PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ys-jagan-mohan-reddy-ap-x-cm-jagan-mohan-reddy-kadapa-mp-avinash-reddy-suresh-babu78f029a4-696c-4b23-a08c-10170e38c78d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ys-jagan-mohan-reddy-ap-x-cm-jagan-mohan-reddy-kadapa-mp-avinash-reddy-suresh-babu78f029a4-696c-4b23-a08c-10170e38c78d-415x250-IndiaHerald.jpg- క‌డ‌ప బై పోల్ .. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డ్డ వైసీపీ - రేవంత్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు సురేష్ ( రాయ‌ల సీమ - ఇండియా హెరాల్డ్ ) గత కొన్ని రోజులుగా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేస్తాడని ఓ రేంజ్ లో ప్రచారం న‌డుస్తోంది. జ‌గ‌న్ పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా చేస్తార‌ని.. ఆరు నెల‌ల్లో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌డ‌ప నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేస్తే.. పులివెందుల నుంచి త‌న త‌ల్లి వైఎస్‌. విజ‌య‌ల‌క్ష్మి ని పోటీ చేయిస్తYs Jagan; ys Jagan Mohan Reddy; Ap x CM Jagan Mohan Reddy; Kadapa MP Avinash Reddy; Suresh Babu{#}Suresh;Rayalaseema;devineni avinash;రాజీనామా;Pulivendula;Cheque;Delhi;India;kadapa;revanth;Revanth Reddy;dr rajasekhar;Jayanthi;YCP;Jagan;media;Telanganaజ‌గ‌న్ క‌డ‌ప‌లో పోటీ అంతా అబ‌ద్ధం... సీన్ ముందే అర్థ‌మైందా..?జ‌గ‌న్ క‌డ‌ప‌లో పోటీ అంతా అబ‌ద్ధం... సీన్ ముందే అర్థ‌మైందా..?Ys Jagan; ys Jagan Mohan Reddy; Ap x CM Jagan Mohan Reddy; Kadapa MP Avinash Reddy; Suresh Babu{#}Suresh;Rayalaseema;devineni avinash;రాజీనామా;Pulivendula;Cheque;Delhi;India;kadapa;revanth;Revanth Reddy;dr rajasekhar;Jayanthi;YCP;Jagan;media;TelanganaTue, 09 Jul 2024 12:15:20 GMT- క‌డ‌ప బై పోల్ .. రేవంత్ వ్యాఖ్య‌ల‌పై మండి ప‌డ్డ వైసీపీ
- రేవంత్ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు సురేష్

( రాయ‌ల సీమ - ఇండియా హెరాల్డ్ )

గత కొన్ని రోజులుగా పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ జగన్ రాజీనామా చేస్తాడని ఓ రేంజ్ లో ప్రచారం న‌డుస్తోంది. జ‌గ‌న్ పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి కడప ఎంపీ గా వైఎస్ అవినాష్ రాజీనామా చేస్తార‌ని.. ఆరు నెల‌ల్లో వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ క‌డ‌ప నుంచి పార్ల‌మెంటుకు పోటీ చేస్తే.. పులివెందుల నుంచి త‌న త‌ల్లి వైఎస్‌. విజ‌య‌ల‌క్ష్మి ని పోటీ చేయిస్తారంటూ ప్ర‌చారం గ‌ట్టిగా జ‌రుగుతోంది. అయితే ఈ ప్ర‌చారం లో వాస్త‌వ అవాస్త వాలు ఎలా ?  ఉన్నా జ‌గ‌న్ పార్ల‌మెంటు కే అంటూ వైసీపీ సోష‌ల్ మీడియా కూడా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తూ వ‌స్తోంది.


ఈ ప్రచారానికి చెక్ పెట్టారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు .. క‌డ‌ప మాజీ మేయ‌ర్‌ సురేష్ బాబు. ఇలాంటి దుష్ప్రచారం చేయడం దారుణం అంటూ ఆయ‌న ఖండించారు. నిన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కడపలో ఉప ఎన్నిక జరుగుతుందని చేసిన కామెంట్ల పై కూడా ఓ రేంజ్ లో మండిప‌డ్డారు సురేష్ బాబు.


2011లో జరిగిన కడప పార్లమెంట్ ఉప ఎన్నికలలో జ‌గ‌న్ సాధించిన గెలుపు ను ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేర‌ని ఈ సంద‌ర్భంగా సురేష్ బాబు గుర్తు చేశారు. ఆ ఎన్నిక‌ల్లో కడప దెబ్బ ఢిల్లీ అబ్బా అనేలా ప్రజల తీర్పు ఇచ్చారని.. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ జగన్ కు వచ్చిన మెజారిటీ ఒక చారిత్రాత్మకం అని చెప్పారు. ఇప్పుడు ఏదో కడప ఉప ఎన్నిక అంటూ రాంగ్ మెసేజ్ లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంటే...  రేవంత్ రెడ్డి స్పందించడం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>