PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-am-i-afraid-of-name-in-ycp3727c325-ab6e-4359-b2ec-abdca259909b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-am-i-afraid-of-name-in-ycp3727c325-ab6e-4359-b2ec-abdca259909b-415x250-IndiaHerald.jpgపేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదేపదే ప్రెస్ మీట్‌లు పెడుతూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తూ వైసీపీలో కీలక నేతగా ఉండేవారు. వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. జగన్ కోసం ఎంత చిడతలు వాయించినా.. పేర్ని నానికి మూడేళ్ల తర్వాత క్యాబినెట్ నుంచి ఊస్టింగ్ తప్పలేదు. అప్పుడే పేర్ని నానికి చెప్పలేని బాధ మనసులో ఉన్నా.. తప్పదుగా జగన్ భజన వాయిస్తూ వచ్చారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో పేర్ని నాని పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు పేరును కిట్టు ను అసెంబ్లీ ఎన్నికX minister perina Nani; bandaru perni Nani; ycp Nani; perini Kittu; ys Jagan{#}Perni Nani;Cabinet;Nani;Janasena;Kollu Ravindra;Press;Assembly;YCP;Jagan;Minister;Partyవైసీపీలో పేర్ని నానికి భ‌యం ఎందుకు ప‌ట్టుకుంది.. వ‌ణికిపోతున్నాడా ?వైసీపీలో పేర్ని నానికి భ‌యం ఎందుకు ప‌ట్టుకుంది.. వ‌ణికిపోతున్నాడా ?X minister perina Nani; bandaru perni Nani; ycp Nani; perini Kittu; ys Jagan{#}Perni Nani;Cabinet;Nani;Janasena;Kollu Ravindra;Press;Assembly;YCP;Jagan;Minister;PartyTue, 09 Jul 2024 12:11:39 GMTపేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదేపదే ప్రెస్ మీట్‌లు పెడుతూ తనదైన స్టైల్ లో సెటైర్లు వేస్తూ వైసీపీలో కీలక నేతగా ఉండేవారు. వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేర్ని నానిని జగన్ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. జగన్ కోసం ఎంత చిడతలు వాయించినా.. పేర్ని నానికి మూడేళ్ల తర్వాత క్యాబినెట్ నుంచి ఊస్టింగ్ తప్పలేదు. అప్పుడే పేర్ని నానికి చెప్పలేని బాధ మనసులో ఉన్నా.. తప్పదుగా జగన్ భజన వాయిస్తూ వచ్చారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో పేర్ని నాని పోటీ నుంచి తప్పుకుని తన తనయుడు పేరును కిట్టు ను అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపారు. మామూలుగా అయితే జగన్ కు.. పేర్ని నాని కి సీటు ఇవ్వాలన్న కోరిక ఉంది.


అయితే ఇంట్లో పోరు పడలేక పేర్ని నాని పోటి నుంచి తప్పుకుని.. తన తనయుడు పేరును కిట్టూకి సీటు ఇప్పించుకోక తప్ప లేదన్న గుసగుసలు కూడా మచిలీపట్నంలో గట్టిగా నడిచాయి. ఈ ఎన్నికల్లో ఎంతో అట్టహాసంగా తన కుమారుడు కిట్టూని పొలిటికల్ ఎంట్రీ చేయించి పోటీ చేయించినా.. మంత్రి కొల్లు రవీంద్ర చేతులో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాడు. తొలి ఎన్నికల్లోనే కిట్టు ఓడిపోవడంతో.. పేర్ని నాని ఫ్యామిలీ సైతం పెద్ద షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది.


వైసీపీ ఘోర ఓట‌మి తర్వాత ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో తన కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి..? పైగా తాను పొలిటికల్ కెరీర్ త్యాగం చేసి తన కుమారుడికి సీటు ఇప్పించుకున్న గెలిపించుకోలేకపోయానని అసలు వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. తెగ  అవాకులు, చెవకులు పేల్చాను.. ఇప్పుడు రాజకీయంగా తన కుమారుడిని టీడీపీ, జనసేన వాళ్లు టార్గెట్ చేస్తే..? ఇలా రకరకాల టెన్షన్లతో పేర్ని నాని భయం భయంగా ఉంటున్నట్టు బందర్ పొలిటికల్ వర్గాల గుసగుస.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>