MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sathya-sri428738d6-0056-48eb-8ab3-55c280593a51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sathya-sri428738d6-0056-48eb-8ab3-55c280593a51-415x250-IndiaHerald.jpgసీరియల్ నటి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి... మిస్ ఆంధ్రగా నిలిచింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా చాలా రకాల బ్రాండ్లకు పని కూడా చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు గర్ల్ ఫ్రెండ్ పాత్రలో చేసింది. ఆ తర్వాత గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ సినిమాలలో నటించింది. ఇక ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బుల్లితెరలో అడుగుపెట్టింది. ముద్sathya sri{#}sree;Bigboss;BEAUTY;Godavari River;News;Hero;media;Cinema;Loveఆ పార్ట్‌ చిన్నగా ఉందని...సర్జరీ చేయించుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ?ఆ పార్ట్‌ చిన్నగా ఉందని...సర్జరీ చేయించుకున్న బిగ్‌బాస్‌ బ్యూటీ?sathya sri{#}sree;Bigboss;BEAUTY;Godavari River;News;Hero;media;Cinema;LoveSat, 13 Jul 2024 16:04:00 GMT
సీరియల్ నటి శ్రీ సత్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా తన కెరియర్ ప్రారంభించి... మిస్ ఆంధ్రగా నిలిచింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. అంతేకాకుండా చాలా రకాల బ్రాండ్లకు పని కూడా చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ నేను శైలజ సినిమాలో హీరో రామ్ కు గర్ల్ ఫ్రెండ్ పాత్రలో చేసింది. ఆ తర్వాత గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ సినిమాలలో నటించింది. ఇక ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బుల్లితెరలో అడుగుపెట్టింది. ముద్దమందారం, అత్తారింట్లో అక్క చెల్లెలు, నిన్నే పెళ్ళాడుతా, త్రినయని వంటి సీరియల్లో నటించింది.


అంతేకాకుండా పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. వరుసగా సినిమాలు , సీరియల్స్ తో బిజీగా ఉండే శ్రీ సత్య ఒకానొక సమయంలో బిగ్ బాస్ 6 సీజన్లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఇందులో సాదాసీదాగానే అడుగుపెట్టిన ఈ బ్యూటీ తన అందంతో, ఆటతీరుతో ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉండగా ....ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేయడమే కాకుండా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.


ఈ క్రమంలోనే తాజాగా శ్రీ సత్య షేర్ చేసిన కొన్ని ఫోటోల్లో తన పెదవికి సర్జరీ చేయించుకున్నట్లు ఉందని అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించిన శ్రీ సత్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తాను సర్జరీ చేయించుకోవడానికి కూడా కారణం ఏంటో రివ్యూ చేశారు. సినిమాల్లో ఛాన్సుల కోసం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ నా పెదవి చిన్నదిగా ఉన్నదని.... అందువల్ల నేను చిన్నపిల్లలాగా కనిపిస్తున్నానని ఆఫర్లు ఇవ్వడం లేదు.


అందుకే నా పెదవికి సర్జరీ చేయించుకున్నాను. కానీ ఇది పర్మినెంట్ కాదు. మూడు నెలల తర్వాత సెట్ అవుతుంది. అయితే సినిమా వాళ్లు ఇది చూసి ఇప్పుడు బాగుంది అని అంటున్నారు. ఈ లిప్ ఫిల్లింగ్ అనేది తొందరలోనే పోతుంది. అప్పటివరకు నేను ట్రోల్స్ భరించకతప్పదు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీ సత్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>