EditorialRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan-ys-jagan-roja-main-kathoti-sucharitra-majhi-home-minister-thaneti-vanitha-pushp-shrivani-usha-sricharanc7cfd171-6f46-4c26-8bd5-589fe377d80c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan-ys-jagan-roja-main-kathoti-sucharitra-majhi-home-minister-thaneti-vanitha-pushp-shrivani-usha-sricharanc7cfd171-6f46-4c26-8bd5-589fe377d80c-415x250-IndiaHerald.jpgజగన్ విధానాలు వైసిపి నేతలకు శాపంగా మారాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కొందరు టిడిపి నాయకులను వేధించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే వారు కనీసం నోరు మెదప లేని పరిస్థితి కూడా ఏర్పడిందని అప్పట్లో చంద్రబాబు సైతం ఆరోపించారు. అంతెందుకు చంద్రబాబు అమరావతిని చూడ్డానికి వెళ్తే ఆయనను అడ్డగించిన విషయం ఉండవల్లిలోనే మనం గమనించాం. పోలీసులు సైతం ఆంక్ష‌లు విధించారు. చంద్రబాబుకే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో నిజంగానే టిడిపి నాయకులు ఆ పరిస్థితి ఎదుర్కొని ఉంటార‌నడంలో సందేహం లేదు. సరే అది ఎలా ఉన్నప్Jagan; ys Jagan; Roja; main kathoti sucharitra; Majhi home minister; thaneti Vanitha; Pushp shrivani; Usha sricharan{#}WOMEN;PUSHPASREEVANI PAMULA;Roja;K V Ushashri Charan;police;Manam;Deputy Chief Minister;Reddy;Jagan;media;TDP;YCP;CBNవైసీపీ మ‌హిళా నేత‌ల‌ను జ‌గ‌న్ ఇంత టార్చ‌ర్ పెడుతున్నాడా ?వైసీపీ మ‌హిళా నేత‌ల‌ను జ‌గ‌న్ ఇంత టార్చ‌ర్ పెడుతున్నాడా ?Jagan; ys Jagan; Roja; main kathoti sucharitra; Majhi home minister; thaneti Vanitha; Pushp shrivani; Usha sricharan{#}WOMEN;PUSHPASREEVANI PAMULA;Roja;K V Ushashri Charan;police;Manam;Deputy Chief Minister;Reddy;Jagan;media;TDP;YCP;CBNFri, 12 Jul 2024 09:34:32 GMTజగన్ విధానాలు వైసిపి నేతలకు శాపంగా మారాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కొందరు టిడిపి నాయకులను వేధించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అంటే వారు కనీసం నోరు మెదప లేని పరిస్థితి కూడా ఏర్పడిందని అప్పట్లో చంద్రబాబు సైతం ఆరోపించారు. అంతెందుకు చంద్రబాబు అమరావతిని చూడ్డానికి వెళ్తే ఆయనను అడ్డగించిన విషయం ఉండవల్లిలోనే మనం గమనించాం. పోలీసులు సైతం ఆంక్ష‌లు విధించారు. చంద్రబాబుకే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో నిజంగానే టిడిపి నాయకులు ఆ పరిస్థితి ఎదుర్కొని ఉంటార‌నడంలో సందేహం లేదు.


సరే అది ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా ఇదే భయంతో అల్లాడిపోతున్నారు. తాజా గా మహిళ నాయకులు సైతం బయటికి రాలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. వాస్త‌వానికి వీరు వైఎస్ కుటుంబానికి వీర విధేయులు. జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన అభిమానులు. వైసీపీతోనే ఉంటాం వైసిపి కష్టాల్లో ఉంటే మేమే భుజాల మీద మోసాం అని చెప్పుకున్న మహిళా నాయకులు సైతం బయటికి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఉదాహరణకు మాజీమంత్రి రోజా, మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, మాజీమంత్రి ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ ఇలా మాజీ మంత్రులు మాజీ మహిళా నాయకులు సైతం బయటికి వచ్చే  పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు.


ఒకవైపు అధికారపక్షం నుంచి తీవ్రమైన దాడి పెరుగుతోంది. సోషల్ మీడియాలో కానీ ఇటు బహిరంగ వేదికలపై కానీ మీడియా ముఖంగా గాని చంద్రబాబు నుంచి ఇతర నాయకులు వరకు కూడా విమర్శల‌ దాడి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలో జగన్ ఒక్క మాటంటే కూడా మేము సహించేది లేదు అని చెప్పిన రోజా గాని వనిత గాని పుష్పశ్రీవాణి గాని ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఉషశ్రీ చరణ్ గానీ ఇప్పుడు ఎక్కడా కనిపించటం లేదు. కనీసం మీడియా ముందుకు కూడా రావడం లేదు.


జగన్ ను భూతమని తిట్టినా.. జగన్ పాలన దురదృష్టకరమని వ్యాఖ్యానించినా.. ఏ ఒక్కరు స్పందించడం లేదు. మరి ఇది ఎలా జరుగుతోంది? ఎందుకు వారు ఇలా మౌనంగా ఉన్నారు? అంటే గతంలో జగన్ ఏ విధంగా అయితే టిడిపి నాయకులపై కేసులు పెట్టి వేధించారో ఇప్పుడు అదే పరిస్థితి ఎదురవుతుందనే ఆలోచనలో ఈ మహిళ నాయకులు కూడా ఉన్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానికి చెప్పాలంటే జగన్ పాలన‌తో పోలిస్తే చంద్రబాబు పాలనలో అట్లాంటివి దాదాపు ఉండకపోవచ్చు.


ఎందుకంటే జగన్ వ్యతిరేకించే మీడియా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబును తప్పుపడుతు న్న సందర్భాలు మనం గమనిస్తున్నాం. ఉదాసీన వైఖరి ఉండకూడదు అంటూనే అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేయడాన్ని అదే మీడియా తప్పుపడుతోంది. ఇది జగన్ పాల‌న‌లోనే కాదు.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో కూడా కొంతవరకు పారదర్శకంగానే మీడియా పనిచేస్తుంది. సో దీనికైనా చంద్రబాబు ప్రభుత్వం కొంత జంకుతుంది. కాబట్టి ఆ భయం అయితే అవసరం లేదు. ఉన్నదున్నట్టు మాట్లాడొచ్చు.


గతంలో జగన్ చేసిన‌ విధంగానే ఇప్పుడు తాము ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా.. ఏ కేసులో ఇరికిస్తారో.. అర్ధరాత్రి అరెస్టు చేస్తారో.. అని మహిళా నాయకులు సైతం భయపడుతున్నారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. లేకపోతే వైసిపి అధిష్టానం నుంచే అసలు ఎవరూ మాట్లాడొద్దు ఏదైనా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతారు.. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు.. లేకపోతే ఇతర నాయకులు మాట్లాడుతారు.. అని చెప్పి సందేశాలు పంపించారా? అనేది కూడా చర్చగా మారింది. మరి ఏదేమైనా వీర‌ విధేయులు మౌనంగా ఉండటం ఆసక్తిగా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>