MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood26a77391-1f19-43f3-87a3-0a5d04a5733b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood26a77391-1f19-43f3-87a3-0a5d04a5733b-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ ను జోడించి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నదాన్ని అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన టేకింగ్ కు స్టార్ డైరెక్టర్లు సైతం ఫిదా అవుతున్నారు. ఊహించని ట్విస్టులు క్లైమాక్స్ తో ఉన్న ఈ సినిమా తాజాగా 1000 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ చేయడంతో పాన్ ఇండియా tollywood{#}Cinema Tickets;Dangal;Fidaa;Bahubali;vyjayanthi;Prabhas;Rajamouli;Amitabh Bachchan;vijay kumar naidu;Director;Hero;June;Cinema;Indiaఆగని కల్కి సునామి.. మరో అరుదైన రికార్డ్..!?ఆగని కల్కి సునామి.. మరో అరుదైన రికార్డ్..!?tollywood{#}Cinema Tickets;Dangal;Fidaa;Bahubali;vyjayanthi;Prabhas;Rajamouli;Amitabh Bachchan;vijay kumar naidu;Director;Hero;June;Cinema;IndiaFri, 12 Jul 2024 15:05:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా కల్కి. జూన్ 27న విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ ను జోడించి రాబోయే రోజుల్లో ప్రపంచం ఎలా ఉంటుంది అన్నదాన్ని అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆయన టేకింగ్ కు స్టార్ డైరెక్టర్లు సైతం ఫిదా అవుతున్నారు. ఊహించని ట్విస్టులు క్లైమాక్స్ తో ఉన్న ఈ సినిమా తాజాగా 1000 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాదాపుగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్ చేయడంతో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరో మెట్టుకు ఎదిగాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్ల వసూలు

 చేసిన భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది కల్కి. అయితే కల్కి కన్నా ముందు ఈ రికార్డు సాధించిన సినిమాలు ఆరు ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఏడవ స్థానంలోకి చేరింది కల్కి సినిమా. కల్కి విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే నార్త్ అమెరికాలోనూ అరుదైన ఫీట్ ను కల్కి సొంతం చేసుకుంది. 16.2 మిలయన్ డాలర్లు వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. బుక్ మై

 షోలో కోటికి పైగా టికెట్స్ విక్రయమైన గా కొత్త రికార్డ్ సృష్టించింది ఈ మూవీ. ఇక ఈ వీకెండ్స్‏లో కల్కి వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అమితాబ్ అశ్వద్ధామ పాత్రలో నట విశ్వరూపం చూపించారు. దీంతో కల్కి కు నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలలో మొదటి స్థానంలో అమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) మూవీ నిలిచింది. ఈ రూ.2024 కోట్లు రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది.  ఆ తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి 2 (2017) మూవీ రూ. 1810 కోట్లు రెండవ స్థానంలో ఉండగా.. జక్కన్న తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ (2022) మూవీ రూ.1387 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>