ViralDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/thirupathi-youtubares-video-franks32f9612e-da43-4969-a240-934e637dce18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/thirupathi-youtubares-video-franks32f9612e-da43-4969-a240-934e637dce18-415x250-IndiaHerald.jpgతిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు. తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తిశ్రద్ధలతో నడుచుకుంటూ ఉంటారు.అటువంటి కొండపైన కొంతమంది భక్తితో నడుచుకోవాల్సింది పోయి చాలా ఆకతాయి పనులు వెక్కిలి చేష్టలు చేస్తూ ఉన్నారు. తిరుమలలో కొంతమంది తమిళ యూట్యూబర్స్ రెచ్చిపోయి మరి శ్రీవారి భక్తుల మనోభావాలను సైతం కించపరిచేలా చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అందుకు సంబంధించి ఫ్రాంక్ వీడియోలతో అక్కడ భక్తులను కూడా ఎగTHIRUPATHI;YOUTUBARES;VIDEO;FRANKS{#}Tirupati;Raccha;Tamilవైరల్: తిరుపతి వరకు వెళ్లిన ఫ్రాంక్ వీడియోస్.. రెచ్చిపోయిన యూట్యూబర్స్..!వైరల్: తిరుపతి వరకు వెళ్లిన ఫ్రాంక్ వీడియోస్.. రెచ్చిపోయిన యూట్యూబర్స్..!THIRUPATHI;YOUTUBARES;VIDEO;FRANKS{#}Tirupati;Raccha;TamilFri, 12 Jul 2024 06:17:34 GMTతిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రతి ఒక్కరు కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తూ ఉంటారు. తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఎంతోమంది భక్తిశ్రద్ధలతో నడుచుకుంటూ ఉంటారు.అటువంటి కొండపైన కొంతమంది భక్తితో నడుచుకోవాల్సింది పోయి చాలా ఆకతాయి పనులు వెక్కిలి చేష్టలు చేస్తూ ఉన్నారు. తిరుమలలో కొంతమంది తమిళ యూట్యూబర్స్ రెచ్చిపోయి మరి శ్రీవారి భక్తుల మనోభావాలను సైతం కించపరిచేలా చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అందుకు సంబంధించి ఫ్రాంక్ వీడియోలతో అక్కడ భక్తులను కూడా ఎగతాళి చేసినట్లు సమాచారం.


ఈ మధ్యకాలంలో ఫ్రాంక్ వీడియోల సంఖ్య పెరిగిపోయింది. అంతేకాకుండా ఇలా చేసి కొంతమంది వారి యొక్క పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. తాగాక తిరుమలలో అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. కొందరు తమిళ యూట్యూబర్స్ శ్రీవారి భక్తులను హేళన చేయడం జరిగిందట. శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులను సైతం కొంతమంది ఆకతాయిలు ఫ్రాంక్ చేశారు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు ముందు యూట్యూబర్స్ కాస్త వెహికల్ చేష్టలు చేసినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.


టిటిఎఫ్ వాసన్ అనే ఒక తమిళ్ యూట్యూబర్ అతడి వెక్కిలి బ్యాచ్తో కలిసి.. నిజంగానే గేటుకి తాళాలు తీస్తున్నారేమో అని అంతగా భావించేలా అక్కడ ఉన్న భక్తులను లేచి నిలబడేలా చేసి.. వారు లేవగానే ఆ ఆకతాయిలు వెకిలిగా నవ్వుతూ అక్కడ నుంచి పరుగులు తీసినట్టుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా కోతి చేష్టలు చేసిన బ్యాచ్ రచ్చ అంతా కాదట.. భక్తులు మనోభావాలను సైతం ఆడుకోవడమే కాకుండా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం పైన శ్రీవారి భక్తులు సైతం కాస్త ఆగ్రహానికి గురవుతున్నారు. వారిని వదిలేయకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పాలని కఠినంగా శిక్షించాలంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి టిటిడి వారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.
tirumala Temple | 99TV">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>