PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-jagan-ap-ex-cm-jagandfb3b8cb-7b48-418b-a8f8-c3801d9259c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-jagan-ap-ex-cm-jagandfb3b8cb-7b48-418b-a8f8-c3801d9259c4-415x250-IndiaHerald.jpgమళ్లీ మనదే అధికారం. మనకు తిరుగులేదు మొత్తం 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో మనమే ఉంటాం.. 20 ఏళ్ల పాటు తానే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను అంటూ వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలతో ఒక్కటే ప్రచారాన్ని ఊదరగొట్టేసేవారు. చాలామంది జగన్ మాటలు కూడా నమ్మి అదే భ్ర‌మ‌లో ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో.. ఆ భ్రమలు అన్ని తొలగిపోయాయి. జగన్ పై పెట్టుకున్న ఆశలు అన్ని పటాపంచలు అయిపోయాయి. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడYSRCP;JAGAN;AP;EX CM JAGAN{#}Telangana Chief Minister;MP;Reddy;Yevaru;Rajya Sabha;Party;Jagan;YCPవైసీపీలో ఇప్పుడు ఖ‌ర్చంతా వాళ్ల మీద తోసేస్తోన్న జ‌గ‌న్‌..?వైసీపీలో ఇప్పుడు ఖ‌ర్చంతా వాళ్ల మీద తోసేస్తోన్న జ‌గ‌న్‌..?YSRCP;JAGAN;AP;EX CM JAGAN{#}Telangana Chief Minister;MP;Reddy;Yevaru;Rajya Sabha;Party;Jagan;YCPThu, 11 Jul 2024 07:11:19 GMTమళ్లీ మనదే అధికారం. మనకు తిరుగులేదు మొత్తం 20 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో మనమే ఉంటాం.. 20 ఏళ్ల పాటు తానే ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాను అంటూ వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలతో ఒక్కటే ప్రచారాన్ని ఊదరగొట్టేసేవారు. చాలామంది జగన్ మాటలు కూడా నమ్మి అదే భ్ర‌మ‌లో ఉన్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో.. ఆ భ్రమలు అన్ని తొలగిపోయాయి. జగన్ పై పెట్టుకున్న ఆశలు అన్ని పటాపంచలు అయిపోయాయి. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు.


వీరిలో కూడా ఎందరు..? పార్టీకి షాక్ ఇస్తారు.. ఎప్పుడు..? ఎవరు..? వైసీపీనివీడు వెళ్ళిపోతారో కూడా జగన్‌కు అర్థం కావడం లేదు. 2029 వరకు ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలలో.. ఐదారు గురు ఎమ్మెల్యేల మినహా మిగిలిన వారు జగన్ వెంట ఉంటారన్న గ్యారెంటీ లేదు. అలాగే నలుగురు లోక్సభ సభ్యులలో ఒకరిపై ఇప్పటికే పార్టీకి డౌట్‌ ఉంది. ఇంత కష్ట పరిస్తితులలో పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చులు ఎవరు భరించాలి..? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే పార్టీ ఖర్చులు అన్నీ రాజ్యసభ సభ్యులతో పాటు.. పార్టీ నుంచి భారీ సంఖ్యలో ఉన్న ఎమ్మెల్సీల మీద జగన్ నెట్టేస్తున్నట్టు తెలుస్తోంది.


ఏమైనా ఖర్చులు కావాలన్నా, పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలనా.. ప్రస్తుతానికి ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఆదుకోవాలని జగన్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జగన్ పై వైసీపీపై నమ్మకం లేని వీరంతా.. తామెందుకు ఖర్చు పెట్టాలి అని తమలో తాము చర్చించుకుంటున్నారట. ఏది ఏమైనా అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రతి కార్యక్రమానికి ఇష్టానుసారం కోట్లలో ఖర్చుపెట్టిన వైసీపీ.. ఒక్క ఓటమి దెబ్బతో వేల‌ల్లో ఖర్చు పెట్టేందుకు కూడా వెనకాడుతున్న పరిస్థితి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>