PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tcm-revanth-reddy-dscm-revanth-reddy-tscm-revanth-reddy-chief-minister-revanth-reddy-kodangal-mla-revanth-reddy-telangana-congress-telangana-politicse08d282b-691a-4dd6-9b24-d65d1aa974d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tcm-revanth-reddy-dscm-revanth-reddy-tscm-revanth-reddy-chief-minister-revanth-reddy-kodangal-mla-revanth-reddy-telangana-congress-telangana-politicse08d282b-691a-4dd6-9b24-d65d1aa974d1-415x250-IndiaHerald.jpg- రేవంత్ మ్యాజిక్‌తోనే జీరో నుంచి అధికారంలోకి కాంగ్రెస్‌ - 2018లో ఎమ్మెల్యేగా ఓడి... 2023లో ఏకంగా సీఎం అయిన హీరో - పార్టీలోకి వ‌చ్చిన ఐదేళ్ల‌కే సీఎంగా రేర్ రికార్డ్‌..! ( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఒక వెలుగు వెలిగింది. నిజం చెప్పాలంటే గత 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి 2004 - 2014 మధ్య ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. అనంతరం జరిగినTcm revanth Reddy; dscm revanth Reddy; tscm revanth Reddy; chief minister revanth Reddy; kodangal MLA revanth Reddy; Telangana Congress; Telangana politics{#}revanth;India;GEUM;CM;politics;Nijam;Maha;Yevaru;zero;Revanth Reddy;MP;Telangana;KCR;Congress;Party;Parliament;Telugu Desam Partyజీరో నుంచి ఫ‌స్ట్ ర్యాంక్.... పాతళం నుంచి అధికారం వ‌ర‌కు రేవంత్‌..?జీరో నుంచి ఫ‌స్ట్ ర్యాంక్.... పాతళం నుంచి అధికారం వ‌ర‌కు రేవంత్‌..?Tcm revanth Reddy; dscm revanth Reddy; tscm revanth Reddy; chief minister revanth Reddy; kodangal MLA revanth Reddy; Telangana Congress; Telangana politics{#}revanth;India;GEUM;CM;politics;Nijam;Maha;Yevaru;zero;Revanth Reddy;MP;Telangana;KCR;Congress;Party;Parliament;Telugu Desam PartyTue, 09 Jul 2024 08:08:00 GMT- రేవంత్ మ్యాజిక్‌తోనే జీరో నుంచి అధికారంలోకి కాంగ్రెస్‌
- 2018లో ఎమ్మెల్యేగా ఓడి... 2023లో ఏకంగా సీఎం అయిన హీరో
- పార్టీలోకి వ‌చ్చిన ఐదేళ్ల‌కే సీఎంగా రేర్ రికార్డ్‌..!

( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఒక వెలుగు వెలిగింది. నిజం చెప్పాలంటే గత 50 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీకి 2004 - 2014 మధ్య ఒక స్వర్ణ యుగం అని చెప్పాలి. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. అనంతరం జరిగిన 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయింది. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అక్కడి నుంచి కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌ దెబ్బకు కాంగ్రెస్ కకలా వికలం అయింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుస పెట్టి గులాబీ పార్టీలోకి వెళ్లిపోయారు. చివరకు 2018 ఎన్నికల టైంకి వచ్చేసరికి తెలంగాణలో బీఆర్ఎస్ ను ఒంటరిగా ఎదుర్కోలేని కాంగ్రెస్.. తమ చిరకాల రాజకీయ శత్రువు అయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాల్సిన దుస్థితికి దిగజారింది.


అయినా కూడా ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహా మహులందరూ దారుణంగా ఓడిపోయారు. గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. 2018 లో వరుసగా రెండోసారి కూడా కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీ మళ్లీ తెలంగాణలో బతికి బట్ట కడుతుందని.. అధికారంలోకి వస్తుందని.. ఎవ్వరూ ఊహించలేదు.. అధః పాతాళంలోకి కాంగ్రెస్ వెళ్ళిపోయింది. కేసీఆర్ వరుస పెట్టి దెబ్బ మీద దెబ్బ కొడుతూ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కారెక్కించుకున్నారు.


అలాంటి పార్టీ 2023లో అధికారంలోకి వచ్చింది. అంటే ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అద్భుతాలు జరిగినా.. కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే..! విచిత్రం ఏంటంటే..? తెలంగాణ విభజన జరిగాక జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి.. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరి కొడంగల్‌లో ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడు. పైగా రేవంత్‌ను అనవసరంగా పార్టీలో చేర్చుకున్నారు అంటూ కాంగ్రెస్ సీనియర్ల నుంచి సూటి పోటి మాటలు, ఎన్నో అవమానాలు కూడా ఎదురయ్యాయి. అనంతరం ఐదు నెలలకే జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తనకు సంబంధమే లేని మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి చారిత్రాత్మక విజయం సాధించాడు రేవంత్ రెడ్డి.


అనంతరం పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైనా.. ఉప ఎన్నికలలో పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదని ఎంతోమంది ఎద్దేవా చేశారు. సొంత పార్టీలోనే ఎంతోమంది వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నించినా రేవంత్‌ ఒంటరి పోరాటం చేసి 2023 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తిరుగులేని జెయింట్ కిల్లర్గా నిలిచి తెలంగాణ పొలిటికల్ గేమ్ చేంజర్ గా అవతరించాడు. దేశ రాజకీయాలు ఒక్కసారిగా తెలంగాణ వైపు పడేలా చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>