PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrfd29f27f-05ec-49c5-b5ca-51147ea7f2a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcrfd29f27f-05ec-49c5-b5ca-51147ea7f2a9-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశాబ్దం అవుతోంది. కానీ ఇప్పటిదాకా కూడా విభజన సమస్యల పరిష్కారం కాలేదు. గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉన్నారు. కానీ రాష్ట్రాల ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కనీసం విభజన సమస్యల పరిష్కారానికి కూడా ఆసక్తి చూపలేదు. పెద్దన్న పాత్ర పోషిస్తానన్న కెసిఆర్ గత ఐదేళ్ల నుంచి వైసీపీకి భజన చేశాడు. జగన్ తో ఎందుకు పనికిరాని ఒప్పందం చేసుకున్నారు. దీంతో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు కదా పూర్తిగా విఫలం అయ్యాయి. ఇప్పుడు మంKCR{#}contract;Comedian;TDP;Red;marriage;politics;Jagan;Andhra Pradesh;Telugu;India;KCR;CM;Congress;Telanganaబాబుపై ఉన్న అసూయే కేసిఆర్ పతనానికి అస్త్రం?బాబుపై ఉన్న అసూయే కేసిఆర్ పతనానికి అస్త్రం?KCR{#}contract;Comedian;TDP;Red;marriage;politics;Jagan;Andhra Pradesh;Telugu;India;KCR;CM;Congress;TelanganaTue, 09 Jul 2024 07:10:00 GMT* బాబుని విలన్ చేసి కమెడియన్ అయిన కెసిఆర్!
* బాబుపై అసూయే కెసిఆర్ కొంపముంచింది!
* పద్ధతి మార్చుకోకుంటే కెసిఆర్ కి సీఎం సీటు కష్టమే!

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) : తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశాబ్దం అవుతోంది. కానీ ఇప్పటిదాకా కూడా విభజన సమస్యల పరిష్కారం కాలేదు. గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీలో జగన్, తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉన్నారు. కానీ రాష్ట్రాల ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కనీసం విభజన సమస్యల పరిష్కారానికి కూడా ఆసక్తి చూపలేదు. పెద్దన్న పాత్ర పోషిస్తానన్న కెసిఆర్ గత ఐదేళ్ల నుంచి వైసీపీకి భజన చేశాడు. జగన్ తో ఎందుకు పనికిరాని ఒప్పందం చేసుకున్నారు. దీంతో విభజన సమస్యలు పరిష్కారం కాలేదు కదా పూర్తిగా విఫలం అయ్యాయి. ఇప్పుడు మంచి వాతావరణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అయితే.. చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో ద్వేషం పెంచేందుకు మరోసారి అసూయ పడుతున్నాడు కెసిఆర్.అసూయ పెంచుకొని తెలంగాణలో చంద్రబాబును విలన్ గా చూపించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆలోచన మారింది. కెసిఆర్ ను అధికారానికి దూరం చేశారు. తెలంగాణ ప్రజలు వాస్తవాలను గుర్తించే పనిలో పడ్డారు. సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాదులో అడుగుపెట్టిన చంద్రబాబుకు టిడిపి శ్రేణులు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రెడ్ కార్పెట్ పరచడంతో తట్టుకోలేక పోతున్నాడు కెసిఆర్.ఈ ఏపీ నాయకుల పెత్తనం తెలంగాణకి అవసరమా? ఏపీ పార్టీలు తెలంగాణలో రాజకీయాలు మొదలెడుతున్నాయి. పెళ్లి ఏపీలో జరిగితే పందిర తెలంగాణలో వేస్తున్నారు అంటూ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు కెసిఆర్. నిజానికి రాజకీయ పార్టీలుగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సామరస్య వాతావరణం అనేది చాలా ముఖ్యం. గత పది ఏళ్లుగా విభిన్న రాజకీయ పరిస్థితులు వల్ల విభజన సమస్యలకు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు పరిష్కరించేందుకు అవకాశం రాగా.. దానిపై కూడా అసూయతో విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అసలు కెసిఆర్ అసూయ చూస్తుంటే.. మళ్లీ తెలంగాణలో తన పతనానికి తానే అస్త్రం తయారు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>