Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/court0da3d22c-43c8-41c5-b599-0c333dedd9c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/court0da3d22c-43c8-41c5-b599-0c333dedd9c1-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాలను ప్రేక్షకులకు నచ్చేలా తీయాలనుకునే డైరెక్టర్లు కాస్త అతిగా ఉండేలా సన్నివేశాలను పెట్టడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక ఇలాంటి సన్నివేశాలను చూసి కొంతమంది ప్రేక్షకులు నవ్వుకున్నప్పటికీ ఇంకొంతమంది ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తూ ఉంటారు మరి ముఖ్యంగా వైకల్యం కలిగిన వారిని ఎగతాళి చేసేలా డైలాగ్స్ ఉండడం కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలా ఎగతాళి చేసేలా డైలాగ్స్ పెట్టడం ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నవ్వించాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు. ఇప్పటివరకు చాలా సినిమాల్లోనCourt{#}court;police;Hindi;Cinema;Audienceసినిమాల్లో.. ఇకనుండి అలాంటి డైలాగ్స్ ఉండొద్దు : సుప్రీంకోర్టుసినిమాల్లో.. ఇకనుండి అలాంటి డైలాగ్స్ ఉండొద్దు : సుప్రీంకోర్టుCourt{#}court;police;Hindi;Cinema;AudienceTue, 09 Jul 2024 18:00:00 GMTసాధారణంగా సినిమాలను ప్రేక్షకులకు నచ్చేలా తీయాలనుకునే డైరెక్టర్లు కాస్త అతిగా ఉండేలా సన్నివేశాలను పెట్టడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక ఇలాంటి సన్నివేశాలను చూసి కొంతమంది ప్రేక్షకులు నవ్వుకున్నప్పటికీ ఇంకొంతమంది ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తూ ఉంటారు   మరి ముఖ్యంగా వైకల్యం కలిగిన వారిని ఎగతాళి చేసేలా డైలాగ్స్ ఉండడం కూడా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఇలా ఎగతాళి చేసేలా డైలాగ్స్ పెట్టడం ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నవ్వించాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు.


 ఇప్పటివరకు చాలా సినిమాల్లోనే వైకల్యం ఉన్న వారిని చూపిస్తూ.. బాడీ షేమింగ్ చేసే విధంగా ఎగతాళి చేసే డైలాగ్స్ ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ ఇకనుంచి సినిమాలో అలాంటి డైలాగ్స్ పెట్టారు అంటే చాలు ఇక ఆ చిత్ర బృందం ఇబ్బందులు ఎదుర్కొక తప్పదు అని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ పొరపాటున గాని లేదంటే ఉద్దేశపూర్వకంగా గాని సినిమాలో వైకల్యం కలిగిన వారిని ఎగతాళి చేసే విధంగా డైలాగ్స్ పెట్టారు అంటే ఇక పోలీసులు చర్యలు తీసుకునెందుకు సిద్ధమవుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే విషయంపై ఇటీవలే దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.


 సినిమాలలో దివ్యాంగులను కించపరిచే సీన్స్ ఉండడానికి అస్సలు వీల్లేదు అంటూ ఇటీవల అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అవిటివాడు, స్పాస్టిక్ వంటి పదాలు సామాజిక వివక్షకు దారితీస్తాయి అంటూ అభిప్రాయబడింది సుప్రీంకోర్టు. అంఖ్ మెచోలి అనే హిందీ సినిమాలో దివ్యాంగుల్ని కించపరిచే విధంగా సీన్స్ ఉన్నాయి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం   ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. అయితే ఇలాంటి సన్నివేశాలు కానీ డైలాగులు గాని ఉంటే సినిమా విడుదలకు ముందే ఇక సెన్సార్ బోర్డు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకోవాలి అంటూ సూచించింది సుప్రీంకోర్టు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>