Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-da1717b3-09c1-4458-8ac8-5fdc66510ced-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-da1717b3-09c1-4458-8ac8-5fdc66510ced-415x250-IndiaHerald.jpgటీమిండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆటతీరుతో ఎప్పుడూ యువ ఆటగాళ్లు తెరమీదకి వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది దేశవాళి క్రికెట్లో వివిధ టోర్నిలలో రాణిస్తూ అదరకొడుతూ ఉంటే ఇంకొంతమంది క్యాష్ రిచ్ లీగ్ గా పిలుచుకునే ఐపీఎల్లో ఛాన్సులు దక్కించుకుంటూ తమ ప్రదర్శనతో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. ఇలా ఈ ఏడాది ముగిCricket {#}Zimbabwe;collector;salt;Varasudu;Maha;abhishek;Yuva;ICC T20;INTERNATIONAL;Audiఈ ఏడాది టి20 క్రికెట్లో.. ఆ కుర్రాడే తోపు?ఈ ఏడాది టి20 క్రికెట్లో.. ఆ కుర్రాడే తోపు?Cricket {#}Zimbabwe;collector;salt;Varasudu;Maha;abhishek;Yuva;ICC T20;INTERNATIONAL;AudiWed, 10 Jul 2024 10:45:00 GMTటీమిండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆటతీరుతో ఎప్పుడూ యువ ఆటగాళ్లు తెరమీదకి వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా ఫ్యూచర్ స్టార్స్ తామే అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది దేశవాళి క్రికెట్లో వివిధ టోర్నిలలో రాణిస్తూ అదరకొడుతూ ఉంటే   ఇంకొంతమంది క్యాష్ రిచ్ లీగ్ గా పిలుచుకునే ఐపీఎల్లో ఛాన్సులు దక్కించుకుంటూ తమ ప్రదర్శనతో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటున్నారు.


ఇలా ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన యువ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అభిషేక్ శర్మ ఒకరు అన్న విషయం తెలిసిందే. తన విధ్వంసకరమైన ఆటతీరుతో ఐపీఎల్ లో సూపర్ హీరోగా మారిపోయాడు ఈ యంగ్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోయినప్పటికీ.. ఎక్కడ ఒత్తిడి తడబాటు లేకుండా వీర బాదుడు బాదేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ కుర్రాడి బాదుడు ముందు మహా మహా బౌలర్లు సైతం బెంబేలెత్తిపోయారు. ఇంకేముంది అతనికి కలెక్టర్ టీమ్ ఇండియాలో ఛాన్స్ ఇవ్వగా ఇప్పుడు జింబాబ్వేతో జరుగుతున్నటు టీ20 సిరీస్ లోనూ అతను అదరగొడుతున్నాడు.


 ఇక ఇటీవల జింబాబ్వే తో జరిగిన టి20 మ్యాచ్ లో కూడా సూపర్ సెంచరీ చేసి చెలరేగిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఏడాది మొత్తం అభిషేక్ శర్మ అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరంలో అభిషేక్ శర్మ 18 t20 మ్యాచ్ లు ఆడి ఏకంగా 584 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 200 కు పైగా ఉండడం విశేషం. పొట్టి క్రికెట్లో మరో క్రికెటర్ స్ట్రైక్ రేట్ ఈ రేంజ్ లో లేదు. రాసేల్ 199.47 జాక్ ప్రెజర్ 194.13, ట్రావిస్ హెడ్ 176.24 ఫిలిప్ సాల్ట్ 172.47 స్ట్రైక్రెట్ తో ఉండగా అందరికంటే అత్యధిక స్ట్రైక్ రేటుతో కొనసాగుతున్నాడు యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ. ఇక అతని ఆట తీరు చూసి అతను ఇక రోహిత్ శర్మకు  వారసుడు అంటూ అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.?







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>