PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap1e44969e-97a6-4da7-99e1-a9adbb48405a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap1e44969e-97a6-4da7-99e1-a9adbb48405a-415x250-IndiaHerald.jpgజగన్ హయాంలో ఏపీలో రోడ్లు వేసిన పాపాన పోలేదు. కనీసం గతుకులను కూడా రిపేర్ చేయలేదు. దీని కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు టీడీపీ పుణ్యమా అని ఏపీలో కొత్త రోడ్లు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వీటిపైనే టీడీపీ కూటమి ఫోకస్ చేయడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది. Ap{#}pragathi;raj;Kurnool;wednesday;kalyan;central government;Telangana Chief Minister;Reddy;Party;TDP;Minister;Government;Andhra Pradeshఏపీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రోడ్లు.. ప్రజలకు ఫుల్ రిలీఫ్..??ఏపీ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రోడ్లు.. ప్రజలకు ఫుల్ రిలీఫ్..??Ap{#}pragathi;raj;Kurnool;wednesday;kalyan;central government;Telangana Chief Minister;Reddy;Party;TDP;Minister;Government;Andhra PradeshFri, 12 Jul 2024 08:00:00 GMT
టీడీపీ కూటమి కాకతో అభివృద్ధి పథంలో నడుస్తున్న ఏపీ

• గ్రామాల నుంచి సిటీల దాకా కొత్త రోడ్లు

కేంద్ర నుంచి నిధులు

(ఏపీ- ఇండియహెరాల్డ్)

జగన్ హయాంలో ఏపీలో రోడ్లు వేసిన పాపాన పోలేదు. కనీసం గతుకులను కూడా రిపేర్ చేయలేదు. దీని కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇప్పుడు టీడీపీ పుణ్యమా అని ఏపీలో కొత్త రోడ్లు వస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే  వీటిపైనే టీడీపీ కూటమి ఫోకస్ చేయడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది.

గ్రామాలను రోడ్లతో అనుసంధానిస్తేనే ప్రగతి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల ఉద్ఘాటించారు. 4,976 కోట్ల వ్యయంతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి ఆయన సూచించారు. "గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపులో చాలా జాప్యం చేసింది, దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం మందగించింది. ఈ సమస్యను పరిష్కరించిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన రోడ్లు లభిస్తాయి, తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది." అని పవన్ అన్నారు.

పంచాయత్ రాజ్ శాఖ ఇంజినీరింగ్ పనుల పారదర్శకతను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేక పోర్టల్‌ను రూపొందిస్తామని పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిని పరిష్కరించడానికి రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బి) మంత్రి బి.సి.జనార్దన్ రెడ్డి కూడా నడుం బిగించారు. రాష్ట్రంలో 9 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లను మరమ్మతులు చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 9 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరిస్తామని మంత్రి రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు.

 మరోవైపు కర్నూలు నుంచి బళ్లారికి సరైన రోడ్డు ఫెసిలిటీ లేదని ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు గత ప్రభుత్వాన్ని దీన్ని ఏమాత్రం బాగు చేయలేదు. NH-44లో ఆరు లేన్ల రహదారిని NHAI ప్రతిపాదించినప్పటికీ, కర్నూలు నుంచి బళ్లారికి అలాంటి సౌకర్యం తీసుకురాలేదు. 2019లో కురిసిన భారీ వర్షాలకు ఈ రహదారి దెబ్బతింది, ఇది అధ్వాన్నంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిని కూడా పరిష్కరిస్తామని ఏపీ అధికార పార్టీ హామీ ఇచ్చింది. కేంద్రం నుంచి మనీ కూడా అడుగుతామని పవన్ అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>