MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar44d1e6e9-8b38-4951-874f-0b3b2371234c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar44d1e6e9-8b38-4951-874f-0b3b2371234c-415x250-IndiaHerald.jpgఇండియన్ సినీ పరిశ్రమలో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతో గొప్ప టెక్నాలజీతో సినిమాలను తెరకెక్కించి వాటితో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియాలోనే గొప్ప దర్శకుడిగా పేరును సంపాదించుకున్నాడు. శంకర్ చాలా సంవత్సరాల క్రితం రజనీ కాంత్ హీరోగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా రూపొందిన రోబో సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇక తాజాగా శంకర్ "భారతీయుడు 2" అనే మshankar{#}aishwarya;Brahmanandam;Nijam;GEUM;Bharateeyudu;shankar;Comedy;Ram Charan Teja;Pawan Kalyan;Heroine;Cinema;Audienceశంకర్ ఒకపట్లా లేడా..ఎందుకు అలాంటి పని చేశాడు..?శంకర్ ఒకపట్లా లేడా..ఎందుకు అలాంటి పని చేశాడు..?shankar{#}aishwarya;Brahmanandam;Nijam;GEUM;Bharateeyudu;shankar;Comedy;Ram Charan Teja;Pawan Kalyan;Heroine;Cinema;AudienceTue, 09 Jul 2024 15:44:00 GMTఇండియన్ సినీ పరిశ్రమలో దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో శంకర్ ఒకరు. ఈయన ఎన్నో సంవత్సరాల క్రితం ఎంతో గొప్ప టెక్నాలజీతో సినిమాలను తెరకెక్కించి వాటితో అద్భుతమైన విజయాలను అందుకొని ఇండియాలోనే గొప్ప దర్శకుడిగా పేరును సంపాదించుకున్నాడు. శంకర్ చాలా సంవత్సరాల క్రితం రజనీ కాంత్ హీరోగా ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా రూపొందిన రోబో సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలు పెద్ద స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.

ఇక తాజాగా శంకర్ "భారతీయుడు 2" అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ జూలై 12 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే మూవీ ని కూడా రూపొందించాడు. ఈ సినిమాకు సంబంధించిన రామ్ చరణ్ పోర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఈ మూవీ కి సంబంధించిన మరో కొంత భాగం షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా భారతీయుడు 2 మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను తెలుగులో జోరుగా నిర్వహిస్తుంది.

అందులో భాగంగా శంకర్ మాట్లాడుతూ ... భారతీయుడు 2 మరియు గేమ్ చేంజర్ సినిమాలో బ్రహ్మానందం గారు చిన్న క్యామియో పాత్రలలో నటించారు. వారంటే నాకు అభిమానం. అందుకే సినిమాల్లో తీసుకున్నాను అని శంకర్ చెప్పారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాల్లో అనవసరంగా కామెడీ సన్నివేశాలు వస్తే ప్రేక్షకులు పెద్దగా వాటిపై ఆసక్తి చూపించడం లేదు. ఒక వేళ శంకర్ కూడా సినిమా కథకు సంబంధం లేకుండా బ్రహ్మానందం ను మూవీ లో ఇన్వాల్వ్ చేస్తే దాని వల్ల సినిమాకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మరి నిజం గానే శంకర్ కథకు సంబంధం లేకుండా బ్రహ్మానందం పాత్రను అందులో చేర్చారా ..? లేక కథతో సంబంధం ఉందా అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>