Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajale405d1d3-746f-4af7-8e71-d54cb1904415-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajale405d1d3-746f-4af7-8e71-d54cb1904415-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు హడావిడి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాదు ఇతర దేశంలో కూడా కల్కి మేనియా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ల సునామి కొనసాగుతున్న సమయంలోనే.. మరో భారీ అంచనాలు ఉన్న మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. అదే లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటింKajal{#}kajal aggarwal;Bharateeyudu;Tsunami;Event;Indian;vijay kumar naidu;Prabhas;Box office;Chiranjeevi;Cinemaప్చ్.. ఆచార్య సీన్ రిపీట్.. ఇండియన్-2లో కాజల్ ను తొలగించారు?ప్చ్.. ఆచార్య సీన్ రిపీట్.. ఇండియన్-2లో కాజల్ ను తొలగించారు?Kajal{#}kajal aggarwal;Bharateeyudu;Tsunami;Event;Indian;vijay kumar naidu;Prabhas;Box office;Chiranjeevi;CinemaTue, 09 Jul 2024 16:45:00 GMTగత కొన్ని రోజుల నుంచి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలు హడావిడి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీ రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ వసూళ్ల సునామీ సృష్టిస్తూ దూసుకుపోతోంది అన్న విషయం తెలిసిందే. కేవలం మనదేశంలోనే కాదు ఇతర దేశంలో కూడా కల్కి మేనియా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద కల్కి వసూళ్ల సునామి కొనసాగుతున్న సమయంలోనే.. మరో భారీ అంచనాలు ఉన్న మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది.


 అదే లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు 2. ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇక ఈ సినిమా మొదటి పార్ట్ ఎంత సెన్సేషన్ విజయం సాధించిందో అందరికి తెలుసు. ఇలా భారీ అంచనాల మధ్య మరికొన్ని రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా నిర్వహించారు అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో అటు కమలహాసన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


 కానీ కాజల్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్ తప్పదు అన్నది తెలుస్తోంది. కాజల్కు మెగాస్టార్ హీరోగా నటించిన ఆచార్యలో ఎదురైన చేదు అనుభవమే భారతీయుడు 2 లోను ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే చిరు ఆచార్య సినిమాలో కాజల్ నటించినా.. ఆమె పాత్రను మాత్రం తొలగించారు. ఇక ఇప్పుడు భారతీయుడు 2 లో కూడా కాజల్ పాత్ర కనిపించదట. ఆమె పాత్రను మూడో పార్ట్ లో పెట్టాలని అనుకున్నారట మేకర్స్.ఈ క్రమంలోనే ఇక త్వరలో రిలీజ్ కాబోయే భారతీయుడు 2 లో ఆమె పాత్రను తొలగించారు అన్నది తెలుస్తోంది. అందుకే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రమోషన్స్ లో పాల్గొనడం లేద. మరి మూడవ పార్ట్ లో అయినా కనీసం కాజల్ పాత్రను చూపిస్తారో లేదో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>