PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ananth-ambani-2a7e6448-b5e4-48e4-aa9f-5492cd003803-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ananth-ambani-2a7e6448-b5e4-48e4-aa9f-5492cd003803-415x250-IndiaHerald.jpg భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ నుంచి వెడ్డింగ్ వెన్యూ వరకు అన్నిటినీ చాలా లగ్జరీగా ప్లాన్ చేస్తున్నారు. వారు ధరించే దుస్తులు బంగారు దుస్తులు అవుతున్నాయి. అతిథులకు వడ్డించే భోజనాలు పంచభక్ష పరవన్నాలు అవుతున్నాయి. Ananth ambani {#}Kesari;Kasi;Jio;radhika;gold;Event;Fidaa;marriageఅనంత్‌ అంబానీ పెళ్లి: భోజనాల మెనూ చూశారా.. ఇవే ఫుడ్ ఐటమ్స్..??అనంత్‌ అంబానీ పెళ్లి: భోజనాల మెనూ చూశారా.. ఇవే ఫుడ్ ఐటమ్స్..??Ananth ambani {#}Kesari;Kasi;Jio;radhika;gold;Event;Fidaa;marriageTue, 09 Jul 2024 19:24:00 GMT

 భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి బాజాలు త్వరలోనే మోగనున్నాయి. ఆయన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధిక మర్చెంట్ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. వీరి వెడ్డింగ్ ఇన్విటేషన్ నుంచి వెడ్డింగ్ వెన్యూ వరకు అన్నిటినీ చాలా లగ్జరీగా ప్లాన్ చేస్తున్నారు. వారు ధరించే దుస్తులు బంగారు దుస్తులు అవుతున్నాయి. అతిథులకు వడ్డించే భోజనాలు పంచభక్ష పరవన్నాలు అవుతున్నాయి.

అనంత్‌, రాధిక ఎంగేజ్‌మెంట్, ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఘనంగా జరిగాయి. ఆ వీరి పెళ్లి వేడుకల్లో భాగంగా జరిగే ప్రతీ కార్యక్రమం హైలైట్ అవుతోంది. భోజనాలు బాగా నోరూరిస్తున్నాయి. 2024, మార్చిలో ప్రీ వెడ్డింగ్‌ ఈవెంట్ సందర్భంగా గెస్ట్స్‌కు దాదాపు 2,500 రకాల వంటకాలు సర్వ్ చేశారు. జస్ట్ ప్రీ వెడ్డింగ్‌కే అన్ని రకాల వంటకాలతో విందు భోజనాలు పెట్టారంటే.. ఇక పెళ్లికి ఇంకెన్ని రకాల వంటలు పెడతారేమో అని చాలామంది గొప్పగా మాట్లాడుకుంటున్నారు.

జులై 12న పెళ్లి భోజనాలు పెట్టనున్నారు. అయితే ఈ వెడ్డింగ్ మెనూ టోటల్‌గా బయటికి రాలేదు కానీ, కొంత భాగం మాత్రం బయటకి వచ్చింది. ఈ పెళ్లి భోజనాల్లో భాగంగా వారణాశిలో పాపులర్ అయిన 'కాశీ చాట్ బండార్‌' స్టాల్‌ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ఆ చాట్‌ బండార్‌ ఓనర్ ముఖ్య అతిథులకు భోజనాలు సర్వ్ చేస్తారో. ఈ పెళ్లి భోజనాల్లో టిక్కీ, టమాటా చాట్‌, పాలక్‌ చాట్‌, చనా కచోరి, దహీ పూరి, బనారస్‌ చాట్‌, కుల్ఫీ, ఫలూదా వంటి ఆహార పదార్థాలను అతిథులకు వడ్డించనున్నారు. ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ ఈ ఆహారాలను సెలెక్ట్ చేశారని సమాచారం.

నీతా అంబానీ జూన్‌ 24న పెళ్లి పత్రిక పట్టుకుని కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్లారు. అక్కడే చాట్‌ బండార్‌లో ఆహార పదార్థాలను రుచి చూసి ఫిదా అయ్యారు. యజమాని కేసరితో వీటి గురించి మాట్లాడి తన కుమారుడి పెళ్లిలో ఫుడ్ పెట్టాలని విజ్ఞప్తి చేయగా అందుకు కేసరి అంగీకరించినట్లు తెలిసింది. అనంత్, రాధికల పెళ్లి జులై 12న జరుగుతుంది. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వెడ్డింగ్ వెన్యూగా సెలెక్ట్ చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>