PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5906922a-b99f-4371-bb12-c2f1d8ac147c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan5906922a-b99f-4371-bb12-c2f1d8ac147c-415x250-IndiaHerald.jpgమాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జులై 8న ఘనంగా జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అంతటా పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జులై 8న అతని అభిమానులు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు ఆప్యాయంగా వైయస్సార్‌ను తలుచుకుంటారు. ఈ మహానేత 2004 నుంచి 2009 వరకు తన హయాంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలపై శాశ్వత ప్రభావాన్ని చూపారు. jagan{#}dr rajasekhar;Service;Doctor;Jayanthi;Andhra Pradesh;Telugu;Y. S. Rajasekhara Reddy;Hanu Raghavapudi;Jagan;Reddy;Father;media;CM;Assembly;Telanganaతండ్రిని మించిన కొడుకు అవ్వాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న జగన్..??తండ్రిని మించిన కొడుకు అవ్వాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న జగన్..??jagan{#}dr rajasekhar;Service;Doctor;Jayanthi;Andhra Pradesh;Telugu;Y. S. Rajasekhara Reddy;Hanu Raghavapudi;Jagan;Reddy;Father;media;CM;Assembly;TelanganaTue, 09 Jul 2024 12:00:00 GMTమాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు జులై 8న ఘనంగా జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అంతటా పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జులై 8న అతని అభిమానులు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు ఆప్యాయంగా వైయస్సార్‌ను తలుచుకుంటారు. ఈ మహానేత 2004 నుంచి 2009 వరకు తన హయాంలో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలపై శాశ్వత ప్రభావాన్ని చూపారు.

ఆయన ప్రత్యర్థులు కూడా వైఎస్ఆర్ మంచి మనసుకు మర్యాద ఇచ్చేవారు. రాష్ట్రానికి నాయకత్వం వహిస్తూ అసెంబ్లీ సమావేశాలు, మీడియా ఇంటరాక్షన్స్‌లో వైఎస్ఆర్ చాలా మర్యాదగా మాట్లాడేవారు. అందుకే ఆయనకు మర్యాద తిరిగి ఇచ్చేవారు అందరూ. వైఎస్ఆర్ మరణించి 15 ఏళ్లు గడిచినా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వైఎస్ఆర్ వారసత్వం విశిష్టమైనది. విద్య, వైద్యం, రైతు సంక్షేమం గురించి చర్చలు జరిగినప్పుడల్లా ప్రజలకు, రాజకీయ ప్రముఖులకు వైఎస్‌ఆర్‌ గుర్తుకొస్తారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన ప్రజా కార్యక్రమాలే ఇందుకు కారణం. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, హౌసింగ్, 108 అంబులెన్స్ సేవ వంటి పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయి.

వైఎస్ఆర్ చనిపోయాక ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు, అతను తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తారని, భారీ అంచనాలను అందుకుంటారని అనిపించింది. కానీ జగన్ అందుకు విరుద్ధంగా నడిచారు.  గత ఐదేళ్లుగా జగన్ రాజకీయ శైలిని గమనిస్తే, ఆయన తన తండ్రికి మించి పరిపాలన అందించి, తన తండ్రి కంటే గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించినట్లు అర్థమవుతుంది.

మొదట్లో తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి విలువలను నిలబెట్టేందుకే వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిందని జగన్ చెప్పుకొచ్చారు. ఆయనకున్న పాపులారిటీని ఓట్ల కోసం ఉపయోగించుకున్నారని కొందరు భావించారు. అయితే 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత జగన్ తన తండ్రిని పక్కన పెట్టేసి, తనకే ప్రాధాన్యత ఇచ్చుకునేందుకు ప్రయత్నించారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ ప్రతీకార రాజకీయాలు, హానికరమైన విధానాలు, అభివృద్ధి లేని నిర్ణయాలతో తండ్రికి తగ్గ తనయుడు అనే పేరును పోగొట్టుకున్నారు. రాజశేఖర్ రెడ్డి 2004లో సీఎం అయ్యాక ఎన్నో అభివృద్ధి పనులు తలపెట్టారు. వైఎస్ఆర్ ఎప్పుడూ 'నాయకుడిగా' వ్యవహరించారు కానీ 'డిక్టేటర్'లా కాదు. ఐదేళ్ల పాలన తర్వాత జగన్‌ నియంత లాంటి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఇటీవలి ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ మద్దతుదారులు జగన్‌కు వ్యతిరేకంగా మారారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వైఎస్‌ఆర్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయలసీమలో ఎదురైన ఓటమి ఈ విషయాన్ని ప్రూవ్‌ చేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>