Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gill1aad63e4-0d1e-4564-a394-11db22770948-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/gill1aad63e4-0d1e-4564-a394-11db22770948-415x250-IndiaHerald.jpgప్రస్తుతం శుభ్‌మన్ గిల్ టీ20 కెరీర్‌లో చాలా గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడు. నిజానికి ఈ ప్లేయర్ చాలా టాలెంటెడ్. కానీ రీసెంట్ టైమ్‌లో పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. గత పది T20 మ్యాచ్‌లలో ఆడి ఈ ప్లేయర్ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు, అందుకే బీసీసీఐ సెలెక్టర్లు T20 ప్రపంచ కప్‌కు అతడిని సెలెక్ట్ చేయలేదు. బదులుగా, సెలెక్టర్లు యశస్వి జైస్వాల్‌ను ఎంచుకున్నారు, యశస్వి IPL 2024లో మామూలు పర్ఫామెన్స్ యే కనబరిచాడు. అయినా అతడిని సెలెక్ట్ చేసుకున్నారు. గిల్ కు మరో అవకాశం ఇస్తూ జింబాబ్వే టూర్‌కు సెలెGill{#}Audi;Gujarat - Gandhinagar;Zimbabwe;BCCI;Chennai;ICC T20;Yashasvi Jaiswal;Athaduలాస్ట్ చాన్స్.. బాగా వాడేసుకున్న గిల్?లాస్ట్ చాన్స్.. బాగా వాడేసుకున్న గిల్?Gill{#}Audi;Gujarat - Gandhinagar;Zimbabwe;BCCI;Chennai;ICC T20;Yashasvi Jaiswal;AthaduWed, 10 Jul 2024 21:30:00 GMTప్రస్తుతం శుభ్‌మన్ గిల్ టీ20 కెరీర్‌లో చాలా గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్నాడు. నిజానికి ఈ ప్లేయర్ చాలా టాలెంటెడ్. కానీ రీసెంట్ టైమ్‌లో పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. గత పది t20 మ్యాచ్‌లలో ఆడి ఈ ప్లేయర్ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు, అందుకే బీసీసీఐ సెలెక్టర్లు t20 ప్రపంచ కప్‌కు అతడిని సెలెక్ట్ చేయలేదు. బదులుగా, సెలెక్టర్లు యశస్వి జైస్వాల్‌ను ఎంచుకున్నారు, యశస్వి IPL 2024లో మామూలు పర్ఫామెన్స్ యే కనబరిచాడు. అయినా అతడిని సెలెక్ట్ చేసుకున్నారు.

గిల్ కు మరో అవకాశం ఇస్తూ జింబాబ్వే టూర్‌కు సెలెక్ట్ చేశారు అక్కడ కూడా అతడు పేలవమైన పర్ఫామెన్స్ తో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. IPLలో అతని ప్రదర్శన కూడా వరస్ట్ గా ఉంది, 11 గేమ్‌లలో 147 స్ట్రైక్ రేట్‌తో 322 పరుగులు చేశాడు. ఈ ఫామ్ అతని జట్టు, గుజరాత్ టైటాన్స్ మాత్రమే కాకుండా, జాతీయ జట్టులో అతని కెరీర్ ని కూడా ప్రభావితం చేసింది.

అయితే, శుభ్‌మన్ గిల్ IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌పై సెంచరీ సాధించాడు, ఫామ్‌లో ఉంటే అత్యున్నత స్థాయిలో ప్రదర్శన ఇవ్వగల సత్తా తనకు ఇంకా ఉందని అతడు ప్రూవ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోర్లైతే తాత్కాలికంగా  మూయించగలిగాడు.

ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, భారత జట్టు మేనేజ్‌మెంట్ అతనిని జింబాబ్వే టూర్‌లో ఉంచుకుంది, అతను తిరిగి ఫామ్‌ను పుంజుకుంటాడని ఆశించింది. కానీ ఇప్పుడు కూడా వరస్ట్ పర్ఫామెన్స్ చూపిస్తున్నాడు. ఇలాంటి బ్యాటింగ్ తో నిరాశపరిస్తే టీ 20 ఫార్మాట్ నుంచి అతడిని పూర్తిగా పక్కన పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.

టీ20 క్రికెట్‌లో గిల్ భవిష్యత్తు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. అతను తన సత్తాను నిరూపించుకోవడానికి, జట్టులో తన స్థానాన్ని కాపాడుకోవడానికి రాబోయే మ్యాచ్‌లు కీలకం. ఈ టాలెంటెడ్ ప్లేయర్ కనుమరుగవుతారేమో అని ఫ్యాన్స్ చాలా ఆందోళన పడుతున్నారు. మరి గిల్ ఇప్పటికైనా తన ఆట తీరును పరిశీలించుకుని దానిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫాం సాధించడం అనేది ఇప్పుడు అతడి కెరీర్ కి అత్యవసరంగా మారింది. అయితే లాస్ట్ మ్యాచ్ లోకి అద్భుతంగా రానించాడు 49 బంతుల్లోనే 66 పరుగులు చేసి కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఒక రకంగా అతని కెరియర్ ని సేఫ్ గా ఉంచేసుకున్నాడు అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>