MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiru06ce297b-a57f-452c-b1a3-88238056b75f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/chiru06ce297b-a57f-452c-b1a3-88238056b75f-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఆయనకు భార్య పాత్రలో కేథరిన్ నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి కి విchiru{#}Shruti Haasan;Bobby;Makar Sakranti;sree;Wife;January;Trisha Krishnan;Music;cinema theater;Ravi;ravi teja;Darsakudu;Director;Chiranjeevi;Cinemaఆ సినిమాకు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్న చిరు.. ఈసారి ఫుల్ క్లారిటీ..?ఆ సినిమాకు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్న చిరు.. ఈసారి ఫుల్ క్లారిటీ..?chiru{#}Shruti Haasan;Bobby;Makar Sakranti;sree;Wife;January;Trisha Krishnan;Music;cinema theater;Ravi;ravi teja;Darsakudu;Director;Chiranjeevi;CinemaTue, 09 Jul 2024 15:55:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి పోయిన సంవత్సరం వాల్టేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా బాబీమూవీ కి దర్శకత్వం వహించాడు. రవితేజ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... ఆయనకు భార్య పాత్రలో కేథరిన్ నటించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ లలో విడుదల చేశారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేస్తాము అని ప్రకటించారు కానీ ఈ మూవీ కి సంబంధించిన పనులను సంక్రాంతి కి చాలా రోజుల ముందు పూర్తి చేసుకోలేదు. దానితో రెండు , మూడు షెడ్యూల్ లు వేసుకొని ఈ మూవీ యొక్క షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేసి సంక్రాంతి విడుదల చేశారు. అలా ఈ మూవీ షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీ సంక్రాంతి కి రావడం డౌట్ అని కూడా వార్తల వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దర్శకుడు బాబి పక్కా ప్లానింగ్ తో ఈ మూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేశాడు. ఇక వాల్టేరు వీరయ్య సినిమా విడుదల సమయంలో ఎదురెత్తిన సమస్యలు మరోసారి జరగకూడదు అని చిరంజీవి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. విడుదల సమయం దగ్గర పడ్డాక తొందర పడకుండా ముందుగానే ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను చిరంజీవి దగ్గరుండి మరి పూర్తి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ సంక్రాంతి కి చాలా రోజులు మిగిలి ఉండగానే పూర్తి కాబోతున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>