PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-y-s-bharathi-reddy-y-s-sharmila-y-s-jagan-ysr-family-politicsafe30d7e-e4c7-4713-9025-aa109e0da37a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy-y-s-bharathi-reddy-y-s-sharmila-y-s-jagan-ysr-family-politicsafe30d7e-e4c7-4713-9025-aa109e0da37a-415x250-IndiaHerald.jpg- వైఎస్సార్ బొమ్మ లేపేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్‌ - ఇటు త‌ల్లి.. చెల్లి ఫొటోలకు ఎలాగూ చోటు లేదు - త‌న బొమ్మ‌తో పాటు భార్య భార‌తి బొమ్మతో రాజ‌కీయ‌మా ? ( రాయ‌ల సీమ - ఇండియా హెరాల్డ్ ) దివంగత వైయస్సార్ బొమ్మను పెట్టుకుని గెలిచామని గతంలో వైసీపీ నేతలు చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అవకాశం వదిలేసుకుంటున్నారు. ఇకనుంచి తాము జగన్ బొమ్మ పెట్టుకుని ఓడిపోయామని చెప్పుకోవాలని.. వైసీపీ నేతలు అంతా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన వైయస్సార్ 75వ జయంతి కార్యక్రమాలను కూడా జగన్ లైట్ తీసుకున్నారు. మరోYs Jagan Mohan Reddy; y s Bharathi Reddy; y s Sharmila; y s Jagan; YSR family politics{#}Jayanthi;Rayalaseema;Wife;Y. S. Rajasekhara Reddy;India;Sharmila;Reddy;Jagan;YCP;Congress;politics;Partyవైఎస్సార్ బొమ్మ‌కు జ‌గ‌న్‌కు రుణం తీరిపోయిందా.. ఇక భార‌తి బొమ్మ పెట్టుకుంటాడా ?వైఎస్సార్ బొమ్మ‌కు జ‌గ‌న్‌కు రుణం తీరిపోయిందా.. ఇక భార‌తి బొమ్మ పెట్టుకుంటాడా ?Ys Jagan Mohan Reddy; y s Bharathi Reddy; y s Sharmila; y s Jagan; YSR family politics{#}Jayanthi;Rayalaseema;Wife;Y. S. Rajasekhara Reddy;India;Sharmila;Reddy;Jagan;YCP;Congress;politics;PartyWed, 10 Jul 2024 11:50:25 GMT- వైఎస్సార్ బొమ్మ లేపేయాల‌ని జ‌గ‌న్ డిసైడ్‌
- ఇటు త‌ల్లి.. చెల్లి ఫొటోలకు ఎలాగూ చోటు లేదు
- త‌న బొమ్మ‌తో పాటు భార్య భార‌తి బొమ్మతో రాజ‌కీయ‌మా ?

( రాయ‌ల సీమ  - ఇండియా హెరాల్డ్ )

దివంగత వైయస్సార్ బొమ్మను పెట్టుకుని గెలిచామని గతంలో వైసీపీ నేతలు చాలా గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అవకాశం వదిలేసుకుంటున్నారు. ఇకనుంచి తాము జగన్ బొమ్మ పెట్టుకుని ఓడిపోయామని చెప్పుకోవాలని.. వైసీపీ నేతలు అంతా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇక తాజాగా జరిగిన వైయస్సార్ 75వ జయంతి కార్యక్రమాలను కూడా జగన్ లైట్ తీసుకున్నారు. మరోవైపు షర్మిల కూడా తాను వైయస్సార్ వారసురాలని అని బలంగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.


ఇక వైసీపీలో ఇప్పుడు ఏదైనా జగన్ సెంట్రిక్ గానే రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్ ప్రస్తావన పెద్దగా అవసరం లేదన్న సంకేతాలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వైయస్సార్ బొమ్మ జగన్ పెట్టుకుంటే అటు షర్మిల కూడా పెట్టుకోమన్నారు. ఒకే నేత బొమ్మ ఇటు వైసీపీ నాయకులు.. అటు కాంగ్రెస్ నాయకులు పెట్టుకుని రాజకీయం చేస్తే ఖచ్చితంగా అది వెటకారంగా ఉంటుంది అనటంలో సందేహం లేదు. మరోవైపు జగన్ ఈ ఎన్నికలకు ముందు కూడా తాను రాజన్న రాజ్యాన్ని తెచ్చానని ఎక్కడా చెప్పలేదు.


ప్రతి ఇంట్లో తన ఫోటో ఉండేలా పాలన చేశానని చెప్పారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. జగన్ ఎలాగో తన తల్లి వై.ఎస్. విజయలక్ష్మిని పార్టీ గౌరవ అధ్యక్షురాలు హోదా నుంచి కూడా ఎన్నికలకు ముందు తప్పించేశారు. ఇప్పుడు వైయస్సార్, వైయస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల ఫోటోలు జగన్ పెట్టుకునే పరిస్థితి లేదు. అయితే తన బొమ్మ పెట్టుకోవాలి.. లేకపోతే తనతో పాటు తన భార్య వైఎస్ భారతీ రెడ్డి ఫోటో మాత్రమే పెట్టుకోవాలి. మరి భారతీ రెడ్డి ఫోటో పెట్టుకుని జగన్ ఏమని ఓట్లు అడుగుతారో..? ఎలా జనాల్లోకి వెళతారో..? ఆయనకే తెలియాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>