PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ap-telanagana-tdp-cbn-brs-kcrdb4e0f33-a46a-41be-b194-58bdf927d7b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ap-telanagana-tdp-cbn-brs-kcrdb4e0f33-a46a-41be-b194-58bdf927d7b4-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ నాయకులు వాయిస్ తగ్గించారు. ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వెనకా ముందు ఆలోచించి మాట్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వారు ఓడిపోవడమే. మరి ఎన్నికలకు ముందే ఈ విధమైన ఆలోచన చేసి ఉంటే ఓటమి వచ్చేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు గెలిచి, కేవలం కుటుంబ పాలన మాత్రమే చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా వర్గాలు వీరి వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇక కింది స్థాయిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు మాత్రం నేనే రాజు నేనే మంత్రి మా పార్టీ అధికారంలో ఉంది అంటూ విచ్చలవిడktr;ap;telanagana;tdp;cbn;brs;kcr{#}Nene Raju Nene Mantri;Telugu Desam Party;CBN;TDP;KTR;Congress;KCR;Party;media;Telugu;Telanganaతెలంగాణలోకి టీడీపీని ఆహ్వానిస్తున్నకేటీఆర్..ఎందుకంటే..?తెలంగాణలోకి టీడీపీని ఆహ్వానిస్తున్నకేటీఆర్..ఎందుకంటే..?ktr;ap;telanagana;tdp;cbn;brs;kcr{#}Nene Raju Nene Mantri;Telugu Desam Party;CBN;TDP;KTR;Congress;KCR;Party;media;Telugu;TelanganaWed, 10 Jul 2024 09:04:01 GMTఈ మధ్యకాలంలో  బీఆర్ఎస్ నాయకులు వాయిస్ తగ్గించారు. ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వెనకా ముందు ఆలోచించి మాట్లాడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వారు ఓడిపోవడమే. మరి ఎన్నికలకు ముందే ఈ విధమైన ఆలోచన చేసి ఉంటే ఓటమి వచ్చేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండు పర్యాయాలు గెలిచి, కేవలం కుటుంబ పాలన మాత్రమే చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా వర్గాలు వీరి వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇక కింది స్థాయిలో ఉండేటువంటి కొంతమంది నాయకులు మాత్రం నేనే రాజు నేనే మంత్రి మా పార్టీ అధికారంలో ఉంది అంటూ విచ్చలవిడిగా అక్రమ దందాలు, బెదిరింపులకు గురి చేశారు. చివరికి విసుగు చెందిన ప్రజలు కేసీఆర్ ను ఓడించాలని నిర్ణయం తీసుకొని చివరికి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో ఒక్కసారిగా అధికారాన్ని కోల్పోయినటు వంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు  కాస్త ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. 

ఈ మధ్యకాలంలో కేటీఆర్ కూడా పలు సభల్లో మాట్లాడుతూ మా పార్టీని మేము ప్రక్షాళన చేసుకోవాలి. కాస్త మా బుద్ధి మార్చుకోవాలి అని అంటూ అంటున్నారు.. ఇక ఇదే తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ వస్తున్నారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాతో కలుపుతారని, ఇక ఆంధ్ర పెత్తనమే తెలంగాణ రాష్ట్రంలో పెరిగిపోతుందని అంటున్నారు.  సాధ్యం కానీ మాటలను మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ తాజాగా ఢిల్లీలో  చాలా ఆసక్తి కలిగించే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం అయితే మాకే లాభం అని అంటున్నారు. ఈ దేశంలో పార్టీలను ఎక్కడికైనా విస్తరించే స్వేచ్ఛ ఉందని, మేము బీఆర్ఎస్ పార్టీని దేశమంతా విస్తరిద్దామనుకున్నాం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తాం అన్నాం.

ఆ విధంగానే చంద్రబాబు కూడా టిడిపిని తెలంగాణలో బలోపేతం చేద్దాం అనుకోవడంలో తప్పులేదు అన్నారు. ఒకవేళ తెలంగాణలో టిడిపి బలపడితే బీఆర్ఎస్ కే లాభమని చెప్పారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఢిల్లీలో  మీడియా ముఖంగా చెప్పారు. చంద్రబాబు తెలంగాణ లో టిడిపి పార్టీని బలోపేతం చేస్తాననే మాటలకు కేటీఆర్ ఈ విధంగా సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆయన ఇండైరెక్టుగా టిడిపి తెలంగాణలోకి రావాలని ఆహ్వానం పలికినట్టుగా ఉంది. అంతేకాదు చూస్తుంటే టిడిపిలో బీఆర్ఎస్ ని టీడీపీ లో విలీనం చేసేలా కూడా కనిపిస్తున్నారు  అంటున్నారు కేటీఆర్ మాటలు విన్న జనాలు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>