PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp9053cd92-1598-4869-a751-690a433dce97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp9053cd92-1598-4869-a751-690a433dce97-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ఓడిపోయి... గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం వైసీపీ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా.. నాలుగు ఎంపీ లకే పరిమితమైంది. ఇక అటు తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి... వైసీపీని ఒక ఆట ఆడుకుంటుంది. tdp{#}Annayya;Amaravati;Telugu Desam Party;Assembly;kadapa;TDP;YCP;CBN;dr rajasekhar;MP;Andhra Pradesh;Sharmila;Reddy;media;Jaganషర్మిలను పావులా వాడుకొని జగన్ ను దెబ్బ కొట్టారా?షర్మిలను పావులా వాడుకొని జగన్ ను దెబ్బ కొట్టారా?tdp{#}Annayya;Amaravati;Telugu Desam Party;Assembly;kadapa;TDP;YCP;CBN;dr rajasekhar;MP;Andhra Pradesh;Sharmila;Reddy;media;JaganWed, 10 Jul 2024 07:50:38 GMT* జగన్ కోటను బద్దలు కొట్టిన షర్మిల
* కష్టకాలంలో జగన్ కు దూరంగా షర్మిల, విజయమ్మ
* షర్మిలను ఉసిగొలిపింది  ఎల్లో మీడియానేనా?
* జగన్ ను ఓడించేందుకు షర్మిలను టిడిపి వాడుకుందా!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత దారుణంగా ఓడిపోయి... గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం వైసీపీ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోగా..  నాలుగు ఎంపీ లకే పరిమితమైంది. ఇక అటు తెలుగుదేశం కూటమి అఖండ మెజారిటీతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి... వైసీపీని ఒక ఆట ఆడుకుంటుంది.


అయితే ఏపీలో ఇంత దారుణంగా వైసిపి పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల పాలనలో... అమరావతి రాజధాని, మూడు రాజధానులు, ప్రతిపక్ష నేతల ఇండ్ల ధ్వంసం, చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేయడం,  కేసులు పెట్టడం లాంటి రకరకాల కారణాలవల్ల... జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఓటమికి షర్మిల కూడా ఒక కారణం.


జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల... చాలా కార్యక్రమాలు చేపట్టి...  ఏపీ ప్రజలను డైవర్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఏదో జరుగుతున్నట్లు... షర్మిలకు అన్యాయం జరిగినట్లు... ఇటు తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా కూడా విపరీతంగా తప్పుడు వార్తలను ప్రచారం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సొంత చెల్లికి జగన్ మోహన్ రెడ్డి అన్యాయం చేశాడని... ఎల్లో మీడియా అలాగే తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారాన్ని ఏపీ ప్రజలు కూడా నమ్మారు.


ఇటు షర్మిల కూడా... ప్రతిపక్షాల మాట విని తన సొంత అన్నయ్య పై యుద్ధాన్ని ప్రకటించింది. ఏదైనా సమస్య ఉంటే జగన్ మోహన్ రెడ్డి తో కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయేది. కానీ కడప నియోజకవర్గంలోనే ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి... జగన్ కోట బద్దలు కొట్టేసింది. ఆమె గెలవకుండా.. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైంది షర్మిల.  షర్మిల చేసిన ఈ తప్పిదం కారణంగా...  వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. అటు తెలుగుదేశం కూటమి.. ఎల్లో మీడియా... అధికారంలో... చెలరేగిపోతున్నాయని వైసీపీ చెబుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>