MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kajalcc84afac-dfc6-49c8-b0e0-dd5fe58246fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/kajalcc84afac-dfc6-49c8-b0e0-dd5fe58246fe-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఏ నటి మణులు అయిన తమలో ఉన్న పూర్తి నటనను బయట పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక కెరియర్ ప్రారంభంలోనే చాలా మంది నటీమణులకు తమలో ఉన్న నటన ప్రతిభను మొత్తం బయట పెట్టే అవకాశం ఉన్న పాత్రలు దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దానితో చాలా మంది నటీమణులు మొదట క్రేజ్ ను సంపాదించుకోవాలి అని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళుతూ ఉంటారు. అందులో భాగంగా దాదాపు ఏ నటిమనులకు అయిన మొదట కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా అవకాశాలు దక్కుతూ ఉంటాయి. దానితో వారు కమర్షియల్ సినిమాలkajal{#}Satyabhama;U Turn;Arundhati;Bhagamathi;anoushka;kajal aggarwal;Samantha;Heroine;Cinemaఅనుష్క.. సమంత ఓకే.. పాపం కాజల్ కే ఎందుకిలా..?అనుష్క.. సమంత ఓకే.. పాపం కాజల్ కే ఎందుకిలా..?kajal{#}Satyabhama;U Turn;Arundhati;Bhagamathi;anoushka;kajal aggarwal;Samantha;Heroine;CinemaFri, 12 Jul 2024 15:38:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఏ నటి మణులు అయిన తమలో ఉన్న పూర్తి నటనను బయట పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక కెరియర్ ప్రారంభంలోనే చాలా మంది నటీమణులకు తమలో ఉన్న నటన ప్రతిభను మొత్తం బయట పెట్టే అవకాశం ఉన్న పాత్రలు దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దానితో చాలా మంది నటీమణులు మొదట క్రేజ్ ను సంపాదించుకోవాలి అని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళుతూ ఉంటారు. అందులో భాగంగా దాదాపు ఏ నటిమనులకు అయిన మొదట కమర్షియల్ సినిమాలలో ఎక్కువగా అవకాశాలు దక్కుతూ ఉంటాయి.

దానితో వారు కమర్షియల్ సినిమాలలో తమ నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఆ తర్వాత వైవిధ్యమైన పాత్రల వైపు ప్రయాణిస్తూ ఉంటారు. అందులో భాగంగా హీరోయిన్లు కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత లేడీ ఓరియంటెడ్ పాత్రల వైపు దృష్టి సారిస్తూ ఉంటారు. ఇకపోతే తెలుగులో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటి మనులలో అనుష్క , సమంత , కాజల్ అగర్వాల్ ప్రథమ స్థానంలో ఉంటారు. వీరు కెరియర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాలలో అందాలను ఆరబోసిన ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలలో కూడా నటించడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇచ్చారు.

అలాగే కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించారు. అనుష్క ఇప్పటికే కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించగా అందులో అరుంధతి , భాగమతి మంచి విజయాలు అందుకున్నాయి. ఇక సమంత కూడా చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించగా యూటర్న్ , యశోద సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక కాజల్ కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మాత్రం ఈ ముద్దుగుమ్మ విజయాలను అందుకోలేదు. కొన్ని రోజుల క్రితమే ఈమే సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ఈ మూవీ కూడా ఈ ముద్దుగుమ్మకు విజయాన్ని అందించలేకపోయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>