MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgకాలీవుడ్ లో హీరోయిన్ గా మొదలుపెట్టి ఆతరువాత క్యారెక్టర్ యాక్టర్ గా మరీ ముఖ్యంగా నెగిటివ్ పాత్రలకు చిరునామాగా మారిన వరలక్ష్మీ హవా టాలీవుడ్ లో కూడ బాగా కొనసాగుతోంది. వరసపెట్టి టాప్ హీరోల సినిమాలలో కూడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె పెళ్లి చెన్నైలో జరిగింది. ఆ పెళ్లికి కాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడ హాజర్ అయ్యారు. ఈమె పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అత్యంత ఘనంగా జరిగిన ఆమె పెళ్లి ఖర్చు పై సోషల్ మీడియాలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. VARALAKSHMI{#}jeevitha rajaseskhar;sarath kumar;Husband;kajal aggarwal;Father;Tollywood;Heroine;marriage;Cinemaవరలక్ష్మి పెళ్లి ఖర్చు పై షాకింగ్ ప్రచారం !వరలక్ష్మి పెళ్లి ఖర్చు పై షాకింగ్ ప్రచారం !VARALAKSHMI{#}jeevitha rajaseskhar;sarath kumar;Husband;kajal aggarwal;Father;Tollywood;Heroine;marriage;CinemaTue, 09 Jul 2024 16:17:00 GMTకాలీవుడ్ లో హీరోయిన్ గా మొదలుపెట్టి ఆతరువాత క్యారెక్టర్ యాక్టర్ గా మరీ ముఖ్యంగా నెగిటివ్ పాత్రలకు చిరునామాగా మారిన వరలక్ష్మీ హవా టాలీవుడ్ లో కూడ బాగా కొనసాగుతోంది. వరసపెట్టి టాప్ హీరోల సినిమాలలో కూడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె పెళ్లి చెన్నైలో జరిగింది. ఆ పెళ్లికి  కాలీవుడ్ ప్రముఖులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడ హాజర్ అయ్యారు.


ఈమె పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో అత్యంత ఘనంగా జరిగిన ఆమె పెళ్లి ఖర్చు పై సోషల్ మీడియాలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి. వరలక్ష్మీ ముంబాయికి చెందిన నికోలాయ్ సచ్ దేవ్ ని తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్ళికి వరలక్ష్మీ తండ్రి ప్రముఖ నటుడు శరత్ కుమార్ 200 వందల కోట్లు ఖర్చు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది.


ఈ వార్తల పై నటుడు శరత్ కుమార్ స్పందించాడు. ఒక పెళ్ళికి అంత ఖర్చు ఎందుకు పెడతామని తమ స్థాయిలో సింపుల్ గా తన కూతురి పెళ్లి జరిగిందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తన కూతురు పెళ్లి పై ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని సూచన చేశాడు. అదేవిధంగా వరలక్ష్మి భర్త నికోలాయ్ స్వతహాగా ధనవంతుడు అని అంటూ  ముంబైలో చాలా పలుకుబడి ఉన్న కుటుంబం అతడిది అని అంటున్నారు.


ప్రస్తుతం నటిగా చాల బిజీగా ఉన్న వరలక్ష్మీ తన పెళ్లి సందర్భంగా కేవలం వారం రోజులు గ్యాప్ మాత్రమే తీసుకుని తిరిగి షూటింగ్ లలో బిజీగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె గృహిణిగా మారినప్పటికీ కాజల్ అగర్వాల్ తరహాలో ఒకపక్క నటిస్తూనే మరోపక్క తన కెరియర్ ను కొనసాగిస్తోంది అనుకోవాలి. టాలీవుడ్ కు సంబంధించి కూడ ఈమె కొన్ని భారీ సినిమాలలో నటిస్తూ దక్షిణాది సినిమా రంగంలో ఆమె ప్రస్తుతం నెంబర్ వన్ లేడీ విలన్ కొనసాగుతోంది..









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>