం సినిమాల ముందు ఉన్న పెద్ద లక్ష్యం వెయ్యి కోట్ల మార్క్. బాహుబలి మూవీతో రాజమౌళి రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసి.. ఇతర ఫిలిం మేకర్స్ కి పెద్ద లక్ష్యాన్ని ఇచ్చారు. అయితే అక్కడి వరకు కాకపోయినా, కేవలం వెయ్యి కోట్ల మార్క్ ని అయినా అందుకుంటే చాలని ప్రస్తుత సినిమాలు టార్గెట్ పెట్టుకున్నాయి.ఇక బాహుబలి తరువాత బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా వెయ్యికోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. అయితే బాహుబలి 2 రిలీజ్ తరువాత దంగల్ ని చైనాలో మళ్ళీ రిలీజ్ చేసారు. ఇక అక్కడ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, ఆ కలెక్షన్స్ ని కూడా జతచేసుకొని 1900 కోట్ల పైగా వసూలు చేసి బాహుబలి 2 కలెక్షన్స్ ని  క్రాస్ చేసింది దంగల్. ఇక ఈ రెండిటి తరువాత ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2,  సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసాయి. ఆర్ ఆర్ ఆర్ జపాన్ రీరిలీజ్ తో కలిపి 1300 కోట్ల పైగా వసూలు చేయగా కేజీఎఫ్ 1200 కోట్ల పైగా వసూలు చేసింది. వీటి తరువాత గత ఏడాది షారుఖ్ నటించిన పఠాన్ 1000 కోట్ల పైగా , జవాన్ సినిమా 1100  కోట్ల పైగా వసూళ్లు అందుకొని సంచలనం సృష్టించాయి.


 ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా 1000 కోట్ల పైగా వసూలు చేసి 1100 కోట్ల వైపు దూసుకుపోతుంది.ఇప్పటి దాకా మొత్తం ఏడు సినిమాలు వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తే.. వాటిలో టాలీవుడ్ నుంచి మూడు, బాలీవుడ్ నుంచి మూడు ఇంకా శాండిల్‌వుడ్ నుంచి ఒకటి ఉంది. తమిళ్ పరిశ్రమ నుంచి మాత్రం ఇప్పటి దాకా ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేయలేకపోయింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు తమిళ్ పరిశ్రమ టెక్నికల్ గా నెంబర్ వన్ ఇండస్ట్రీ అనిపించుకుంది. తమిళ్ ఇండస్ట్రీలో మణిరత్నం, మురుగదాస్, శంకర్ వంటి టాప్ డైరెక్టర్స్ తెరకెక్కించిన సినిమాలు ఇతర పరిశ్రమల్లో కూడా రికార్డులు సృష్టించేవి. కానీ ఇప్పుడు 1000 కోట్ల హిట్ కోసం చాలా కష్టపడుతుంది తమిళ ఇండస్ట్రీ. జవాన్ తెరకెక్కించిన అట్లీ తమిళ వాడైనా అది బాలీవుడ్ సినిమా పైగా షారుఖ్ ఖాన్ సినిమా కావడంతో పూర్తి క్రెడిట్ బాలీవుడ్ కె పోతుంది. ఇక రోబో 2.0 700 కోట్ల పైగా వసూళ్లు సాధించి కోలీవుడ్ లో టాప్ లో ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>