PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanti-ravulu-amma-ladies-superstar-vijay-shanthi-chandrababu-telangana-tdp747148c2-4e63-4e7b-9540-1fbe73b9d30c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanti-ravulu-amma-ladies-superstar-vijay-shanthi-chandrababu-telangana-tdp747148c2-4e63-4e7b-9540-1fbe73b9d30c-415x250-IndiaHerald.jpgఆమె పేరుకు మాత్రమే రాములమ్మ. పేరుకు మాత్రమే ఫైర్‌ బ్రాండ్. అయితే ఆమెను తెలంగాణ ప్రజలు నమ్మటం ఎప్పుడో మానేశారు. సినిమా రంగంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి.. రాజకీయంగా మాత్రం అట్టర్ ప్లాప్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే అసలు విజయశాంతి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో..? ఎప్పుడు ఏ పార్టీ నుంచి గోడ దూకుతారో.. ? కూడా అర్థం కాని పరిస్థితి. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. కనీసం ఆమె ఏ పార్టీలో ఉన్న ఆమెకు ఎవరు ? కూడా గుర్తింపు ఇచ్చే అవకాశం కూడా లేదు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాVijayashanti;ravulu Amma; ladies superstar Vijay shanthi; Chandrababu; Telangana TDP{#}Vijayashanti;Yevaru;CBN;TDP;Cinema;Telangana Chief Minister;Telangana;Partyచంద్ర‌బాబును టార్గెట్ చేసిన విజ‌య‌శాంతి... మ‌ళ్లీ పార్టీ మారుతున్నారా ?చంద్ర‌బాబును టార్గెట్ చేసిన విజ‌య‌శాంతి... మ‌ళ్లీ పార్టీ మారుతున్నారా ?Vijayashanti;ravulu Amma; ladies superstar Vijay shanthi; Chandrababu; Telangana TDP{#}Vijayashanti;Yevaru;CBN;TDP;Cinema;Telangana Chief Minister;Telangana;PartyTue, 09 Jul 2024 12:00:00 GMTఆమె పేరుకు మాత్రమే రాములమ్మ. పేరుకు మాత్రమే ఫైర్‌ బ్రాండ్. అయితే ఆమెను తెలంగాణ ప్రజలు నమ్మటం ఎప్పుడో మానేశారు. సినిమా రంగంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి.. రాజకీయంగా మాత్రం అట్టర్ ప్లాప్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే అసలు విజయశాంతి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో..? ఎప్పుడు ఏ పార్టీ నుంచి గోడ దూకుతారో.. ? కూడా అర్థం కాని పరిస్థితి. ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. కనీసం ఆమె ఏ పార్టీలో ఉన్న ఆమెకు ఎవరు ? కూడా గుర్తింపు ఇచ్చే అవకాశం కూడా లేదు. కానీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ తాను కూడా ఉన్నాను అని ఆమె గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.


ఇక తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకుంటుందో లేదో కానీ.. కొంతమంది నేతలు మాత్రం బాగా గింజుకుంటున్నారు. టీడీపీ తెలంగాణలోకి రావడం పెద్ద ప్రజాస్వామ్య ద్రోహం అన్నట్టుగా వారు కామెంట్ చేస్తున్నారు. అలాంటి వారిలో బిఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు.. విజయశాంతి లాంటి వారు కూడా ఉండటం విశేషం. అసలు విజయశాంతి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియట్లేదు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో పర్యటిస్తే అక్కడ ప్రజల నుంచి ఎంత గొప్ప స్వాగత సత్కారాలు లభించాయో చూశాం. ఈ క్రమంలోనే చంద్రబాబు టీడీపీని తెలంగాణలో బలోపేతం చేస్తామని ప్రకటించారు.


దీనిపై స్పందించిన విజయశాంతి అదేదో తెలంగాణ సమాజం పై దాడి అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విచిత్రం. టీడీపీ ప్రయత్నాలు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం వస్తుందని కూడా విజయశాంతి హెచ్చరిక జారీ చేయడం మరి విడ్డూరంగా.. విచిత్రంగా ఉంది. విజయశాంతి పెట్టిన కామెంట్లు చూస్తే తెలంగాణ ఉద్యమం నిధులు, నియామకాల కోసం కాకుండా.. కేవలం రాజకీయ కారణాలతో ఉద్యమం చేశారా ?అన్న సందేహాలు రాక మానవు. మరి విజయశాంతి కామెంట్లు చూస్తే అన్ని పార్టీలు మారిపోయి.. ఏ పార్టీలో ఉన్న ఆమెకు ప్రాధాన్యత ద‌క్కక.. ఇప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ నుంచి రాజకీయం మొదలుపెడదాం.. ఇప్పుడైనా తనకు గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారా.. ? అన్నది ఆమెకే తెలియాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>