MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-8c0769e6-3dcf-4fa5-a5ec-325917ab3d91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-8c0769e6-3dcf-4fa5-a5ec-325917ab3d91-415x250-IndiaHerald.jpgతెలుగు చలనచిత్ర పరిశ్రమ డైరెక్టర్లు అడుగుపెట్టారు. వారు అనేక రకాల జానర్స్‌ను టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొందరు మాత్రం కొన్ని జానర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అవతరిస్తుంటారు. ఉదాహరణకి రాంగోపాల్ వర్మ హారర్ జానర్‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. అయితే ఆయన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణ వంశీ ఫ్యామిలీ డ్రామా సినిమాలకు చిరునామా అయ్యారు. గులాబీ చిత్రంతో డైరెక్టర్ అయిన కృష్ణవంశీ తర్వాత "నిన్నే పెళ్లాడతా" సినిమా రూపొందించాడు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అతడికి చాలా గుర్తింపు తెచ్చి పెట్టింది. Pawan Kalyan {#}Ram Charan Teja;krishna;krishna vamshi;mahesh babu;Pawan Kalyan;Industries;Ranga Marthanda;Murari;Annayya;media;Ram Gopal Varma;Chitram;Director;Hero;Tollywood;Success;Cinema;kalyanపవన్ కళ్యాణ్ వల్లే మహేష్ బాబు స్టార్ హీరో అయ్యాడా.. స్టార్ చెప్పిన సీక్రెట్‌..?పవన్ కళ్యాణ్ వల్లే మహేష్ బాబు స్టార్ హీరో అయ్యాడా.. స్టార్ చెప్పిన సీక్రెట్‌..?Pawan Kalyan {#}Ram Charan Teja;krishna;krishna vamshi;mahesh babu;Pawan Kalyan;Industries;Ranga Marthanda;Murari;Annayya;media;Ram Gopal Varma;Chitram;Director;Hero;Tollywood;Success;Cinema;kalyanWed, 10 Jul 2024 18:04:00 GMT
తెలుగు చలనచిత్ర పరిశ్రమ డైరెక్టర్లు అడుగుపెట్టారు. వారు అనేక రకాల జానర్స్‌ను టచ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొందరు మాత్రం కొన్ని జానర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అవతరిస్తుంటారు. ఉదాహరణకి రాంగోపాల్ వర్మ హారర్ జానర్‌కు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. అయితే ఆయన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన కృష్ణ వంశీ ఫ్యామిలీ డ్రామా సినిమాలకు చిరునామా అయ్యారు. గులాబీ చిత్రంతో డైరెక్టర్ అయిన కృష్ణవంశీ తర్వాత "నిన్నే పెళ్లాడతా" సినిమా రూపొందించాడు. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి అతడికి చాలా గుర్తింపు తెచ్చి పెట్టింది.

సినిమా ఒక నేషనల్ అవార్డు కూడా విన్ అయ్యింది. దీని తర్వాత కృష్ణ వంశీ కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లింది. అక్కినేని నాగార్జునతో కలిసి చంద్రలేఖ సినిమా కూడా చేశాడు కృష్ణ వంశీ. ఆ తర్వాత ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్నాడు. "గోవిందుడు అందరివాడేలే" సినిమా చేశాక ఈ డైరెక్టర్ స్పీడ్ తగ్గించాడు. రీసెంట్ గా రంగమార్తాండ సినిమాతో మళ్లీ వచ్చాడు. ఈ సినిమా చాలా మందిని ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పవన్ కళ్యాణ్ , మహేష్ బాబుల గురించి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం కాంట్రవర్సీకి తెరలేపాయి. కృష్ణవంశీ మాట్లాడుతూ ‘రాజకుమారుడు సినిమా చేశాక మహేష్ బాబు చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన చేసిన 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయ్యాయి. అప్పుడు మహేష్ పని అయిపోయిందని చాలామంది అన్నారు. టాలీవుడ్ లో అతడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మురారి సినిమాకి ముందు ఇదంతా జరిగింది. మహేష్ కెరీర్ అతని అన్నయ్య కెరీర్ లాగానే నాశనం అవుతుందేమో అని అందరూ అనుకున్నారు కానీ అలాంటి సమయంలో "మురారి" చిత్రం అతనికి లైఫ్ సేవర్‌గా నిలిచింది. ఆ సినిమా చేస్తున్నప్పుడు అది కచ్చితంగా సక్సెస్ కావాలని అందరూ కోరుకున్నారు..."

"అదే సమయం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ఉన్న కొన్ని గ్రూపులు మహేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరినీ కంపేర్ చేయడం స్టార్ట్ చేశారు. దీని ఫలితంగా మహేష్‌కు మీడియా ఎక్కువ ఫోకస్ ఇచ్చింది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ కారణంగా మహేష్ స్టార్ హీరో అయ్యాడు.’ అంటూ కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యల ప్రస్తుతం వివాదాస్పదం గా ఇదే ఫ్యాన్ వార్‌కి కూడా దారి తీసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>