MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran9f1af394-7e71-43dc-9958-90abd17d2a4a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran9f1af394-7e71-43dc-9958-90abd17d2a4a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన కొంత కాలం క్రితం విడుదల అయిన రాజా వారు రాణి గారు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని కిరణ్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో ఈ నటుడి క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. ఇకkiran{#}sujeeth;kiran;rani;raja;Posters;Love;sandeep;Telugu;Cinemaడిఫరెంట్ టైటిల్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ.. టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచేశాడు..?డిఫరెంట్ టైటిల్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ.. టైటిల్ తోనే క్యూరియాసిటీ పెంచేశాడు..?kiran{#}sujeeth;kiran;rani;raja;Posters;Love;sandeep;Telugu;CinemaWed, 10 Jul 2024 12:11:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈయన కొంత కాలం క్రితం విడుదల అయిన రాజా వారు రాణి గారు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని కిరణ్ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలే దక్కాయి. ఆ తర్వాత ఈ నటుడు ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. 

ఈ సినిమాతో ఈ నటుడి క్రేజ్ తెలుగులో భారీగా పెరిగింది. ఇక అప్పటి నుండి ఈయన వరుసగా సినిమాలతో ప్రేక్షకులపై దండయాత్ర చేశాడు. కానీ అందులో ఒకటి , రెండు సినిమాలు పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నాయి కానీ ఏ సినిమా కూడా భారీ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఈయన వరుసగా సినిమాలు చేస్తాడు కానీ గొప్ప కథలతో రాడు , ఎప్పుడు రొటీన్ స్టోరీలతోనే మూవీ లు వస్తాడు అనే విమర్శలు కూడా ఇతనిపై వెల్లువెత్తాయి. ఇలా విమర్శల కారణంగా ఏమో తెలియదు కానీ ఈయన ఈ సంవత్సరం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఒక అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలి అని కిరణ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం ఈయన నటిస్తున్న సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ విడుదల అయింది. తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందుతున్న మూవీ కి "క" అనే టైటిల్ ను కన్ఫామ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ టైటిల్ అలాగే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన పోస్టర్ రెండు కూడా డిఫరెంట్ గా ఉండడంతో ఈ పోస్టర్ తోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. మరి ఈ సినిమాతో కిరణ్ కి ఏ స్థాయి విజయం అందుతుంది చూడాలి. ఈ మూవీ కి సుజిత్ , సందీప్ దర్శకత్వం వహిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>