PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-etela-rajendar-kcr-congress-revanth-reddy-harishrao04b982d8-85ed-4ba4-ace7-deaa536ae890-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-etela-rajendar-kcr-congress-revanth-reddy-harishrao04b982d8-85ed-4ba4-ace7-deaa536ae890-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కేసీఆర్ పేరు మాత్రమే. ఉద్యమానికి ఊతమూది ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడంలో ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. ఆయన కృషికి తోడుగా ఎందరో విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఇలా తెలంగాణలోని అన్ని రంగాల వారు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. చివరికి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేసీఆరే సీఎం పీఠాన్ని అధిరోహించారు. మొదటిసారి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్, పేbjp;etela rajendar;kcr;congress;revanth reddy;harishrao{#}Election;central government;Yevaru;Delhi;Party;CM;Parliament;KCR;Bharatiya Janata Party;Congress;Telangana;Assembly;Success;Houseతెలంగాణ:2028 బీజేపీదే..గేమ్ ఛేంజర్ ఈటెలేనా..?తెలంగాణ:2028 బీజేపీదే..గేమ్ ఛేంజర్ ఈటెలేనా..?bjp;etela rajendar;kcr;congress;revanth reddy;harishrao{#}Election;central government;Yevaru;Delhi;Party;CM;Parliament;KCR;Bharatiya Janata Party;Congress;Telangana;Assembly;Success;HouseTue, 09 Jul 2024 06:56:14 GMT- అందరి టార్గెట్ కాంగ్రెస్
- ఖాళీ అవుతున్న బీఆర్ఎస్
- బీజేపీలో విలిన దిశగా కేసీఆర్.


తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కేసీఆర్ పేరు మాత్రమే. ఉద్యమానికి ఊతమూది  ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడంలో ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు. ఆయన కృషికి తోడుగా ఎందరో విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు ఇలా తెలంగాణలోని అన్ని రంగాల వారు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశారు. చివరికి ఢిల్లీ మెడలు వంచి  ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. అలాంటి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  మొదటిసారిగా కేసీఆరే సీఎం పీఠాన్ని అధిరోహించారు. మొదటిసారి ఎన్నో పథకాలు తీసుకొచ్చి అద్భుతమైన పాలన అందించిన కేసీఆర్, పేద ప్రజలకు దేవుడయ్యారు. అయితే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత  ఆయన బుద్ధి మారింది. కుటుంబ పాలన చేసి రాష్ట్రంలో లీడర్లందరినీ తన గుప్పిట్లో ఉంచుకోవాలని అహంకార భావాన్ని చూపించారు.  లీడర్లను గుప్పిట్లో ఉంచుకుంటే పర్లేదు కానీ, రాష్ట్రంలోని ప్రజలను కూడా  రాజ్యాంగబద్ధంగా కాకుండా ఒక రాజులా పాలించాడు.

 నేనొక్కన్నే పథకాలు ఇస్తున్న దేశంలో ఎవరు కూడా నాలాగ పాలన చేయడం లేదని అహంకార భావాన్ని పెంచుకున్నాడు. పామ్ హౌస్ నుంచి పాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని విపరీతమైన అప్పులపాలు చేశాడని చెప్పవచ్చు. అంతేకాదు పరిమితికి మించిన వాగ్దానాలు చేస్తూ, దేశ రాజకీయాలని శాసించాలనుకునే ఆశతో  చివరికి బొక్క బోర్ల పడ్డాడు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరనే విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు. అలా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తొమ్మిది సంవత్సరాల పాలన చేస్తున్న సమయంలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకున్నటువంటి  కాంగ్రెస్, బిజెపిలో అద్భుతంగా ఎదిగాయి. ఇక కాంగ్రెస్ అయితే మొదటి నుంచి తెలంగాణలో ఉంది కానీ, బిజెపి అనేది అసలు తెలంగాణ ప్రజలకు తెలియదు. అలాంటి బిజెపి కూడా  రాష్ట్రంలో పుంజుకుంది అంటే దానికి ప్రధాన కారకుడు కేసిఆర్. మరి కెసిఆర్ 2028 ఎలక్షన్స్ వరకు లేస్తారా? లేదంటే పార్టీని బిజెపిలో విలీనం చేస్తారా అనేది చూద్దాం..

2028 బిజెపి టార్గెట్ :
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తోంది. రాష్ట్రం విపరీతమైన అప్పుల పాలయింది. కాంగ్రెస్ కూడా సాధ్యం కానీ హామీలు ఇచ్చింది. కనీసం కేంద్ర సపోర్ట్ కూడా లేకుండా పోయింది. వారిచ్చిన హామీలను ఐదు సంవత్సరాలపాటు  సాగించాలి అంటే సాధ్యం కాని పని. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ప్రజల్లో మైనస్ అవుతారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కానీ కుడిదిలో పడ్డ ఎలుకలా తయారైంది. పాలన చేసే  సత్తా సామర్థ్యం ఉన్నా, తలకు మించిన అప్పుల వల్ల ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సతమతమవుతోంది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి బిజెపి పార్టీ పుంజుకుంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 8 సీట్లు, పార్లమెంటు ఎలక్షన్స్ లో 8 సీట్లు సాధించి తిరుగులేని పార్టీగా ఎదగడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తోడు ఉద్యమ నాయకుడు అయినటువంటి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిపోయారు. ఒకవేళ రాజేందర్ కు బిజెపి అధ్యక్ష బాధ్యతను ఇస్తే మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది.


అంతేకాదు తాను బీఆర్ఎస్ లో కొనసాగినన్ని రోజులు ఎంతోమంది నాయకులతో సన్నిహితంగా ఉన్నారు. వారందరిని బిజెపిలో చేర్పించి రాబోయే ఎన్నికల్లో టార్గెట్ గా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. ఇదే తరుణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నారు.  కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మాత్రం ఒకసారి బిజెపికి ఛాన్స్ ఇద్దామని ఆలోచన  తప్పక చేస్తారు. అంతే కాదు ఉద్యమ నాయకుడు అయినటువంటి ఈటెల, బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక లీడర్లు అందరిని ఆ పార్టీలో చేర్పించి,  2028 వరకు కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా మార్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ అన్ని సక్సెస్ అయితే మాత్రం  వచ్చే ఎన్నికల్లో బిజెపికి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి చూడాలి కాంగ్రెస్  మెస్మరైజ్ చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని రెండవసారి గెలుస్తుందా? లేదంటే చేతులెత్తి బిజెపికి అధికారం ఇస్తుందా? అనేది రాబోవు రోజుల్లో తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>