MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood30334b4a-e8eb-4468-9ae9-63f5c30a62d3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood30334b4a-e8eb-4468-9ae9-63f5c30a62d3-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని ఇద్దరు కూడా ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ హీరోలు ఏ సినిమా చేసినా కూడా సినిమా వీరిద్దరి పర్ఫామెన్స్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. టైర్ టు హీరోల్లో ఇద్దరు హీరోలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .ఇకపోతే రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వల్ గా రాబోతోంది. ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ సైతం ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమా tollywood{#}Krack;Winner;Red;Chitram;harish shankar;ram pothineni;Mister;Mass;Blockbuster hit;Remake;Hindi;Tamil;Box office;shankar;India;News;Ravi;ravi teja;Cinemaఒకేసారి బరిలోకి దిగుతున్న రామ్, రవితేజ వర్కౌట్ అవుతుందా..!?ఒకేసారి బరిలోకి దిగుతున్న రామ్, రవితేజ వర్కౌట్ అవుతుందా..!?tollywood{#}Krack;Winner;Red;Chitram;harish shankar;ram pothineni;Mister;Mass;Blockbuster hit;Remake;Hindi;Tamil;Box office;shankar;India;News;Ravi;ravi teja;CinemaTue, 09 Jul 2024 16:09:00 GMTమాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని ఇద్దరు కూడా ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ హీరోలు ఏ సినిమా చేసినా కూడా సినిమా  వీరిద్దరి పర్ఫామెన్స్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. టైర్ టు హీరోల్లో ఇద్దరు హీరోలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .ఇకపోతే రామ్ పోతినేని ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వల్ గా రాబోతోంది. ఇదిలా ఉంటే మాస్ మహారాజా రవితేజ సైతం ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి

 సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లుగా సమాచారం వినబడుతుంది. అయితే ఈ రెండు సినిమాలో కూడా ఒకే తేదీన విడుదల కాబోతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. అంతేకాదు రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే డేట్ కి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. హిందీ హిట్ మూవీ రైడ్ కి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే రామ్, రవితేజ గతంలో ఓ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. 2021లో రామ్ రెడ్ మూవీతో సంక్రాంతికి ప్రేక్షకుల

 ముందుకొచ్చాడు. రవితేజ క్రాక్ మూవీ అదే డేట్ కి రిలీజ్ అయ్యింది. ఈ పోటీలో బాక్సాఫీస్ విన్నర్ గా రవితేజ నిలిచాడు. క్రాక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. రామ్ రెడ్ మూవీ కమర్షియల్ గా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. రెడ్ మూవీ తమిళ్ హిట్ మూవీ రీమేక్ గా తెరకెక్కింది. అయితే ఈ సారి రామ్ స్ట్రైట్ కథతో డబుల్ ఇస్మార్ట్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. రవితేజ రీమేక్ స్టోరీతో పలకరించబోతున్నాడు.. మరి ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడానికి వస్తున్న ఈ హీరోలు ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>