MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/manisha-koiralafe86449e-49f8-4060-9cdb-b62312489414-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/manisha-koiralafe86449e-49f8-4060-9cdb-b62312489414-415x250-IndiaHerald.jpg'బికినీ వేస్తేనే ఇండస్ట్రీలో ఉంటావన్నాడు'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్? సీనియర్ టాప్ హీరోయిన్ మనీషా కోయిరాల బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్‌ గా సుదీర్ఘ కాలంగా కొనసాగింది. ప్రస్తుతం ఆమె తన కామెంట్స్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల ఈమె హీరామండీ అనే వెబ్‌ సిరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇంకా కూడా మనీషా కోయిరాలా మీడియా ముందుకు వస్తూనే ఉంది. కెరీర్ స్టార్టింగ్ Manisha Koirala{#}Athadu;Yevaru;Heroine;media'బికినీ వేస్తేనే ఇండస్ట్రీలో ఉంటావన్నాడు'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?'బికినీ వేస్తేనే ఇండస్ట్రీలో ఉంటావన్నాడు'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?Manisha Koirala{#}Athadu;Yevaru;Heroine;mediaTue, 09 Jul 2024 11:58:00 GMTసీనియర్ టాప్ హీరోయిన్ మనీషా కోయిరాల బాలీవుడ్‌ తో పాటు సౌత్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్‌ గా సుదీర్ఘ కాలంగా కొనసాగింది. ప్రస్తుతం ఆమె తన కామెంట్స్ తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇటీవల ఈమె హీరామండీ అనే వెబ్‌ సిరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ వెబ్‌ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఇంకా కూడా మనీషా కోయిరాలా మీడియా ముందుకు వస్తూనే ఉంది. కెరీర్ స్టార్టింగ్ లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలు విషయాలను చెప్పిన మనీషా కోయిరాల తాజాగా మరోసారి తనకు ఎదురు అయిన బికినీ అనుభవం గురించి షేర్ చేసుకుని అందరిని ఎంతగానో ఆశ్చర్య పరిచింది. 
"ఇక సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన కొత్త లో ఒక ఫోటో షూట్‌ కి వెళ్లాను. ఓ ఫోటోగ్రాఫర్ నా వద్దకు బికినీ తెచ్చి ఇచ్చాడు. ఆ బికినీ చూసి నేను వెంటనే షాక్ అయ్యాను. ఇలాంటివి వేసుకుంటేనే ఇండస్ట్రీలో కొనసాగగలవు, అలాగే స్టార్‌ హీరోయిన్ గా పేరు తెచ్చుకోగలవు అని అన్నాడు. కానీ నేను మాత్రం కోపంతో ఆ బికినీ ని తిరస్కరించాను. స్విమ్మింగ్‌ చేసే సమయంలో మాత్రమే నేను ఈ బికినీ వేసుకుంటాను. నేను ఎప్పుడు కూడా షూటింగ్స్ కోసం బికినీ వేసుకోను" అంటూ ఆమె తేల్చి చెప్పిందట. ఇలా అయితే కష్టం అంటూ అప్పుడు ఫోటో గ్రాఫర్‌ ఆ సమయంలో మనీషా కోయిరాల పై అసహనం కూడా వ్యక్తం చేశాడట. "ఇక నేను స్టార్‌ హీరోయిన్‌ అయిన తర్వాత అతడే నా ఫోటో షూట్స్ చాలా చేశాడు. అతడు నన్ను ఆ సమయంలో బికినీ వేసుకోమని ఎంత ఒత్తిడి చేసినా కూడా నేను మాత్రం ఒప్పుకోకుండానే స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకున్నాను" అంటూ అప్పటి విషయాలను సీనియర్ మనీషా కోయిరాలా చెప్పుకొచ్చింది. అయితే ఆ ఫోటో గ్రాఫర్ ఎవరు అనేది మాత్రం ఆమె చెప్పేందుకు నిరాకరించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>