PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-janasena-chandrababu-ap-tdp-kutami8d00ecad-78a7-46dc-8613-43d530351b2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-janasena-chandrababu-ap-tdp-kutami8d00ecad-78a7-46dc-8613-43d530351b2d-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. ఈయన ప్రతి సినిమా లో ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నాడంటే దాన్ని తప్పక సాధించేవరకు వదిలిపెట్టడు. చావో రేవో తేల్చుకుంటాడు. ఆ విధంగానే జనసేన పార్టీని స్థాపించి ఏపీలో విస్తరించాలనుకున్నాడు. దానికోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాలకు పైగా కష్టపడి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అద్భుతమైన మెజారిటీతో పార్టీని గాడిలో పడేశాడు. తాను పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు PAWAN KALYAN;JANASENA;CHANDRABABU;AP;TDP KUTAMI{#}Prime Minister;Parliament;Nijam;Leader;Cinema;Janasena;kalyan;Service;Election;CM;CBN;Andhra Pradesh;history;Assembly;Telugu;TDP;Partyకష్టం: 21సీట్లు ఉన్న జనసేనాని 175 సీట్లకు చేరాలంటే ఈ కష్టాలు తప్పవా.?కష్టం: 21సీట్లు ఉన్న జనసేనాని 175 సీట్లకు చేరాలంటే ఈ కష్టాలు తప్పవా.?PAWAN KALYAN;JANASENA;CHANDRABABU;AP;TDP KUTAMI{#}Prime Minister;Parliament;Nijam;Leader;Cinema;Janasena;kalyan;Service;Election;CM;CBN;Andhra Pradesh;history;Assembly;Telugu;TDP;PartyThu, 11 Jul 2024 07:24:00 GMT- ఏపీలో అద్భుత శక్తిగా పవన్ కళ్యాణ్..
- ప్రధాని మెచ్చిన లీడర్ గా  గుర్తింపు..
- భవిష్యత్తులో పార్టీని విస్తరించడమే లక్ష్యమా.?

 
పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో. ఈయన ప్రతి సినిమా లో ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ ఏదైనా అనుకున్నాడంటే దాన్ని తప్పక సాధించేవరకు వదిలిపెట్టడు. చావో రేవో తేల్చుకుంటాడు. ఆ విధంగానే జనసేన పార్టీని స్థాపించి ఏపీలో విస్తరించాలనుకున్నాడు. దానికోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. దాదాపు తొమ్మిది సంవత్సరాలకు పైగా కష్టపడి 2024 అసెంబ్లీ ఎలక్షన్స్ లో అద్భుతమైన మెజారిటీతో పార్టీని గాడిలో పడేశాడు. తాను పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు స్థానాల్లో మొత్తానికి మొత్తం విజయం సాధించి చరిత్ర తిరగరాశాడు. దేశంలోనే ఏ పార్టీ కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఇప్పటివరకు గెలవలేదు. కానీ జనసేన ని చేసి చూపించాడు. ఇక నిజం చెప్పుకోవాలంటే అసలు పవన్ కళ్యాణ్ లేకుంటే చంద్రబాబు ఓడిపోయే వ్యక్తి. ఈ విధంగా పవన్ సపోర్టుతో టిడిపి కూటమి అద్భుత మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరి అలాంటి పవన్ కేవలం 21 సీట్లకే పరిమితమై ఉంటారా.? పార్టీని 175 నియోజకవర్గాల్లో విస్తరిస్తారా.? అసలు పవన్ ముందున్న సవాళ్లు ఏంటి.? అనే వివరాలు చూద్దాం.

 పవన్ పాలిటిక్స్ కష్టాలు:
 పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు  ఎన్డీఏ కూటమిలో తిరుగులేని లీడర్ గా ఉన్నారు.  అలాంటి ఈయన ప్రస్తుతం 21 సీట్లతో తన పార్టీని కాస్త బలోపేతం చేశారు. కానీ రాబోవు రోజుల్లో  ఆ పార్టీని రాష్ట్రమంతా విస్తరించాలి.  రాష్ట్రం మొత్తం జనసేన అనుచర గళాన్ని తయారు చేసుకోవాలి. లేదంటే భవిష్యత్తులో వాటిని లీడ్ చేయడం కష్టమవుతుంది.  పొత్తు అనేది ఎప్పటికీ ఉంటుందనేది కూడా చెప్పలేం. పొత్తు వల్ల టిడిపి ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఎలక్షన్స్ వరకు టిడిపి  పవన్ తో పొత్తు వద్దు అనుకుంటే  మాత్రం ఆయన జనసేన నుంచి ఒంటరిగా పోటీ చేయవలసి ఉంటుంది.

అలాంటి ఈ సమయంలో పార్టీని ఈ ఐదు సంవత్సరాలలో బలంగా తయారయ్యేలా చేసుకోవాలి.  175 నియోజకవర్గాల్లో వారి పార్టీ యొక్క అభ్యర్థులను తయారుచేసి వారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ జనసేన అంటే ఏ పార్టీకైనా పోటీ ఇవ్వగలదు అనే స్థాయికి చేరుకోవాలి. ఆ విధంగా పవన్ ఒక్క అడుగు ముందుకు వేస్తే టిడిపి నాయకుడు చంద్రబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అలా అందరినీ సమన్వయ పరుస్తూ ప్రజా సేవ చేస్తూనే పార్టీ బలోపేతానికి కష్టపడాల్సిందే. అలా అయితేనే జనసేనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానురాను భవిష్యత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>