MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd3a072ad-bdff-40ff-aec2-d0467427bcdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd3a072ad-bdff-40ff-aec2-d0467427bcdd-415x250-IndiaHerald.jpg మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇప్పటివరకు పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోగా చివరి షెడ్యూల్ తర్వాత వాటికి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో పంచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే సాధారణంగా దిల్ రాజు నిర్మిస్తున్న ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో tollywood{#}dil raju;Upasana;Sri Venkateshwara Creations;Singer;Mumbai;GEUM;king;marriage;Pawan Kalyan;producer;Producer;Tollywood;media;bollywood;Cinemaచరణ్‌- ఉపాసన.. ఛలో ముంబై..!?చరణ్‌- ఉపాసన.. ఛలో ముంబై..!?tollywood{#}dil raju;Upasana;Sri Venkateshwara Creations;Singer;Mumbai;GEUM;king;marriage;Pawan Kalyan;producer;Producer;Tollywood;media;bollywood;CinemaThu, 11 Jul 2024 10:55:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. ఇప్పటివరకు పలు లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోగా చివరి షెడ్యూల్ తర్వాత వాటికి సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో పంచుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే సాధారణంగా దిల్ రాజు నిర్మిస్తున్న ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు.

ఇందులో భాగంగానే తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా వెల్లడించారు. దీంతో మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు.  దిల్ రాజు వ్యాఖ్యానిస్తూ.. మా #గేమ్‌ఛేంజర్  షూటింగ్ మొదటి రోజు నుండి చివరి వరకు... ఇది మెగా పవర్ ప్యాక్డ్ ప్రయాణం.. ఇది ఒక రౌండ్.. త్వరలో మీకు కొన్ని అదిరిపోయే అప్‌డేట్‌లను అందిస్తాం .. అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, ముంబయి, చండీగఢ్, అలాగే న్యూజిలాండ్‌లోని సుందరమైన విదేశీ ప్రాంతాలలో అనేక నగరాల్లో గేమ్ ఛేంజర్ ని చిత్రీకరించారు. అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ముంబై జియో వరల్డ్ సెంటర్ లో జరుగుతున్న

 అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ల వివాహానికి బాలీవుడ్ ప్రముఖులంతా అటెండవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఐదు రోజుల పెళ్లి సంగీత్ తో పీక్స్ కి చేరుకుంది. విదేశీ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ ఇప్పటికే తన ప్రదర్శన ముగించి తిరుగు పయనమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాధిక- అనంత్ ల పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాడు. చరణ్ తో పాటు అతడి సతీమణి ఉపాసన కూడా ఈ పెళ్లిలో సందడి చేయనున్నారు...!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>