PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-pitapuram-mla-duput-cm-ap-duput-cm8fcdeb91-f9aa-4db6-95ee-6d69963a9d83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyan-pitapuram-mla-duput-cm-ap-duput-cm8fcdeb91-f9aa-4db6-95ee-6d69963a9d83-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీళ్లలో మునిగిపోవడం ఏంటి..? ఆయన నెల రోజుల క్రిందటే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. పైగా ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలో ఇటు మచిలీపట్నం, కాకినాడ లోక్స‌భ స్థానాలలో కూడా ఘన విజయం సాధించింది. ఇటు పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా దక్కింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నీళ్లలో మునిగిపోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు విషయం. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు మూడు,PAWAN KALYAN;PITAPURAM MLA;DUPUT CM;AP DUPUT CM{#}Deputy Chief Minister;kakinada;Success;politics;pithapuram;Pawan Kalyan;Cinema;Janasena;kalyan;Telangana Chief Minister;Assembly;Andhra Pradeshప‌వ‌న్ నీళ్ల‌లో మునిగి పోతాడా.. కాపాడేదెవ‌రు..?ప‌వ‌న్ నీళ్ల‌లో మునిగి పోతాడా.. కాపాడేదెవ‌రు..?PAWAN KALYAN;PITAPURAM MLA;DUPUT CM;AP DUPUT CM{#}Deputy Chief Minister;kakinada;Success;politics;pithapuram;Pawan Kalyan;Cinema;Janasena;kalyan;Telangana Chief Minister;Assembly;Andhra PradeshThu, 11 Jul 2024 08:35:00 GMTజనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నీళ్లలో మునిగిపోవడం ఏంటి..? ఆయన నెల రోజుల క్రిందటే పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించారు. పైగా ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలలో ఇటు మచిలీపట్నం, కాకినాడ లోక్స‌భ స్థానాలలో కూడా ఘన విజయం సాధించింది. ఇటు పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకమైన మంత్రిత్వ శాఖతో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా దక్కింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ నీళ్లలో మునిగిపోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు విషయం. పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు మూడు, నాలుగు సెట్స్ మీద ఉన్నాయి.


ప్రస్తుతం పాలనపై దృష్టి పెట్టిన పవన్.. తాను మరో మూడు నెలల పాటు సినిమా షూటింగ్ ల‌కు దూరంగా ఉంటానని.. ఆ తర్వాత పది రోజులు సినిమా షూటింగ్ ల‌కు టైమ్ కేటాయిస్తూ ఉంటానని చెప్పకనే చెప్పారు. పవన్ ఇప్పుడు రాజకీయంగా తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. అసలు పవన్ రాజకీయాల్లో సక్సెస్ కారు.. పవన్ సినిమాలుకే పరిమితం అనుకున్న వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ పవన్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ ఏర్పాట్లు కీలకంగా వ్యవహరించారు.


ఈ టైంలో రాజకీయంగా బలమైన పునాదులు ఏర్పాటు చేసుకోవాలే కానీ.. ఇటు రాజకీయాలు.. అటు సినిమాలు అంటూ రెండు పడవల మీద కాలు వేస్తే ఇబ్బంది ఎదురవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనలో సగం పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ టైంలో పూర్తిగా ఇక్కడ పాలన మీద దృష్టి పెట్టకుండా పది రోజులు షూటింగులకు టైం కేటాయిస్తే రెండు పడవల ప్రయాణం అవుతుందని.. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. మరి పవన్ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండిటిని ఎలా బ్యాలెన్స్ ? చేసుకుంటూ ముందుకు వెళతారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>