PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/peddi-reddy-ramachandra-reddy-punganuru-mla-peddi-reddy-mp-mithun-reddy-pedhi-reddy-family-ysrcpf6113848-7158-4092-b9dd-02bf0b9f116b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/peddi-reddy-ramachandra-reddy-punganuru-mla-peddi-reddy-mp-mithun-reddy-pedhi-reddy-family-ysrcpf6113848-7158-4092-b9dd-02bf0b9f116b-415x250-IndiaHerald.jpgఅధికారం అండ చూసుకుని గత ఐదు సంవత్సరాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చేసిన అరాచకాలకు లెక్కేలేదు. ఇక సొంత జిల్లా చిత్తూరుని మొత్తం తన కనుసైగలతో పెద్దిరెడ్డి శాసిస్తూ వచ్చారు. చాలా నియోజకవర్గాలలో వేలు పెట్టేసి అక్కడ ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి.. పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. చివరకు డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి.. గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలోనూ పెద్దిరెడ్డి హవా నడిచేది. సత్యవేడు, పూతలపట్టు లాంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు.. తంబళPeddi Reddy Ramachandra Reddy; punganuru MLA peddi Reddy; MP Mithun Reddy; pedhi Reddy family; ysrcp{#}Scheduled caste;Chittoor;kuppam;Panchayati;Punganur;Putalapattu;Madanapalli;Chakram;రాజీనామా;Nellore;District;Andhra Pradesh;Doctor;TDP;Minister;YCP;CBNపెద్దిరెడ్డి నీ ప‌రువు మొత్తం కూలిపోతోంది... చూస్తున్నావా...?పెద్దిరెడ్డి నీ ప‌రువు మొత్తం కూలిపోతోంది... చూస్తున్నావా...?Peddi Reddy Ramachandra Reddy; punganuru MLA peddi Reddy; MP Mithun Reddy; pedhi Reddy family; ysrcp{#}Scheduled caste;Chittoor;kuppam;Panchayati;Punganur;Putalapattu;Madanapalli;Chakram;రాజీనామా;Nellore;District;Andhra Pradesh;Doctor;TDP;Minister;YCP;CBNFri, 12 Jul 2024 09:24:01 GMTఅధికారం అండ చూసుకుని గత ఐదు సంవత్సరాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చేసిన అరాచకాలకు లెక్కేలేదు. ఇక సొంత జిల్లా చిత్తూరుని మొత్తం తన కనుసైగలతో పెద్దిరెడ్డి శాసిస్తూ వచ్చారు. చాలా నియోజకవర్గాలలో వేలు పెట్టేసి అక్కడ ఎమ్మెల్యేలను డమ్మీలను చేసి.. పెద్దిరెడ్డి చక్రం తిప్పారు. చివరకు డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణస్వామి.. గంగాధర, నెల్లూరు నియోజకవర్గంలోనూ పెద్దిరెడ్డి హవా నడిచేది. సత్యవేడు, పూతలపట్టు లాంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలతో పాటు.. తంబళ్లపల్లె, మదనపల్లి లోను ఇదే పరిస్థితి కొనసాగింది.


తిరుపతిలో అయినా.. మాజీ మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో అయినా.. పెద్దిరెడ్డి హవా ఎక్కువగా నడిచేది. అక్కడితో ఆగని పెద్దిరెడ్డి చంద్రబాబు సొంత‌నియోజ‌క‌వ‌ర్గం కుప్పం వెళ్లి అరాచక రాజకీయం నడిపించారు. ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలలో టిడిపి వాళ్ళను బెదిరించి వైసిపికి చాలా చోట్ల ఏకగ్రీవాలు చేయడంతో పాటు.. నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించేలా చేశారు. చివరకు కుప్పం మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో 25 వార్డులలో, 19 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఎన్నికయ్యారు.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామంటూ పెద్దిరెడ్డి శపథాలు చేసేవారు. ఒకే ఒక్క ఓటమి తర్వాత కుప్పంలో మాత్రమే కాదు.. పుంగనూరులో కూడా వైసీపీ కూలిపోతోంది. తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్‌తో పాటు.. తొమ్మిది మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరిపోతున్నారు. ఇక పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ తో పాటు.. 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వీరంతా త్వరలో టిడిపిలో చేరుతున్నారు. పెద్దిరెడ్డి కుప్పం సంగతి ఏమోగానీ.. పుంగనూరు కోట కూలిపోతుంది. నీ పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది చూసుకో అంటూ టిడిపి నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ పెద్దిరెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>