MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/gnanavel-raja339038a6-6570-4d80-bfb1-5d1f104abf90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/gnanavel-raja339038a6-6570-4d80-bfb1-5d1f104abf90-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులని కాకపడుతున్న తమిళ టాప్ ప్రొడ్యూసర్? తమిళ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ అవుతాయి. హిట్లు కొడతాయి. భారీ లాభాలు పండుతాయి.ఇక తమిళ్ స్టార్ హీరోల సినిమాలైతే ఇక్కడ కూడా తెలుగు హీరోలకు ధీటుగా భారీగా రిలీజ్ అవుతాయి.సూర్య, కార్తీ, రజినీకాంత్, కమల్ హాసన్, శివ కార్తికేయన్, విజయ్ ఇంకా అజిత్.. ఇలా చాలా మంది తమిళ్ హీరోలకు తెలుగులో కూడా అభిమానులు, భారీ మార్కెట్ కూడా ఉంది. కానీ తెలుగు హీరోల సినిమాలు తమిళ్ లో రిలీజయినా అక్కడ పెద్దగా పట్టించుకోరు.మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలని Gnanavel Raja{#}ajith kumar;Ajit Pawar;Joseph Vijay;vegetable market;Shiva;lord siva;raja;producer;Producer;Tamil;Teluguతెలుగు ప్రేక్షకులని కాకపడుతున్న తమిళ టాప్ ప్రొడ్యూసర్?తెలుగు ప్రేక్షకులని కాకపడుతున్న తమిళ టాప్ ప్రొడ్యూసర్?Gnanavel Raja{#}ajith kumar;Ajit Pawar;Joseph Vijay;vegetable market;Shiva;lord siva;raja;producer;Producer;Tamil;TeluguThu, 11 Jul 2024 13:05:00 GMT తమిళ సినిమాలన్నీ  తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ అవుతాయి. హిట్లు కొడతాయి. భారీ లాభాలు పండుతాయి.ఇక తమిళ్ స్టార్ హీరోల సినిమాలైతే ఇక్కడ కూడా తెలుగు హీరోలకు ధీటుగా భారీగా రిలీజ్ అవుతాయి.సూర్య, కార్తీ, రజినీకాంత్, కమల్ హాసన్, శివ కార్తికేయన్, విజయ్ ఇంకా అజిత్.. ఇలా చాలా మంది తమిళ్ హీరోలకు తెలుగులో కూడా అభిమానులు, భారీ మార్కెట్ కూడా ఉంది. కానీ తెలుగు హీరోల సినిమాలు తమిళ్ లో రిలీజయినా అక్కడ పెద్దగా పట్టించుకోరు.మన తెలుగు ఆడియన్స్ తమిళ హీరోలని కూడా మన అనుకోని దగ్గరికి తీసుకుంటారు. కానీ తమిళ్ ఆడియన్స్ అసలు తెలుగు హీరోలని పట్టించుకొనే పట్టించుకోరు. వాళ్ళు కేవలం తెలుగే కాదు తమిళ్ తప్ప ఏ భాష సినిమాలని అంతగా పట్టించుకోరు. తాజాగా ఈ విషయం ఓ తమిళ అగ్ర నిర్మాత కూడా ఒప్పుకోవడం జరిగింది. 


తమిళ అగ్ర నిర్మాత, స్టూడియో గ్రీన్ అధినేత KE జ్ఞానవేల్ రాజా ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వారికి కూడా బాగా పరిచయం అయ్యాడు. త్వరలో ఈయన నుంచి తంగలాన్, బడ్డీ, కండువా సినిమాలు తమిళ్ ఇంకా తెలుగులో రాబోతున్నాయి.తాజాగా తెలుగు మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో KE జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, కార్తీ, అజిత్ ఇంకా విజయ్.. ఇలా చాలా మంది తమిళ్ హీరోలని తెలుగు వాళ్ళు తమ అనుకోని సొంతం చేసుకున్నారు, వాళ్ళని తమ హీరోలుగా, ఫ్యామిలీ మెంబర్స్ గా భావిస్తారు. కానీ మా తమిళ్ ఆడియన్స్ మాత్రం తెలుగు హీరోలని దగ్గరకు తీసుకోరు, బయటి వాళ్ళని చూసినట్టే చూస్తారు. వాళ్ళని సొంతం చేసుకోవాలని కూడా అనుకోరు అని అన్నారు. దీంతో KE జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారగా తెలుగు ఆడియన్స్ మాత్రం నిజమే అంటూ ఆయనని అభినందిస్తున్నారు. దీనిపై తమిళ వాళ్ళు తెలుగులో వసూళ్లు కోసం బాగానే కాక పడుతున్నావుగా అంటూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>