MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-233f56e6-2020-46b5-a781-0233ad5c4410-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anupama-233f56e6-2020-46b5-a781-0233ad5c4410-415x250-IndiaHerald.jpgఆమె పేరు వినగానే కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. ఆమె కళ్ళు చూడగానే మన అబ్బాయిలు షాక్ కి గురవుతారు. ఇక ఆమె కురులతో ఉయ్యాలా ఆట ఆడాలని తెగ ఉబలాట పడిపోతుంటారు. మొత్తంగా ఆమె అందానికి టాలీవుడ్ గులాం అంటుంది. అందుకే ఆమె నాటినుండి నేటికీ తన ఉనికిని చాటుకుంటోంది. ఆమె మరెవరో కాదు... టాలీవుడ్ ముద్దుగుమ్మ, మలయాళ నటి అయినటువంటి అనుపమ పరమేశ్వరన్. ఆమె గురించి తెలుగు కుర్రాళ్లకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం కలబోస్తే తయారైన శిల్పం అనుపమ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాanupama {#}karthikeya;kartikeya;Kerala;Tollywood;Comedy;bollywood;Telugu;India;Cinema;Heart;Newsఆమె కళ్ళతోనే మేజిక్ చేస్తుంది.. అందుకే కుర్రకారుకి ఆమె అంటే చెప్పలేని ఇష్టం!ఆమె కళ్ళతోనే మేజిక్ చేస్తుంది.. అందుకే కుర్రకారుకి ఆమె అంటే చెప్పలేని ఇష్టం!anupama {#}karthikeya;kartikeya;Kerala;Tollywood;Comedy;bollywood;Telugu;India;Cinema;Heart;NewsWed, 10 Jul 2024 16:00:00 GMTఆమె పేరు వినగానే కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. ఆమె కళ్ళు చూడగానే మన అబ్బాయిలు షాక్ కి గురవుతారు. ఇక ఆమె కురులతో ఉయ్యాలా ఆట ఆడాలని తెగ ఉబలాట పడిపోతుంటారు. మొత్తంగా ఆమె అందానికి టాలీవుడ్ గులాం అంటుంది. అందుకే ఆమె నాటినుండి నేటికీ తన ఉనికిని చాటుకుంటోంది. ఆమె మరెవరో కాదు... టాలీవుడ్ ముద్దుగుమ్మ, మలయాళ నటి అయినటువంటి అనుపమ పరమేశ్వరన్. ఆమె గురించి తెలుగు కుర్రాళ్లకు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయం కలబోస్తే తయారైన శిల్పం అనుపమ అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తాజాగా అమ్మడు టిల్లు స్క్వేర్ సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంది.

ఈ సినిమాలో తన గ్లామర్ తో ఒక్కసారిగా అమ్మడు హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ క్రమంలో చాలామంది యువకుల హార్ట్ బ్రేక్ చేసింది అనుపమ మరమేశ్వరన్. ఈ కేరళ కుట్టి చేతుల్లో ఇప్పుడు సినిమాలు తక్కువగానే ఉన్నా.. ఉన్నవన్నీ మంచి ప్రాజెక్టులే. కొన్నాళ్ల క్రితం విడుదలైన కార్తికేయ 2 సినిమా ఈ ముద్దుగుమ్మని ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. దాంతో అనుపమకి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయని గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాకుండా అక్కడి ఖాన్లు ఆమెతో నటించాలని తెగ ఉబలాట పడుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నార్త్ జనాలు కూడా ఆమెని కార్తికేయ సినిమాలో చూసినప్పటినుండి ఫాన్స్ గా మారిపోయారు. దాంతో ఆమె త్వరలో అక్కడ తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే ఆమె తాజాగా తన డ్రీమ్ ప్రాజెక్ట్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... చాలా ఆసక్తికరమైన విషయాలను పాలుపంచుకుంది. ఆమెకి ఓ పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఉందంటూ అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. కాగా ఇప్పటికే ఆమె అ.ఆ, టిల్లూ స్క్వేర్ సినిమాల్లో కొంతమేర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కామెడీ రోల్ కోసం కూడా చూస్తున్నానని వెల్లడించడం గమనార్హం. అయితే ఆమెకి ఓ ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ చేయాలని ఎప్పటినుండో ఉందట! సో ఆ కోరికను తీర్చే నిర్మాతలు దొరికితే ఆమె డేట్స్ ఇస్తానని చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>