PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-brs-kcr-ktr-harish-rao-pm-modi-kalavakonda-kavitha2d82c554-95b3-4b56-a449-5d9bafa311ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-brs-kcr-ktr-harish-rao-pm-modi-kalavakonda-kavitha2d82c554-95b3-4b56-a449-5d9bafa311ff-415x250-IndiaHerald.jpgబీఆర్ఎస్ - బిజెపి ఫిక్సింగ్ చేసుకున్నాయా ? దశలవారీగా బిఆర్ఎస్‌ను బిజెపిలో విలీనం చేయబోతున్నారా ? అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోక్‌స‌భ ఎన్నికలు ముగిసిన తెలంగాణ రాజకీయాలు మాత్రం హాట్ హాట్‌గా సాగుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. ఆ పార్టీ ద్వారా వైఫల్యం తర్వాత బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఢిల్లీలో మూడు నెలలుగా జైలులో ఉన్న కూడా బెయిల్ కూడా రాలేBJP; brs; KCR; ktr; Harish Rao; pm modi; kalavakonda Kavitha{#}Rajya Sabha;Cheque;Kartavyam;contract;Bharatiya Janata Party;Elections;Suresh;kavitha;Friday;Car;KCR;KTR;Delhi;Telangana;Congress;Reddy;News;media;MP;Partyబీజేపీలోకి న‌లుగురు బీఆర్ఎస్ ఎంపీలు... బీఆర్ఎస్ విలీనం గుట్టు ర‌ట్టు..?బీజేపీలోకి న‌లుగురు బీఆర్ఎస్ ఎంపీలు... బీఆర్ఎస్ విలీనం గుట్టు ర‌ట్టు..?BJP; brs; KCR; ktr; Harish Rao; pm modi; kalavakonda Kavitha{#}Rajya Sabha;Cheque;Kartavyam;contract;Bharatiya Janata Party;Elections;Suresh;kavitha;Friday;Car;KCR;KTR;Delhi;Telangana;Congress;Reddy;News;media;MP;PartyFri, 12 Jul 2024 18:05:43 GMTబీఆర్ఎస్ - బిజెపి ఫిక్సింగ్ చేసుకున్నాయా ? దశలవారీగా బిఆర్ఎస్‌ను బిజెపిలో విలీనం చేయబోతున్నారా ? అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో ఇదే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లోక్‌స‌భ ఎన్నికలు ముగిసిన తెలంగాణ రాజకీయాలు మాత్రం హాట్ హాట్‌గా సాగుతున్నాయి. లోక్‌స‌భ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాలేదు. ఆ పార్టీ ద్వారా వైఫల్యం తర్వాత బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగుతున్నారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఢిల్లీలో మూడు నెలలుగా జైలులో ఉన్న కూడా బెయిల్ కూడా రాలేదు. పార్టీ ఫ్యూచర్ ఏంటి ? మన ఫ్యూచర్ ఏంటని పార్టీ నేతలు అందరూ ఆందోళన చెందుతున్నారు.


ఈ క్రమంలోనే కవితకు బెయిల్ దక్కేలా కేసీఆర్ బిజెపితో సీక్రెట్ గా ఒప్పందం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో టిపిసిసి మీడియా కోఆర్డినేటర్ , కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ బిజెపి - బిఆర్ఎస్ విలీనంపై శుక్రవారం సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్ గా మారాయి. బిఆర్ఎస్ - బిజెపి ఫిక్సింగ్ చేసుకున్నాయని రామ్మోహన్ ఆరోపించారు. దీనిపై తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. మొదటి దశ విలీనంలో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరబోతున్నారని ఆయన తెలిపారు.


ఇందుకు ఇరు పార్టీలు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని హరీష్ రావు - కేటీఆర్ నాలుగు రోజులపాటు ఢిల్లీలో ఉండి రాయబారం నడిపించారంటూ ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరఫున వద్దిరాజు రవిచంద్ర - కేఆర్ సురేష్ రెడ్డి - దామోదర్ రావు - పార్థసారథి రెడ్డి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కవిత బెయిల్తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు చెక్ పెట్టాలంటే ఇదే సరైన మార్గం అని గులాబీ అధినేత కేసిఆర్ భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.


ఎంత ప్రయత్నించినా తమ పార్టీ ఎమ్మెల్యేలు .. ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆయన ఆపలేకపోతున్నారు దీనిని ఆపాలంటే బిజెపితో డీల్ కుదుర్చుకోవడమే తక్షణ కర్తవ్యం గా కెసిఆర్ భావిస్తున్నట్టు తెలంగాణలో గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ - హరీష్ రావు అక్కడ బిజెపి పెద్దలతో రాజీ కుదుర్చుకున్నారని ముందస్తు ఒప్పందంలో భాగంగానే నలుగురు బిఆర్ఎస్ ఎంపీలు కాషాయ కండువా కొప్పుకునేందుకు రెడీగా ఉన్నారంటూ కాంగ్రెస్ వాళ్లు ఆరోపణలు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>