PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasean-ap-pawane0148443-7ab0-4eb5-9b24-4f8b85aa5818-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasean-ap-pawane0148443-7ab0-4eb5-9b24-4f8b85aa5818-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి జనసేన పార్టీని దగ్గరుండి మరి చంద్రబాబు స్వయంగా చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవిని కూడా ఇవ్వడం జరిగింది.. ఆ తర్వాత 21 మంది ఎమ్మెల్యేలలో కేవలం ఇద్దరికీ మాత్రమే మినిస్టర్ పదవులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అటు జనసేన కార్యకర్తలు , నేతలు కాస్త అసహనంతో ఉండడంతో తాజాగా జనసేనకు మరొక కీలకమైన పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలJANASEAN;AP;PAWAN{#}Janasena;srinivas;Government;Minister;CBN;TDP;kalyan;Andhra Pradesh;CMఏపీ: జనసేనకు మరో కీలకమైన పదవి..!ఏపీ: జనసేనకు మరో కీలకమైన పదవి..!JANASEAN;AP;PAWAN{#}Janasena;srinivas;Government;Minister;CBN;TDP;kalyan;Andhra Pradesh;CMThu, 11 Jul 2024 14:13:03 GMTఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి జనసేన పార్టీని దగ్గరుండి మరి చంద్రబాబు స్వయంగా చూసుకుంటున్నట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవిని కూడా ఇవ్వడం జరిగింది.. ఆ తర్వాత 21 మంది ఎమ్మెల్యేలలో కేవలం ఇద్దరికీ మాత్రమే మినిస్టర్ పదవులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అటు జనసేన కార్యకర్తలు , నేతలు కాస్త అసహనంతో ఉండడంతో తాజాగా జనసేనకు మరొక కీలకమైన పదవి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.


రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి అడ్వకేట్ జనరల్ పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించినట్లుగా సమాచారం.. ఇటీవల అడ్వకేట్ జనరల్ గా దమ్ములపాటి శ్రీనివాస్ కు అవకాశం రాగా ఇప్పుడు రెండో కీలక స్థానం AAG పదవి కూడా జనసేన పార్టీకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. జనసేన లీగల్ వ్యవహారాలకు సలహాదారులుగా సాంబశివ ప్రతాప్ కు ఈ పదవి ఇచ్చారట.. అయితే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే జనసేన పార్టీకి అన్ని విధాలుగా హక్కు ఉంటుందనే విషయాన్ని మరొకసారి నిరూపించారు చంద్రబాబు.


టిడిపి పార్టీ ఉనికి లేకుండా సమయంలో జనసేన పార్టీ చేరడంతో మరింత ఊపునిచ్చిందని చెప్పవచ్చు.. అందుకే 2024 ఎన్నికలలో టిడిపి బిజెపి జనసేన పార్టీలు 164 సీట్లతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే అభివృద్ధి పైన దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు.. అలాగే ప్రజలకు అందించాల్సిన పథకాల విషయంలో కూడా మరింత అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన వ్యవహారాలను చక్కదిద్దుతూ ముందుకు వెళ్తున్నారు. అలాగే మినిస్టర్స్ కూడా తమ పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ కూటమిలో మరింత కీలకంగా మారుతుందని అభిమానులు అయితే మరింత ధీమాని తెలియజేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>