MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-baskarb327d020-c81d-4a12-8b36-446987a5368d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-baskarb327d020-c81d-4a12-8b36-446987a5368d-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కథ రచయిత మరియు దర్శకుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ శాతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ భాస్కర్ సినిమాలకు కథ , స్క్రీన్ ప్లే ను అందించాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. విజయ్ భాస్కరvijay baskar{#}vijay bhaskar;Writer;trivikram srinivas;Darsakudu;Tollywood;Coffee;Interview;Box office;Success;Director;Newsత్రివిక్రమ్ తో మనస్పర్ధలపై ఎట్టకేలకు స్పందించిన ఆ ప్రముఖ దర్శకుడు..?త్రివిక్రమ్ తో మనస్పర్ధలపై ఎట్టకేలకు స్పందించిన ఆ ప్రముఖ దర్శకుడు..?vijay baskar{#}vijay bhaskar;Writer;trivikram srinivas;Darsakudu;Tollywood;Coffee;Interview;Box office;Success;Director;NewsWed, 10 Jul 2024 08:33:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన కథ రచయిత మరియు దర్శకుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథ రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేశాడు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువ శాతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ భాస్కర్ సినిమాలకు కథ , స్క్రీన్ ప్లే ను అందించాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

విజయ్ భాస్కర్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి పని చేసిన సినిమాలు దాదాపు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక త్రివిక్రమ్ తన దగ్గర ఉన్న సమయంలో విజయ్ భాస్కర్ టాలీవుడ్ లోనే టాప్ డైరెక్టర్ స్థాయికి వెళ్ళాడు. ఇక ఎప్పుడు అయితే త్రివిక్రమ్ అయిన దగ్గర నుండి వెళ్లిపోయాడో అప్పటి నుండి ఈయనకు పెద్దగా విజయాలు లేవు. ఇకపోతే తాజాగా విజయ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయనకు మీకు , త్రివిక్రమ్ గారికి మధ్యలో గొడవలు జరిగాయి అంటూ వార్తలు వస్తున్నాయి అందుకు వివరణ ఇవ్వండి అనే ప్రశ్న వచ్చింది. దానికి విజయ్ భాస్కర్ సమాధానం ఇస్తూ ... మా ఇద్దరి మధ్య గొడవలు జరగడం కాదు , అలాంటి సందర్భం కూడా ఇప్పటి వరకు రాలేదు.

మేమిద్దరం కలిసి పని చేసాం. ఆ సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ కు దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. ఆయన టాప్ డైరెక్టర్ అయ్యారు. దానితో ఆయన చాలా బిజీ అయ్యారు. మేమిద్దరం కలిసి పని చేయాల్సిన అవసరం రాలేదు. అంతే తప్ప మా ఇద్దరికీ ఎలాంటి గొడవలు లేవు. ఇకపోతే కొన్ని రోజుల క్రితం కూడా ఆయన నన్ను కలిశాడు. మేము సరదాగా కాఫీ తాగుతూ కొంత సేపు మాట్లాడాం. మా ఇద్దరికీ కలవడానికి కూడా ఎక్కువ సమయం దొరకడం లేదు. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని ఆయన క్లారిటీ ఇచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>