MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal0c4fb09f-2230-40d9-b0eb-9d9de2e29242-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kamal0c4fb09f-2230-40d9-b0eb-9d9de2e29242-415x250-IndiaHerald.jpgదేశంలోనే మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కమల్ హాసన్ తాజాగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. భారతీయుడు 2 సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు. లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థల వారు ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు అనిరుkamal{#}Siddharth;Bharateeyudu;Music;kajal aggarwal;Hindi;lyca productions;rakul preet singh;Red;Director;Hero;Tamil;Telugu;Cinema"భారతీయుడు 2" కి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!"భారతీయుడు 2" కి తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!kamal{#}Siddharth;Bharateeyudu;Music;kajal aggarwal;Hindi;lyca productions;rakul preet singh;Red;Director;Hero;Tamil;Telugu;CinemaWed, 10 Jul 2024 10:00:00 GMTదేశంలోనే మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి కమల్ హాసన్ తాజాగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చాలా సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకున్న భారతీయుడు మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. భారతీయుడు 2 సినిమాలో సిద్ధార్థ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కాజల్ అగర్వాల్ కీలక పాత్రలలో నటించారు.

లైకా ప్రొడక్షన్స్ , రెడ్ గ్లాంట్ సంస్థల వారు ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో దాదాపు 9 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక సీడెడ్ ఏరియాలో 4 కోట్ల మేర , ఆంధ్ర ఏరియాలో 12 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీనితో మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 24 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. దానితో ఈ సినిమా 25 కోట్ల షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఈ మూవీ కి కనుక హిట్ టాక్ వచ్చినట్లు అయితే 25 కోట్ల షేర్ కలక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఈజీగా రాబట్టే అవకాశం ఉంది. మరి ఈ మూవీ కి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>